Others

పనిచేయడంలోనే తృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బట్టలు కుట్టేవాడు
దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీకి రెండుసార్లు ‘కఠిన శారీరక శ్రమ’ను శిక్షగా విధించారు. కొన్ని వారాలపాటు రోజుకు తొమ్మిది గంటలసేపు చిరిగిపోయిన దుప్పట్లను కుట్టడం, మందమైన గుడ్డను చిన్నచిన్న చొక్కా జేబులుగా కత్తిరించడం ఆయన పని. తనకు అప్పగించిన గుడ్డముక్కలను సమయానికంటే ముందే కుట్టి, ఇంకా కావాలని అడిగేవాడు. ఒక భారతీయ కారాగారంలో కొద్దిరోజులపాటు ఆయన ‘సింగర్’ కుట్టుమిషను మీద పనిచేశాడు.
కారాగారంలో తనకు అప్పగించిన పనంతా స్వచ్ఛందంగా చేసేవాడు. కుట్టుమిషను ఉపయోగించడంలో మరింత నైపుణ్యం సంపాదించాలని గాంధీ భావించాడు. నైపుణ్యంగల చేతులకు బదులుగా పనిచేయగల పెద్ద ఆటోమేటిక్ యంత్రాల వాడకాన్ని, పెట్టుబడిదారుల యాజమాన్యంలోని యంత్రాలకు మనిషి బానిసగా మారడాన్ని ఆయన వ్యతిరేకించాడు. మనుషులకు అవసరమైన శారీరక శ్రమను తగ్గించే స్థాయిలో యంత్రాల వాడకాన్ని అనుమతించకూడదని ఆయన విశ్వసించాడు. ఆయన ఉద్దేశంలో ‘‘్భరతదేశంలో ఉన్న సమస్య కొన్ని లక్షలాది మంది శారీరక శ్రమను ఎలా అంతంచేయడం అన్నది కాదు, వారి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయడం.’’ యంత్రాల వాడకంలో ఆయనకున్న అభ్యంతరాలను కుట్టుమిషను విషయంలోమాత్రం పక్కనపెట్టాడు.
ఎందుకంటే ఆయన దృష్టిలో ‘‘్భమిమీద కనిపెట్టిన కొద్దిపాటి ఉపయోగపడే వస్తువులలో కుట్టుమిషను కూడా ఒకటి. బట్టలు కుట్టడానికి తన భార్య ఒట్టిచేతులతో పడుతున్న శ్రమనుచూసి తట్టుకోలేక ఆమె పనిభారం తగ్గించేందుకు సింగర్ కుట్టుమిషను కనిపెట్టాడు. అంటే కుట్టుమిషను మూలాల్లో ప్రేమ ఉంది.’’
‘‘నీ సల్వారు కమీజు కుట్టుకోవడం గురించి ఆందోళన చెందకు. నీకు ఏది అవసరమో అది నేను తయారుచెయ్యగలను. మనం తేలిగ్గా ఒక సింగర్ కుట్టుమిషను సంపాదించగలం. కొద్దిగంటల శ్రమతో మనకు కావలసిన దుస్తులను కుట్టుకోవచ్చు.’’అని ఆయన ఒకానొక సందర్భంలో ఒక మహిళా ఆశ్రమవాసికి లేఖ రాశాడు. ఆయన తన కుట్టుపని నైపుణ్యాల గురించి గర్వించేందుకు తగిన కారణం ఉంది. ఆయన తన భార్య రవికలు కత్తిరించి కుట్టగలిగేవాడు. ఆయన చరఖామీద నూలు వడికి, తానే చేతి మగ్గంమీద స్వయంగా గుడ్డనేసి ఆ బట్టతో తన చొక్కా తానే కుట్టుకునేవాడు. నిపుణులైన బట్టలు కుట్టేవాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు ఆయా పనుల్లో ఆశ్రమవాసులకు ఉచితంగా శిక్షణనిచ్చేవారు. నీలి మందు రైతుల దుస్థితికి వ్యతిరేకంగా గాంధీ చంపారన్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రోజుల్లో ‘‘రైతుల హృదయాలను గెలుచుకొనేందుకు గాంధీ తాత్కాలికంగా, ప్రత్యేకంగా దేశవాళీ దుస్తులు ధరిస్తున్నాడని’’, ఒక బ్రిటిష్ విలేఖరి ఎద్దేవా చేశాడు.
అతనికి బదులిస్తూ గాంధీ ‘‘స్వదేశీ ప్రమాణం చేసిన తర్వాత నేను పూర్తిగా స్వయంగా నా చేతులతో గానీ, నా సహచరుల చేతులతోగానీ నూలు వడికి, నేసి, కుట్టిన దుస్తులనే ధరిస్తున్నాను’’అని రాశాడు. ఆ తర్వాత కాలంలో గాంధీ చొక్కా తొడగడం మానేసి ఒక అంగవస్త్రం, కండువా మాత్రమే ధరించసాగాడు. అప్పుడు కూడా ఆయన అప్పుడప్పుడూ తన అంగవస్త్రం, చేతి గుడ్డల అంచులను కుట్టుకుంటూ ఉండేవాడు. తాను కుట్టుపనిలో తీరిక లేకుండా ఉన్నప్పుడు కార్యదర్శికి లేఖలు చెబుతుండేవాడు. ఆయన ఆగాఖాన్ పాలెస్‌లో బందీగా ఉన్నప్పుడు అక్కడి జైలు సూపరిండెంట్‌కు ఖాదీ జేబురుమాళ్ళు బహుమతిగా ఇచ్చాడు. ఆ జేబురుమాళ్ళన్నిటి మీద సూపరిండెంట్ పేరుని పొడి అక్షరాలలో గాంధీ స్వయంగా చేత్తో కుట్టాడు. అప్పుడు గాంధీ వయస్సు 74 సంవత్సరాలు.
గాంధీకి ఇష్టమైన ఒక శాలువలో చిరుగులను ఖాదీ ముక్కలతో అతడి పర్యవేక్షణలో ఒక మహిళ కుట్టింది. భారతదేశ పేద ప్రజల ప్రతినిధిగా ఆయన అదే శాలువా కప్పుకొని రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ ప్రధాని పక్కన కూర్చున్నాడు. అదే శాలువా కప్పుకొని రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ ప్రధాని పక్కన కూర్చున్నాడు.
*
బహురూపి గాంధీ
రచయత : అనుబందోపాధ్యాయ
తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు)
ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక,
సికింద్రాబాద్-17.. 94907 46614