AADIVAVRAM - Others

పొగాకుపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొగాకు మీద పోరాటంలో నియంత్రణలే ప్రధాన అడ్డంకి - అని ఏఈక్విటాస్‌లో ఎకనామిస్ట్ మరియు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్‌గా ఉన్న ఆమిర్ ఉల్లాఖాన్ ఆరోపిస్తున్నారు. గతంలో ఆయన బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫొండేషన్‌తో పని చేశారు.
ఏదైనా ప్రభావవంతమైన ఆరోగ్య సంరక్షణ విధానానికి దృఢమైన నియంత్రణలనేవి మూలాలుగా ఉంటాయి. ఆ నియంత్రణలు విఫలమైతే, ఆ విధానాలూ కుప్పకూలుతాయి. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ (ఎండ్స్) మీద విధించిన నిషేధం అనేది దీనికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, ఒక్క పొగాకు కారణంగానే ఈ దేశంలో ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు.
ప్రపంచంలో సిగరెట్లు కాల్చేవారిలో దాదాపు 11.2% మంది భారతదేశంలోనే ఉన్నారు. గ్లోబల్ టొబాకో అట్లాస్ ప్రకారం, సిగరెట్ల రూపంలో పొగాకు కాల్చడం కోసం 2018లో భారతదేశం సుమారుగా 27.93 బిలియన్ డాలర్లు వెచ్చించింది. 2018 ఆగస్టు లెక్కల ప్రకారం, భారత జీడీపీలో ఇది దాదాపు 1%. సరిగ్గా చెప్పాలంటే, నేడు భారత ప్రభుత్వానికి ఇది ఒకానొక అతి పెద్ద సమస్యగా ఉంటోంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా, కఠినమైన పన్నులు, లేబుల్ మరియు ప్రకటనల మీద నియంత్రణలు, మరియు డబ్ల్యుహెచ్‌ఓకి చెందిన ఎం-పవర్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇతర పొగాకు నియంత్రణ విధానాల ఫలితంగా ఈ దేశంలో పొగాకు వినిమయంలో తగ్గుదల నమోదైంది.
అయితే, పొగాకు నియంత్రణ కోసం విధానాలు పటిష్టం చేయడం మరియు పలు కార్యక్రమాలు రూపొందించడం ద్వారా భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, లక్ష్యానికి మాత్రం ఇంకా చాలా దూరంలోనే ఉంటోంది. నిజానికి, గుట్కా మరియు ఇతర రకాల పొగాకు ఉత్పత్తుల మీద అనేక సంవత్సరాల క్రితమే ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, వాటి అమ్మకాలు మాత్రం స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. వీటి నిషేధం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలన్నీ దాదాపు పూర్తిగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే గొప్ప ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఈ మార్గంలో ప్రయాణించిన ఇతర దేశాల ప్రత్యామ్నాయ నియంత్రణ చర్యలు మరియు పాఠాలను భారతదేశం నేర్చుకోవాల్సిన అవసరముంది.
ఇతర దేశాల విజయ మార్గంలో
భారత్ ప్రయాణించాలి
ప్రపంచంలోని ఇతర దేశాలు పొగ తాగేవారి కోసం తక్కువ ప్రమాదం కలిగిన ప్రత్యామ్నాయం అందించడమనే ఎంపిక ద్వారా మెరుగైన ఆరోగ్య సంరక్షణ నిర్ణయాలకు బాటలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మన దేశంలో పొగ తాగేవారికి ఇలాంటి ఒక చక్కటి ఎంపికను మనం దూరం చేయవచ్చా? ఇక్కడ తర్కం చాలా సులభంగా బోధపడుతుంది. పొగాకు ఉత్పత్తులు అడుగడుగునా అందుబాటులో ఉండగా వాటిని మర్చిపోవాలంటూ పొగాకు వ్యసన పరులకు చెప్పడమంటే అది నిస్సందేహంగా చచ్చిన గుర్రాన్ని నిలబెట్టే ప్రయత్నం లాంటిదే తప్ప మరొకటి కాదు.
ఇప్పుడు మనం ప్రశాంతంగా, పునరాలోచించడం ద్వారా మొత్తం వివాదాన్ని శాస్ర్తియ ఆధారాల కోణంలో చూడాల్సిన సమయం వచ్చింది. విధ్వంసకర ఆవిష్కరణలు సైతం తెరమీద కొస్తున్న ఈ యుగంలో, వినియోగదారు సంక్షేమం అనే లక్ష్యం కలిగిన నియంత్రణల విషయంలో మనం ఉదాసీనంగా మరియు బద్దకంగా ఉండే వీల్లేదు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో విజయవంతమైన పరిష్కారాల గురించి మనం లోతుగా పరిశోధించి చూడాలి. ఉదాహరణకు, ఎండ్స్ అనేవి నికొటిన్‌కు ప్రత్యామ్నాయ వనరుగా ఉండడం ద్వారా సిగరెట్ తాగడం వల్ల వినియోగదారులు తారు, కేన్సర్ కారకాలు, మరియు ఇతర విష పదార్థాల ప్రభావానికి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది.
చాలా దేశాలు ఎండ్స్ వల్ల లభించే ప్రయోజనాలు మరియు పొగ తాగేవారికి లభించే అనుకూలతల మీద దృష్టి సారిస్తున్నాయి. ఈ దేశాలు ఎండ్స్ మీద పూర్తి నిషేధం విధించడానికి బదులుగా వాటి వినియోగానికి సంబంధించి ప్రభావవంతమైన చట్టాలు రూపొందిస్తున్నాయి. మరియు వాటిని మైనర్లకు అమ్మడాన్ని నియంత్రిస్తున్నాయి. నియంత్రణ చట్టాలతో పొగాకు పరిశ్రమలు కలిగిన కెనడా మరియు స్వీడన్ లాంటి దేశాలు పొగ తాగేవారి సంఖ్యలో రికార్డు స్థాయి తగ్గుదలతో పాటు 2025 పొగాకు నియంత్రణ లక్ష్యాలను ఇప్పటికే చేరుకున్నాయి. యుఎఇ, సీషెల్స్, మరియు థాయ్‌లాండ్ లాంటి అనేక దేశాలు గతంలో ఈ విభాగం మీద నిషేధం విధించినప్పటికీ, ఇప్పుడు ఈ విభాగాన్ని నియంత్రించే నియంత్రణలు రూపొందించడం ద్వారా తమ దేశంలోని పొగ తాగేవారికి నాణ్యత నియంత్రణ కలిగిన ఉత్పత్తులు లభించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. న్యూజిలాండ్‌లో 2018 నవంబర్‌లో, పొగ లేని పర్యావరణాల చట్టం - 1990 సవరణ కోసం ఒక ప్రజా ప్రతిపాదనను విడుదల చేసింది. పొగ తాగేవారు తక్కువ హానికరమైన ప్రత్యామ్నాయాల వైపు మళ్లడానికి ప్రభుత్వం మద్దతిస్తోందని పేర్కొంది. నేటి తరం పొగ తాగేవారి కోసం తక్కువ హానికర పొగాకు ఉత్పత్తుల అమ్మకాల కోసం ఆన్‌లైన్ వనరుల ఆమోదం మరియు వాటి గురించిన ప్రచారాన్ని న్యూజిలాండ్ గత నెల ప్రారంభించింది. పొగ తాగడాన్ని మరియు ఇతర తక్కువ హానికర పొగాకు ఉత్పత్తులను చట్టబద్ధం చేస్తూ న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచంలోనే అత్యంత పురోగామి చర్యగా ఉంటోంది.
సంపూర్ణ నిషేధం అనేది ఈ పెను సమస్యకు పరిష్కారం కాదు
ఉత్పత్తుల విభాగం మీద పూర్తి నిషేధం విధించడానికి బదులుగా ప్రభావవంతమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా సాక్ష్యాధారాలు అధ్యయనం చేయడం ద్వారా నియంత్రణ సంస్కరణల మీద భారతదేశం దృష్టి పెట్టడం ముఖ్యం. ఇ-సిగరెట్ల విషయంలో మనం అనుకూల విశే్లషణాత్మక వైఖరి అనుసరించాలి. ప్రవర్తనా విధానాల అధ్యయనం కోసం నిపుణులతో మాట్లాడటంతో పాటు ప్రస్తుత శాస్ర్తియ పద్ధతులను పరిశోధించాలి. అంతే తప్ప, ప్రత్యేకించి ఒక విలువైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఒక విభాగాన్ని పూర్తిగా నిషేధించడం సరికాదు. పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ ద్వారా బాధ్యతాయుత సంస్థలు మాత్రమే ఇలాంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంతోపాటు వినియోగానికి సంబంధించి అవసరమైన ప్రమాణాలు పాటించేలా మరియు ఇతర నియంత్రణలను పాటించేలా చూడాలి. నిషేధం అనేది వినియోగదారు ఎంపిక హక్కుని ఉల్లంఘించడమే కాకుండా ఎండ్స్ చట్ట వ్యతిరేక వ్యాపారానికి మార్గం వేసే ప్రమాదం ఉంది. సిగరెట్ల పరిశ్రమలో నాలుగో వంతుగా ఉన్న చట్ట వ్యతిరేక సిగరెట్ల మీద యుద్ధం చేస్తున్న భారత ప్రభుత్వానికి ఇది మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది.
భారతదేశం ఇప్పటికే అనేక ఆరోగ్య సంరక్షణ సమస్యల మీద యుద్ధం చేస్తోంది. మధుమేహానికి మనం ప్రపంచ రాజధానిగా ఉన్నాము. ఇది చాలదన్నట్లు, మరోవైపు కేన్సర్ కేసులు మరియు వ్యక్తిగత వ్యాధుల కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన ఒక విభాగపు ఉత్పత్తుల మీద పూర్తి నిషేధం విధించడానికి బదులు ఇతర ప్రాధాన్య అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడం మంచిది. ఒక సాధారణ ఉత్పత్తి శ్రేణి మీద దృష్టి పెట్టడం కంటే దేశ ఆరోగ్యానికి ప్రమాదంగా మారిన ఇతర ప్రధాన సమస్యల మీద దృష్టి సారించడం మంచిది.
కాబట్టి, ఇ-సిగరెట్ల మీద నిషేధం విధించడం ప్రభుత్వపు 100 రోజుల అజెండాలో భాగం కావడానికి ముందు, పొగాకు పరిశ్రమను సంపూర్ణంగా మూసివేయడం గురించి ఎందుకు మాట్లాడరు? ఎవరివో స్వార్థ ప్రయోజనాలే ఇందుకు కారణమా అని ఎవరికైనా అనిపిస్తే అందులో ఆశ్చర్యం లేదు.

-కాటపల్లి అశోక్‌కుమార్ 8978667660