Others

పునరుజ్జీవనానికి పునాదులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2019 సెప్టెంబర్ 27న ఢిల్లీలో 30 దేశాలకు చెందిన 50 మీడియా సంస్థలు 80 మంది పాత్రికేయులతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సర్‌సంఘ సంచాలకులు మోహన్‌జీ భాగవత్ రెండున్నర గంటల ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మోహన్‌జీ భాగవత్ ‘‘హిందుత్వం అనేది భారతీయ సాంస్కృతిక విలువల సారాంశము; విభిన్న విశ్వాసాలున్న ప్రజలమధ్య సోదరభావాన్ని పెంపొందించటమే దాని లక్ష్యం. హిందూ రాష్టమ్రంటే ముస్లింలకు ఇక్కడ స్థానం లేదని అర్థం కాదు; అన్ని విశ్వాసాలు, మతాలను కలుపుకొనిపోవటమే ఈ భావన అసలు ఉద్దేశము. హిందుత్వం అంటే ‘వసుధైవ కుటుంబకం’ అని వివరించారు.
వేల సం.లనుండి ఈ దేశంలో వికసించిన సర్వసంథ సమభావన సారాంశమే హిందుత్వం ఈ దేశం బాధితులు, దుఃఖితలకు ఆశ్రయమిచ్చి ఆదరించిన దేశం. ప్రపంచంలో వికసించిన అనేక ఆలోచనలకు స్వాగతించిన దేశము. అన్నిటిని సమన్వయపరచుకొని మధ్యేమార్గంలో ప్రయాణం చేసే ఏకైక దేశం భారత్. ఈ విషయంలో మనం గర్వపడాలి. అందుకే ఈ దేశం ఎవరిపట్ల విద్వేషం నిర్మాణం చేయదు అనేది శతాబ్దాల చరిత్ర మనకు అర్థం చేయిస్తున్నది. ఈ దేశంమీద దాడిచేసిన విదేశీయులను ఎదుర్కోవటంలో కూడా ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రేరణ. ఆత్మరక్షణే ఈ దేశం యొక్క వౌలిక స్వభావం. ఈ విషయాలను సరిగా అర్థం చేసుకొంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని అర్థం చేసుకోగలుగుతాము. సంఘం ఈ దేశం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు ఆధారంగా పనిచేస్తూ సమాజాన్ని సంఘటితం చేసే ప్రయత్నమే చేస్తున్నది.
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి రేపు వచ్చే విజయదశమికి 94 సంవత్సరాలు పూర్తిచేసుకొని 85 సంవత్సరంలో ప్రవేశిస్తున్నది. హిందూ సమాజ సంఘటనే లక్ష్యంగా పనిచేసుకొంటూ వస్తున్నది. ఈ 94 సంవత్సరాలలో సంఘం అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. రాజ్యశక్తి సంఘ శక్తిని చూసి తమతో కలుపుకోవాలని ప్రయత్నం చేసింది. సంఘము ఒక సామాజిక శక్తి. జాతీయ శక్తి రాజ్యశక్తితో కలవదు. అందుకే సంఘము పెరుగకూడదు అని కాంగ్రెస్ ప్రభుత్వం మూడుసార్లు నిషేధించింది. ప్రతి నిషేధం తరువాత సంఘం ద్విగుణీకృత ఉత్సాహంతో మరింత వేగంగా దూసుకొనిపోయింది. సంఘం ఈ రోజున దేశమంతా అన్ని జిల్లాలు; అన్ని సముతులు, తాలూకాలకు విస్తరించి అన్ని మండలాలకు చేరుకొనే దిశగా వేగంగా అడుగువేస్తున్నది.
1857 సం.లో ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వంపై జరిపిన పోరాటంలో విఫలమైనాము. అది ఈ దేశ పెద్దల మనస్సులలో అనేక ఆలోచనలు రేకెత్తించింది. ఈ ఆలోచనలను నాలుగు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. అందులో 1. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయాలి. సాయుధ సంఘర్షణ మార్గంలో ముందుకు సాగాలని ఆలోచన వచ్చింది. దాని ఫలితమే గదర్ సంస్థ. దాని నుండి విప్లల సంస్థలు పుట్టుకొని వచ్చాయి. అవి కొంత ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నాలు నేతాజీవరకు సాగింది. ఈ దిశలో అనేకమంది మహాపురుషులు దేశం కోసం సర్వస్వము అర్పణ చేశారు. నేతాజీ తరువాత అది ముందుకు సాగలేదు. 2.విప్లవకారులు వైఫల్యం తరువాత ఇక్కడి పెద్దలలో విప్లవ మార్గం కాకుండా పాశ్చాత్య దేశాలలోలాగా ఈ దేశ ప్రజలలో రాజకీయ చైతన్యము తీసుకొని రావాలని భావించారు. సర్వసాదారణ వ్యక్తిని కూడా స్వాతంత్య్రం కోసం రోడ్డు ఎక్కించిన ఘనత దానిది. కాని ఈ ప్రయత్నాలు సామాజిక చైతన్యము తెచ్చే బదులు రాజకీయ స్వార్థాన్ని నిర్మాణం చేయటం ప్రారంభించింది. ఇది కూడా దేశానికి నష్టం చేస్తుందని కొందరికి అనిపించింది. దానికోసం జరిగిన ప్రయత్నం మూడవది. 3.సమాజంలో సంస్కరణలు తేవాలని ప్రయత్నాలు ప్రారంభమైనాయి. సామాజిక దురాచారాలను తొలగించుకోవటానికి చేసిన ప్రయత్నాలు కొంతమేరకు ప్రభావం చూపాయి. ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ దిశలో పనిచేసిన అనేకమంది సమాజం ముందు ఆదర్శంగా నిలబడ్డారు. ఈ ప్రయత్నాలు సఫలం కాకపోవటంతో సమాజం వెనక్కి తిరిగి మన మూలాలవైపు ఆలోచించాలనే ప్రయత్నం ప్రారంభమైంది. అది నాల్గవ ప్రయత్నం. 4.ఈ దిశలో ఆర్యసమాజ్ స్థాపకులైన స్వామి దయానంద సరస్వతీ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరవింద, బంకించంద్ర ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాల ఫలితమే సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదులు పడ్డాయి. ఆ అవసరం నేడు కూడా కనిపిస్తున్నది. ఆ పరంపరలో రవీంద్రనాధ్ ఠాగూరు చెప్పినట్లు దేశంలో ఏకాత్మతాభావము పునర్ జాగృతం కావాలని చెప్పారు. వైవిధ్యభరితమైన ఈ దేశానికి ఏకాత్మతాభావంతో నడపించగల నాయకత్వం నికసించాలనే భావన వచ్చింది. దాని కొనసాగింపే డాక్టర్ హెడ్గేవార్ ప్రయత్నంలో ఏర్పడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘము.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం అంటే ఏమిటి? ఇది ఒక మెథడాలజీ, అంటే ఒక విధానము. అంటే ఒక కార్యప్రణాళిక సంఘం కార్య ప్రణాళిక వ్యక్తి నిర్మాణము; ఎటువంటి వ్యక్తులు నిర్మాణం కావాలి, దేశ హితం కోసము ఎట్టి పరిస్థితులలో తన కర్తవ్యం నుండి విముఖుడు కాకుండా స్థిరంగా నిలబడి సంపూర్ణ సమాజంలో ఆత్మీయ సంబంధాలు కలిగి ఉండాలి. ఎవరి పట్ల భేదభావం, శతృత్వ భావన లేకుండా అందరిని కలుపుకొనిపోగల వ్యక్తి. అందుకే సంఘము ఈ దిశలో ప్రయత్నం చేస్తున్నది. ప్రతి గ్రామంలో ప్రతినిధులు ఇటువంటి వ్యక్తులను తయారుచేయటమే సంఘం యొక్క యోజన. ఈ దిశలో గడిచిన 94 సంవత్సరాలలో లక్షలమంది స్వయం సేవకులు వేలాదిమంది కార్యకర్తలను అన్ని వయస్సులలో తయారుచేసుకొంటూ వస్తున్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో ప్రారంభమునుండి ఒక మాట చెప్పబడుతూ ఉంటుంది. సంఘము ఏమీ చేయదు, స్వయంసేవకులు అన్ని చేస్తారు. ఇట్లా ఎందుకు చెబుతున్నారు అన్నది ప్రారంభంలోనే కాదు ఇప్పటికీ కొద్దిమందికి అర్థం కాదు. ఈ రోజున దేశంలో సంఘ స్వయంసేవకు నిర్మాణం చేసిన చమత్కారము అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. సంఘ స్వయం సేవకులు సమాజంలోని అన్ని జీవన రంగాలలో ప్రవేశించి పనిచేస్తూ తమదైన ముద్ర వేస్తూ సమన్వయభావంతో ఈ దిశలో పనిచేస్తున్న అనేకమందిని కలుపుకొంటూ ముందుకు సాగుతున్నది. నేను కూడా ఈ పనిలో భాగస్వామిని కావచ్చు అనే ప్రేరణ కలిగిస్తూ ముందుకు సాగుతున్నాము. అదే ఈ దేశము యొక్క ఆమూలాగ్ర పరివర్తనకు పరుగులెత్తిస్తున్నది. ఈ సందర్భంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొందాము.
‘‘దీనదయాళ్ పరిశోధన కేంద్రం’ ఢిల్లీలో ఉన్నది. దాని కేంద్రంగా గ్రామీణ వికాసము కోసము పనిచేస్తుంటారు. వ్యవసాయము, గ్రామీణ వ్తృల వికాసము కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము ఉపయోగించి పనిచేయటం జరుగుతున్నది. 1978 సం.లో నానాజీ దేశ్‌ముఖ్ రాజకీయాలనుండి బయటకు వచ్చి ఉత్తరప్రదేశ్‌లోని గొండా జిల్లాను దత్తత తీసుకొన్నారు. దేశంలోనే వెనుకబడిన జిల్లా అది. ఆ జిల్లా నేడు సమగ్రాభివృద్ధి ఎట్లా ఉంటుందో అనేకమంది చూసేందుకు వెళ్తూ ఉంటారు. చిత్రకూట్ కేంద్రంగా 500 గ్రామాల సమగ్రాభివృద్ధికి పని జరుగుతున్నది. చిత్రకూట్ ఒక పెద్ద పరిశోధన కేంద్రం. గో ఆధారిత వ్యవసాయము, ధైర్యం, గ్రామీణ వృత్తుల అభివృద్ధికి కృషి జరుగుతున్నది. గ్రామాలలో వ్యవసాయము, విద్య, వైద్యం, గ్రామీణ వృత్తులు ఆధారంగా స్వయం సమృద్ధికి కృషి జరుగుతున్నది. ఈ కేంద్రానికి డా. అబ్దుల్ కలాం లాంటి ప్రముఖులు అనేకమంది అధ్యయనం కోసం వెళ్లివచ్చారు.
1990 సం. సేవాభారతి ప్రారంభించబడింది. డాక్టర్‌జీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా నిధి సేకరణ జరిగింది. దాని ఆధారంగా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా 1,50,000కి పైగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ‘రాష్ట్రీయ సేవాభారతి’ అంబరిల్లా సంస్థ నడుస్తున్నది. దేశవ్యాప్తంగా వందలాది ఎన్‌జిఓలు ఆధారంగా పనులు చేస్తున్నారు. సేవాభారతి ఆధ్వర్యంలో 3 సం.లకు ఒకసారి సేవాసంగం నిర్వహిస్తున్నారు. ఈ సం. భాగ్యనగర్ సేవాసంగం నిర్వహించారు. సేవాసంఘం సంస్థలే కాక 200 ఎన్‌జిఓలు అందులో పాల్గొన్నారు. మూడు రోజులు చాలా సమీక్ష జరిగింది. రాష్ట్రీయ సేవా భారతి ఆధ్వర్యంలో ఢిల్లీలో 2018న జాతీయ స్థాయిలో సేవా సంఘం జరిగింది. దానిలో 2000లకు పైగా ఎన్‌జిఓలు పాల్గొన్నారు. విప్రో సంస్థ అధినేత ప్రేమ్‌జీ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇట్లా దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు కృషి జరుగుతున్నది. ఇట్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు దేశమంతా పనిచేస్తున్నారు. సమీప భవిష్యత్తులో దేశంలో పెనుమార్పులు చోటుచేసుకొంటాయి. సంఘము-సమాజము ఒక్కటిగా కలిసిపోవటానికి విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది శుభసూచకము.
సుమారుగా ఒక దశాబ్దంపైగా గోసంరక్షణ, గోఆధారిత వ్యవసాయం వికాసం కోసము పనులు ప్రారంభించబడ్డాయి. ఈ రోజున దేశమంతా అన్ని జిల్లల్లో ఈ పనులు విస్తరించాయి. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా జరుగుతున్న ఈ పనుల ప్రభావం సమాజంపై ఉన్నది. ఒక దశాబ్దానికి పూర్వం దేశవ్యాప్తంగా విశ్వమంగళ గో గ్రామయాత్ర జరిగింది. ఆ ప్రయత్నంలో దేశమంతా గోసంరక్షణ విషయం ఒక జాగృతి వచ్చింది. దేశంలో ఏకతా విద్యాలయాలు కుగ్రామాలలో ప్రారంభించారు. ఆ విద్యాలయాలు సమీప భవిష్యత్తులో ఒక లక్ష గ్రామాలకు చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలోని అన్ని సామాజిక రంగాలలో పనులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పనిచేసే సంస్థలు 40కిపైగా ఉన్నాయి. ఒకప్పుడు సంఘం అంటే శాఖ, శాఖ అంటే కార్యక్రమం అని వ్యాఖ్యానించేవారు. కాని ఇప్పుడు సంఘం అంటే శాఖ, శాఖ అంటే సామాజిక పరివర్తన. ఈ దిశలో వేగంగా అడుగులు వేస్తున్నది.
దేశ సరిహద్దులలో ఉన్న గ్రామాలలో ‘సీమా సురక్షా సమితి’ అనే సంస్థ పనిచేస్తున్నది. దేశ సరిహద్దు రక్షణలో సైన్యానికి తోడ్పాటుగా ప్రజలు పనిచేయాలి. ఆ పనుల గురించి సీమా సురక్షా సమితి పనిచేస్తున్నది. సరిహద్దుల వెంబడి అన్ని గ్రామాలో పనులు జరుగుతున్నాయి. ‘సక్షమ్’ పేరుతో దివ్యాంగుల సేవకు పనిచేస్తున్నారు. రోగాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. మారిన జీవనశైలి, ఉద్యోగాల శైలి మన జీవితాలలో అనేక మార్పులు తెస్తున్నది. రోగాలబారిన కూడా పడేస్తున్నది. ఈ పరిస్థితులలో మార్పు తెచ్చేందుకు ‘ఆరోగ్యభారతి’ అని సంస్థ దేశవ్యాప్తంగా పనిచేస్తున్నది. ఆరోగ్యవంతమైన జీవన విధానము భారతీయ జీవన విధానము. సూర్యోదయం కంటే ముందే లేవటంతో మొదలవుతుంది. ఆహారము, విహారము దానికి అనుగుణంగా ఉండేది. ఆ జీవన విధానము తిరిగి జాగృతం చేయటం ఆరోగ్యభారతి లక్ష్యం.
సంఘము ఒకప్రక్క వ్యక్తినిర్మాణం. రెండవప్రక్క సామాజిక రంగంలో పనిచేయటం అంతటితో ఆగకుండా దేశం సమస్యలపైన, పరిస్థితులపైన అవగాహన కలిగించేందుకు ఒక జాగరణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కరపత్రాలు, చిన్న చిన్న సభలు ద్వారా ప్రజలలో అవగాహన చైతన్యం కలిగించే ప్రయత్నాలు చేస్తుంటుంది. రాబోయే 5 సంవత్సరాలలో సంఘ శతజయంతి ఉత్సవాలు రాబోతున్నాయి. ఆ సమయానికి దేశంలో భారతీయ సంస్కృతి ఆధారంగా మనమంతా ఒకటి అనే భావన నిర్మాణం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒకే దేశం, ఒక ప్రజ అనేది ఈ దేశం శక్తివంతం కావటానికి పునాది. అదే సంఘ లక్ష్యం.

-రాంపల్లి మల్లికార్జునరావు 9502230095