AADIVAVRAM - Others

సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యలు లేని వ్యక్తులూ ఎవరూ ఉండరు. ఏదో ఓ చిన్న సమస్యను భూతద్దంలో చూస్తూ చాలామంది విచారిస్తూ ఉంటారు.
మనకు ఉన్నది ఒకే ఒక జీవితం. మనం పుట్టడమనేది ఒక అద్భుతమైన విషయం. ఆ విషయాన్ని మర్చిపోయి మనకున్న చిన్న సమస్యల గురించి మనలో ఎక్కువమంది ఆలోచిస్తూ ఉంటారు. జీవించడాన్ని మర్చిపోయి ఆలోచిస్తూ ఉంటారు.
మన సమస్య చిన్నదైనా, పెద్దదైనా మనకన్నా చాలా పెద్ద సమస్యలు ఉన్నవాళ్లు భూ ప్రపంచంలో ఎందరో ఉన్నారు. చిన్నగా భూమి కంపించి కొంత అస్తినష్టం జరిగితే దాని గురించి బాధపడుతూ చాలామంది ఉంటారు. ఒక్కసారి నేపాల్‌లో జరిగిన భూకంపాన్ని వాళ్లు గుర్తుకు తెచ్చుకుంటే తమకు జరిగిన నష్టం ఎంత చిన్నదో వాళ్లకి బోధపడుతుంది.
మనకు ఎన్ని సమస్యలు ఉన్నా మనం ఈ అక్షరాలని చదవగలుగుతున్నాం. ఈ అక్షరాలను ఎన్నడూ చదవలేని వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు.
యాభై సంవత్సరాల వయస్సులో మధుమేహ వ్యాధి వచ్చి మామిడిపండును తినలేక పోతున్నామని ఎందరో బాధపడుతూ ఉంటారు. చిన్నతనంలో ఆ వ్యాధి బారిన పడ్డ వ్యక్తుల పరిస్థితి ఏమిటి?
మనం ఏది కోల్పోయామని బాధపడుతున్నామో అది లేని వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎందరో.
మనల్ని సమస్యలు బాధపెడుతున్నప్పుడు దేవాలయాలు సందర్శించడం ఎంత ముఖ్యమో, అనాథ శరణాలయాలని, వృద్ధాశ్రమాలని దవాఖానాలని సందర్శించడం అంతకన్నా ఎక్కువ అవసరం.
తల్లిదండ్రులు లేక, తల్లిదండ్రులు ఎవరో తెలియక జీవితాలను గడుపుతున్న వ్యక్తులని చూస్తే మనం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది.
వృద్ధాశ్రమాలలో ఎవరి ఆదరణ లేక బతుకుతున్న వ్యక్తులని చూసినప్పుడు, మనని మన పిల్లలు బాగా చూస్తున్నందుకు ఆనందంగా ఎగిరి గంతేయాలని అన్పిస్తుంది.
మనకు చిన్న అనారోగ్యం వస్తే ప్రపంచం మన మీద పడినట్టు ఆందోళన చెందుతుంటాం. ఒక్కసారి దవాఖానాకి వెళ్తే తెలుస్తుంది మనం ఎంత అదృష్టవంతులమో.
అందుకని సమస్యలు మనలని వేధిస్తున్నప్పుడు మనం గుడితోపాటూ ఇలాంటి ప్రదేశాలను సందర్శించాలి. అప్పుడు ఎగిరి గంతులేస్తాం.
ఇవి సందర్శించకుండానే మన సమస్యలు పక్కన పెట్టి జీవిస్తే మరీ మంచిది.
సమస్యలు లేకపోతే జీవితం లేదు. బతికి వున్న వాళ్లకే సమస్యలు ఉంటాయి. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి అందరూ.