Others

నిజమైన పూజ సాయ బాటలో నడవడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిరిడిలో అలనాడు సాయిబాబా చుట్టూ ఎంతో మంది ఉండేవారు. వారంతా ఆయన భక్తులు. కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా కూడా ఉండేవాళ్లు. వాళ్లు ఆయన్ను చూస్తూ బాబా చేసేపనులను పరీక్షిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వాడవాడలా శిరిడీ నాథుని గుళ్లు కోకొల్లలుగా ఉన్నాయి. చాలామంది సాయినాథుని భక్తులుగా ఉంటున్నారు. వారంతా ప్రతి గురువారం సాయి బాబా గుడికి వెళ్తుంటారు. నాటి సాయి హారతి పాటలు పాడుతూ సాయిబాబాకు వివిధ సమయాల్లో చక్కని హారతిని ఇస్తారు.
ఏ వీధిలో గుడికి వెళ్లినాసరే సాయిబాబా చిరునవ్వుతో పిలుస్తున్నట్టే ఉంటుంది. అక్కడి శిరిడి సాయినాథుని రూపమే ప్రతిచోట కొలువై ఉంటుంది. సాయిబాబా ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. నేడు భక్తులంతా సాయిబాబా పూలతో పూజిస్తారు. నాడు సాయి చెప్పిన ఏకాదశ సూత్రాలను మననం చేసుకుంటారు. ప్రతిరోజు సాయి చరిత్రను సద్గురు చరిత్రగా భావించి పారాయణ చేస్తుంటారు.
శిరిడీ వీధుల్లో సాయినాథుని నడయాడిన సమయంలోని విజయ దశమి అందరినీ విషాదంలోకి నెట్టివేసింది. సీమోల్లఘనం చేయాలనే సాయినాథుడు తన భక్తులను విడిచి వైకుంఠానికి ఏగారు. శివైక్యం చెందారు.
కానీ ‘‘ నేను ఈ శరీరానికి విడిచి వెళ్లినా నా సమాధి మాట్లాడుతుంది. మీరు తల్చుకుంటే చాలు మీ చెంత నేనెల్లపుడూ ఉంటాను. అంతేకాదు మీరు మంచిని ఆహ్వానించండి. ఎవ్వరికీ కీడు చేయకండి. అందరినీ అన్నదమ్ముల్లా ప్రేమించండి. ప్రేమనుపంచండి. ద్వేషాన్ని వీడండి నేను మీ కష్టాలను, కన్నీళ్లను దూరం చేస్తాను. పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాక్కున్నట్టుగానే నన్ను తల్చుకున్న మరుక్షణం నుంచి నేను మీకు కాపలాగా ఉంటాను. నేను మీరున్నచోటుకి రావడానికి కార్లు, బస్‌లు అక్కర్లేదు. మీ కష్టాన్ని నేను పోగొడుతాను. మీరు మానవత్వంతో జీవించండి చాలు’’అని చెప్పారు.
ఆవిధంగా నేడు ఎందరో భక్తులు సాయినాథుని కరుణామృతాన్ని గ్రోలేవారున్నారు. సాయినాథుని మనసారా తల్చుకుంటే చాలు వారి ఏ కష్టం రాకుండా చూసుకుంటాననే చేసిన వాగ్దానాన్ని నిలబట్టెకుంటారు.
అందుకే ప్రతి విజయ దశమి నాడు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వర్తిస్తారు. సమాధి నుంచి వచ్చే సాయి పలుకులను వినడానికి సాయి భక్తులంతా విజయదశిమి నాడు సాయి సన్నిధానానికి చేరుకుంటారు. ఆ ఆలయాన్నంతా దీపాలతో నింపి వెలుగులను తమ జీవితాల్లో పంచమని సాయిబాబాను భక్తులంతా వేడుకుంటారు.
అలా వేడుకోవడానికి నిరంతరం సాయిబాబా దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉండడానికని 1951లో దివంగత శ్రీరామచందర్ బంగే గారు శిరిడీ సాయినాథుని తీసుకొని వచ్చి శ్రీసాయి నిలయంలోనిలిపారు. ఈ సాయినాథుని ఆలయాన్ని నల్లగుట్టసాయిబాబా ఆలయం ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి దగ్గరగా గురుస్థాన్ ను కూడా నెలకొల్పారు. ఇది ఇప్పటి కిమ్స్ హాస్పటల్‌కు ఎదురుగా ఉంది.
శ్రీవెంగల హనుమంత్ రావు గారు వారి తల్లి మాణికమ్మ జ్ఞాపకార్థం గా శిరిడి సాయినాథుని ఆలయాన్ని పునరుర్ధరించారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ నెలకొన్న సాయినాథుడు ఇక్కడి తన భక్తులనంతా కాపాడుతూనే ఉన్నారు. ఈ సాయినాథునికి శిరిడీలో జరిగే హారతులవంటివే ఇవ్వాలని తలచిన 1974లో ఈ సాయినాథుని సేవాసమాజం లోని శ్రీరామచందర్ బంగే, శ్రీకె. శంకర్‌రావువంటివారు హారతి ఇవ్వడం ప్రారంభించారు. ఈ మరాఠీ భాషలోని హారతి పాటలను తెలుగులోకి కూడా అనువదించి ప్రతిరోజు ఈ నల్లగుట్ట సాయినాథునికి హారతులు ఇస్తారు. నల్లగుట్ట సాయినాథుని ఆలయం పూర్తిగాశిరిడీ సాయినాథుని ఆలయానికి నమోనా గా ఉంటుంది. ఇక్కడ కూడా స్వామి వారి పాదుకలు ప్రత్యేకంగా పెట్టారు. ఈ గురుపాదుకలను భక్తులంతా కళ్లకు అద్దుకుని నమస్కారం చేస్తారు.
ఈ ఆలయంలో కేవలం సాయినాథుని పూజించడం, హారతులివ్వడమే కాక సాయినాథుడు అలనాడు చెప్పినట్లు నడవడానికి కూడా వీరు కృషి చేస్తున్నారు. సాయినాథుని నడవడిని మన నడవడిగా తీర్చిదిద్దుకోవడమే సాయినాథునికి చేసే అసలైన పూజ అని నమ్మిన సాయిభక్తులంతా కలసి 1989లో కొంత భూమిని కొనుగోలు చేసి 27 గదులతో రెండు అంతస్థులతో ఒక భవనాన్ని నిర్మించారు. దీనిని 1993లో స్వామి పరమార్థనందజీ రామకృష్ణ మఠం వారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు. దీనిలో వైద్యుల చేత ఉచిత వైద్య సేవను రోగులకు అందిస్తారు. ఉచిత డిస్పెన్సరినీ నడుపుతున్నారు. ఉచిత కంటి వైద్యం కూడా ఇక్కడ చేస్తారు. అంతేకాక ఈ సాయి సేవా సమాజం వారు 2002లో వృద్ధులకోసం వృద్ధాప్య గృహనిర్మాణం కోసం, అనాథ పిల్లలకు పాఠశాల కోసం కూడా భవనాలను నిర్మించి అటు చిన్నారులకు, ఇటు వృద్ధులకు సేవ చేస్తున్నారు. 2014లో సుమారుగా 50మంది వృద్ధులు ఉండడానికి వీలుగా ఉండే భవనాన్ని స్వామి జ్ఞానానంద జీ మహారాజ్ ప్రారంభిం చారు. అందులో ఇప్పుడు కూడా వృద్ధులు తమ మానసిక బాధలను మరిచిపోతూ సాయి సేవాసమాజం లో వారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇలా నల్లగుట్ట సాయినాథుని ఆలయం నేటికీ కూడా సాయినాథుడు చెప్పిన ఏకాదశ సూత్రాలను పాటిస్తూ సాయినాథుడు తన జీవితంలో చెప్పిన మానవత్వాన్ని తమ తమ జీవితాల్లో మెరుగుపర్చుకుంటూ సమాజ సేవను చేస్తూ తమ గురువుగా భావించి సాయినాథుని ప్రతిరోజు పూజిస్తుంటారు. విజయదశిమి నాడు సాయి నామస్మరణ చేసుకుంటూ సాయి చూపిన ధర్మమార్గంలో నడవడానికి తిరిగి ఇక్కడి భక్తులంతా ప్రతినలు పూనుతారు. సాయినాథునికి విజయదశమినాడు విశేషపూజలు కూడా చేస్తారు.

- జి. సుజాత వెంకట్‌రావు 8885622196