Others

అర్ధాంగి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో పురుషాధిక్యత ఎక్కువగావున్న సమయంలో భర్త అమాయకుడై, చదువు, ధైర్యం, లోకజ్ఞానం కరువై ఒక ఆయా చేతిలో పెరిగి నల్లమందు అలవాటుతో మందమతిగా మారినా.. డబ్బుతో ఆ విషయాన్ని దాచిపెట్టి పేదదైన చురుకుగావున్న పల్లెటూరి యువతిని ఒక జమీందార్ కోడలిగా చేసుకుని తన కొడుకును ప్రయోజకుడిగా మార్చబడగలడని ఆశిస్తాడు. ఆడది అబలకాదని అర్ధాంగి అంటే భర్తలో సగమని, కష్టాల్లో అతనికి ఆలంబనగా నిలిచి అతడి వ్యక్తిత్వాన్ని ఔన్నత్యాన్ని నిలుపుతుందని నిరూపించిన గొప్ప చిత్రం రాగిణి ఫిలింస్ 1958లో నిర్మించిన ‘అర్ధాంగి’. బెంగాలి రచయిత శరత్‌చంద్ర రాసిన ‘స్వయంసిద్ధ’ రచనకు తెలుగురూపమే పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం. జమీందార్ గుమ్మడి పెద్దకొడుకు అక్కినేని. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో పనిమనిషి చేతిలో నల్లమందు అలవాటు చేయబడి సరైన ఎదుగుదల లేకుండా అమాయకంగా ప్రవర్తిస్తుంటాడు. రెండో భార్య శాంతకుమారి కొడుకు జగ్గయ్య గారాబంగా, మొండిగా పొగరుబోతుగా, వ్యసనపరుడిగా మారి అన్ననే చిన్నచూపు చూస్తుంటాడు. అతడిని ధైర్యంగా ఎదుర్కొన్న సావిత్రిని తన ఇంటి కోడలుగా చేసుకుంటాడు జమీందార్.
పెళ్ళయాక భర్త పరిస్థితి తెలిసినా అధైర్యపడక, పారిపోకుండా ఎన్నో కష్టాలు, ప్రతిఘటనలు ఎదుర్కొని భర్తను పరిపూర్ణమైన వ్యక్తిగా మార్చి ‘అర్థాంగి’ అనే పదానికి అర్థం చెబుతుంది. రెండోకొడుకు చెడు మార్గంలో పయనిస్తుండటంతో ఆస్తి అక్కినేని పేరుతో రాసి మరణిస్తాడు జమీందార్. అతని భార్య శాంతకుమారి ముందు అక్కినేని- సావిత్రిలను అపార్థం చేసుకున్నా జగ్గయ్య అసలు స్వరూపం తెలుసుకుని దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్న అతడిని చంపబోగా సావిత్రి అడ్డుపడి అతడిని క్షమించమనడంతో జగ్గయ్యకు జ్ఞానోదయమవుతుంది. ప్రేక్షక ఆదరణతోపాటు, రాష్టప్రతి అవార్డు దక్కించుకున్న చిత్రం సావిత్రిని మహానటిగా మార్చేసింది. చిత్రంలోని పాటలు నేటికీ ఆదరణ పొందుతున్నాయి.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం