Others

విధి విలాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడైనా ఎక్కడైనా క్రమశిక్షణ, కట్టుబాటు మనిషికి అవసరం. తమకి తాము నియంత్రణలో ఉండగలగాలి. నటుడు రాజనాల కాస్త దురుసుగా ఉండేవాడు. ఇండస్ట్రీలో తలబిరుసు మనిషిగా పేరుబడ్డాడు. ఆయనకున్న కొన్ని దుర్వ్యసనాల వల్ల ఆరోగ్యం చెడింది. వేషాలు తగ్గాయి. అంతకుముందు ఆయన వెనుక నిర్మాతలు పడేవారు. పరిస్థితులు మారాక -ఆయనే నిర్మాతల చుట్టూ తిరగడం మొదలెట్టాల్సి వచ్చింది. సినిమా లోకంలో ఇలాంటి సహజమే. జీవిత చరమాంకంలో వేషంకోసం స్టూడియోలు చుట్టూ తిరిగేవారు. అయితే ఆయనకు లభించిన ప్రోత్సాహం అంతంత మాత్రమే. మధుమేహ వ్యాధి ముదిరిపోయి... ఒక కాలు తీసేయాల్సి వచ్చింది. రాజనాల పరిస్థితి తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు, విరాళాల రూపంలో కొంతవరకూ ఆదుకున్నారు. నటుడిగా ఉన్నతస్థితి చేరుకున్నా జాగ్రత్తపడక పోవడంతో రాజనాల జీవితం విషాదాంతంగా ముగిసింది. తనదైన నటన, కంగున మోగే కంఠంతో ఎంతోమంది ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్న రాజనాల చివరి సినిమా -నెంబర్ వన్ (1974). 1998లో కీర్తిశేషులయ్యారు.
దీనస్థితినుంచి ఉచ్ఛస్థితికి వెళ్లొచ్చుగాని, ఉచ్ఛస్థితి నుంచి దీనస్థితికి రావటం తట్టుకోలేని విషయం. హిందీ సినిమాల్లో 1938-45 ప్రాంతాల హీరోయిన్‌గా వెలగిన ఓ నటీమణి చివరి దశలో చర్చిముందు నిలబడి అడుక్కుందన్న వార్త విన్నప్పుడు మనసు కకావికలవుతుంది. మహానటుడైన చిత్తూరు వి నాగయ్య చివరి దశ దయనీయం. ఎన్నో సొంత ఇళ్లు కలిగిన ఆయన చివర్లో అద్దె ఇంట్లో చనిపోతే -ఆ దేహాన్ని కదిలించడానికి పెద్దలు పూనుకోవాల్సి వచ్చింది. కాంచనమాల, మాలతి, పుష్పవల్లి, గిరిజ, కాంచన, దర్శకుడు బిఎ సుబ్బారావు, హరనాథ్, కాంతారావు, కస్తూరి శివరావు దర్శకుడు, కన్నాంబ, నాగభూషణం, సిల్క్‌స్మిత, జెమినీ సంస్థ ఎస్‌ఎస్ వాసన్ వంటివారు దుర్భర జీవితాలే గడిపటం విధివిలాసం అని చెప్పుకోవాలి. ఎందుకు పరిస్థితులు చాలా తారుమారైపోతాయో అర్ధంకాలేదు. మరో గొప్ప నటి సావిత్రి! ఉత్తరాది మహానటి మీనాకుమారి? ఏ కళలో వారు ఆరితేరి రాణించి ఖ్యాతి గడించారో, ఆ కళే వాళ్లను తిప్పలుపెట్టిందా? అనిపిస్తుంది. కారణాలు అనేకం. కొందరిది స్వయంకృతాపరాధం. కొందరిది దాతృత్వం. ఆపాత్రదానాలు తనకుమాలిన ధర్మాలు, ఇలా ఎన్నో కారణాలు కనిపిస్తాయి.

-కె శ్రీనివాసరావు