Others

భగవంతుడు .. భక్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక రామానుజల వారి (1017-1137) సిద్ధాంతము విశిష్ఠాద్వైతము. వారి సిద్ధాంతము ప్రకారము 1. పరమాత్మ, 2. జీవాత్మ, 3. ప్రకృతి. ఈమూడును నిత్యములు. సత్యములు.
కనిపిస్తూ నామరూపాది భిన్నమై, గుణయుక్తమై జడమై, చేతన భోగ్యమైనది ప్రకృతి. జ్ఞాన స్వరూపమై, జ్ఞాన గుణవంతమై, సూక్ష్మమై కర్మఫలానుభూతికి పాంచభౌతిక నానా శరీరములు ధరిస్తూ, వదులుతూ ప్రతి శరీరమైన బద్ధజీవులు, ప్రకృతి ముక్తులు, నిత్యులు అన్న మువ్విధమైన జీవాత్మలు. సర్వవ్యాపియై, సర్వ నియంతయై, విభువై, జగత్సృష్టిస్థితి లయకర్త లక్ష్మీపతి యైన పరమాత్మ అన్నది తత్వత్రయము. (శ్రీదేశికుల తత్వత్రయాధికారము) జడాజడప్రపంచమును సృష్టించి లయింపచేయువాడు. సృష్టించుట అనగా కొత్తగా నిర్మించుట కాదు. తనకు కుక్షిలో సూక్ష్మరూపమున నున్న దానిని స్థూలముగా నావిష్కరించుట సృష్టి. స్థూలమైన దానిని కారణరూపమున సూక్ష్మతకు తెచ్చి లోగొనుట లయము. ఆలయమును క్షీర నీరముల వలె ఐక్యపాదముకాదు. తిల తండులములవలె నుండును.
పరమాత్మకు చిద, చిత్తులు, విశేషణాలు స్థూల దశలోగానీ, సూక్ష్మధశలో గాని అవి అతనిని వదలి ఉండవు. కాన విశిష్టములతో గూడిన వాడొక్కడే ప్రళయమున తనలో నుంచుకున్నవాడే సృష్టిలో వాని నావిష్కరిం చి అంతరాత్మగా ఆధారముగా ఉన్న వాడని, అప్పటి అతనికి, ఇప్పటి ఆతనికి, భేదము లేదు. ఇదే విశిష్టాద్వైతము. 3 రకాల సంబంధాలుచెబుతారు. శేషి- శేషభావము, ఆధారము- ఆధారపడేది, దాస భావము పరమాత్మవై (దాసోహం) పరమాత్మ అన్ని జీవులలో వసిస్తాడు. ఎలాగైతే జీవుడు స్థూల శరీరములో ఉంటాడో శరీర - శరీరి భావము. రామానుజుల మతానుసారము ప్రపత్తి యే ముక్తి సాధనము. ప్రపత్తి భరన్యాసము శరణాగతి అన్నియు ఒక్కటే.
మధ్వాచార్యులు(1199-12787) వీరు ప్రవచించినది ద్వైత సిద్ధాంతము. దీనినే పంచభేద వాదమంటారు. జీవుడు వేరు, దేవుడు వేరు. జీవుడు మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంతే సత్యం. పంచభేదాలు 1. జీవుడు వేరు, బ్రహ్మవేరు, జడజగత్తువేరు, బ్రహ్మవేరు ఒక జీవుడికి ఇతర జీవులకు భేదం ఉంది. జీవుడికి జడజగత్తుకు భేదం, జడజగత్తులో ఒక వస్తువుకు ఇతర వస్తువులకు భేదం ఉన్నది. ఈ భేదాలు నిత్యం శాశ్వతం. జీవుడు ముక్తి పొందిన తర్వాత కూడా ఈ భేదాలు కొనసాగుతాయి. జీవులు మూడు విధాలు. ఒకటవ వర్గము, భగవద్భక్తులై ధార్మిక జీవనము గడుపుతూ ముక్తులౌతారు.
రెండవ వర్గం జననమరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఎప్పటికీ ముక్తులు కాలేరు.
ఇక మూడవ వర్గం వారు భగవద్విరోధులై శాశ్వత నరకము పొందుతారు. ముక్తి అనగా సాలోక్య, సారూప్య, సామీప్య , సాయుజ్యం అని నాలుగు విధాలు. వీరు ప్రజలకు విశేషమైన భక్తి మార్గం చూపారు. వీరుప్రస్థాన త్రయమునకు భాష్యం వ్రాశారు. అనిర్వచనయమైన కృష్ణ్భక్తి మాధుర్యము జనులకందించారు. ఎన్నో మహిమలు ఇప్పటికీ చూడుతున్న శ్రీరాఘవేంద్ర స్వామి మహాతపస్వి. ఈ సంప్రదాయమునకు చెందినవారే. వీరుకూడా మధ్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అనేక గ్రంథాలు వ్రాసారు.
ఈ మూడు సిద్ధాంతాలలో వ్యాసుల అభిప్రాయం చెప్పడానికి వీలులేదు. కారణం శ్రుతి ప్రమాణము. ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతాలకు సమానంగా ఉన్నాయి. ముగ్గురు ఆచార్య పురుషులు అవతార పురుషులు. శంకరం శంకరాచార్యం అన్నారు. సూత సంహితననుసరించి భాష్యం వ్రాసారు. చతుర్థి స్హహశిష్యైస్తు శంకరోఅవతరిష్యతి ఇక రామానుజల వారు శేషుని అవతారం. అనంతః ప్రథమం రూపం లక్ష్మణస్తు తతఃపరమ్ బలభద్రస్తు తీయంతు కలౌకశ్చిద్భవతి. వీరి భాష్యంలో భోదాయనాత్తి అనుసరించి వ్రాసారు. మధ్వాచార్యులు వాయుదేవుని అవతారం. ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమసేనకః పూర్ణప్రజ్ఞ సృతీయస్తు భగవతార్క్య సాధకః. అద్వైతానికి అహం బ్రహ్మాస్మి (నేనే బ్రహ్మను) తత్వమసి నీవే బ్రహ్మవు. అయమాత్మాబ్రహ్మ ఈ జీవుడు బ్రహ్మ. మొదలైనవి సూత సంహితయందు యజ్ఞ వైభవ ఖండమున ఏకమేవ ద్వితీయం స్యాదిత్యాహ శ్రుతి రాగ రాత్ ఒక్కటే రెండవది లేదు. ద్వితీయా ద్వైభయం వాల్పేసుఖం రెండవది ఉండిన భయం. అలాగే శ్రుతి యందు ద్వైతమునకు పృథగాత్మానం ప్రేరితం చమత్వా తనకంటే తన్ను ప్రేరేపించు అంతర్యామిని భిన్నంగా ద్వాసంపర్ణ సయుజాసభావి సమానదృక్షం ఫరిష్యస్వ జాతే (ఒకే చెట్టు యందు జీవేశ్వరులను 2 పక్షులు గలవు. ఖగ సూత్ర సామ్యంగా ఈ ముగ్గురు ఆచార్య పురుషులుకారణ జన్ములు. శంకరడు ప్రచ్ఛన్న బౌద్ధుడు కాదు. కనబడని ద్వైతి. కారణము వారు ఎన్నో అవైదిక మతాలనుఖండించి వైదిక ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. ఎన్నో స్తోత్రాలు శివుని పైన, విష్ణువు పైన, అమ్మవారిపైనా రచించారు.
ఎన్నో పుణ్యక్షేత్రాలలోని దేవతాపూర్తులను అఖండ తేజస్సుప్రజలకు చాటి చెప్పారు. వైష్ణవులు, మధ్వులు, భజగోవింద శ్లోకాలు నృసింహ కారవలంబన స్తోత్రాలు పారాయణం చేస్తారు. వారు వ్రాసిన కాలభైరవాష్టకం సుప్రసిద్ధమైనది. అలాగే రామానుజం వారు భగవంతుని దాసభావంతో పూజించాలన్నారు. వారు బోధించిన శరణాగతి, భరన్యసము వలన ముక్తి అతి సులభంగా వస్తుందన్నారు. గురువు ఉనకానికి పోతానన్న వినక శ్రీరంగం గుడి శిఖరంపై నిల్చి వారికి బోధించిన అష్టాక్షరీ మంత్రము సర్వులకు ఉపదేశించారు. వారు ఏర్పరచిన ఆగమ సాంప్రదాయు ఇప్పటికీ వైష్ణవాలయంలో ఆచరిస్తున్నారు.
నేటికికిన ఆరాధిస్తూ వారి సకల కోరికలు తీర్చుకుంటున్నారు. దేశికుల శ్రీస్తుతి, కుల శేఖర ఆళ్వారు ముకుందమాల, విష్ణు సహస్రనామ భాష్యం, తిరుప్పావై జగత్ప్రసిద్ధము. అలాగే మధ్వాచార్యులు ప్రవచించిన భక్తిమార్గం లోకానికి ఆదర్శం. నమే భక్తః ప్రణశ్యతి. భక్తికి మించిన ఆయుధం లేదు. వారి కృష్ణ్భక్తి వర్ణింప నలవిగాదు.
ఎందరో తర్వాతి కాలంలో ఈ భక్తిమార్గం ననుసరించి తరించరు. రాజగోపాలచారి గారు భక్తి లేనిదే జ్ఞానము లేదన్నారు. ఈముగ్గురు ఆచార్య పురుషులు అవతరించి ఉండకపోతేభారతదేశపు దశ దిశ ఊహించుట కష్టం. భగవంతుడు ఎదురుగా సాక్షాత్కరించగా భగవంతునిగా మనము మారినా పరిపూర్ణ శరీర భ్రాంతి తొలిగిన వెంటనే సర్వము మనకు అవగతవౌతుంది.
ఏ సంప్రదాయాన్ని ఆచరించిన గమ్యం ఒక్కటే. సంగీత త్రిమూర్తులు త్యాగరాజు, శ్యామశాస్ర్తీ, ముత్తుస్వామి దీక్షితులనంటారు.అలాగే యావత్ప్రపంచానికి వెలుగును చూపిన వీరు వేదాంత త్రిమూర్తులు.

- కె. రఘునాథ్ , 9912190466