Others

తారక బాలమేధావి( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారకలో మంచి ఫైర్ వుంది. అది ఒక రోజుండి పోయేదికాదు. తాతకు తగ్గ మనవడనిపించుకోవాలన్న దృఢమైన కాంక్ష వుంది. చూసే చూపులోనూ డైలాగులు పలికే తీరులోనూ యన్‌టిఆర్‌ని తలపింప చేయడం ఖాయం. అన్నిటికీ మించి ఇంప్రొవైజేషన్... ఒక డైలాగుని ఎలాచెబితే బావుంటుందో ఎలాచెబతే కనెక్ట్ అవుతుందో ఆ వయసులోనే తెలుసుకోగలిగాడు. చాలా చురుగ్గా వున్నాడు...

అన్నపూర్ణా స్టూడియోస్‌లో బాలరామాయణం చిత్రం షూటింగు ప్రారంభమైంది. నిర్మాత మల్లెమాల గనుక ఆయనతో నాకున్న అనుబంధం దృష్ట్యా షూటింగుకెళ్లి పరామర్శించాను (97-98). అప్పట్లో ఆంధ్రప్రభ వారపత్రికలో సినిమా సంచారం పద్దెనిమిది పేజీల పులవ్వుట్‌కి ఎడిటరుగా ఉంటుండేవాణ్ని. స్టిల్ ఫొటోగ్రాఫర్ శ్రీనుకూడా నాతో వున్నాడు. స్టూడియోకెళ్లి చూద్దునుకదా అందరూ బాలలే. ఎవరికీ పది సంవత్సరాలు మించి వయసులేదు. అందరూ గెటప్స్‌లో వున్నారు. రాముడి వేషధారి తారక రామారావు చుక్కల్లో చంద్రుడిలా కనిపిస్తున్నాడు. పిల్లలంతా స్టూడియో బయట ఆటల్లో మునిగిపోయారు. వారిని కంట్రోల్ చేయడానికి డైరెక్టరు గుణశేఖరూ, అతని సహాయకులూ నానా తంటాలు పడుతున్నారు.
రెడ్డిగారు కాటేజీలోవుంటూ కబురుచేశారు. వెళ్లాను. ఆ చిత్రానికి పాటలే ప్రాణం. ఇంచుమించు సంగీత రూపకంలా వుంటుంది. బాల రామాయణాన్ని బాలలతో అద్భుతంగా పలికించాడు యంయస్ రెడ్డి. చాలా పరిశ్రమ చేశారు. పండిత పామరులకు సుళువుగా అర్థమయ్యే భాషలో రామాయణం సాగింది. అందుకు తగ్గ స్వరసిద్ధీ జరిగింది. మాధవపెద్ది సురేష్ అనుకుంటాను సంగీతం. గొప్ప సంగీతం. ఆ పాటలు విన్నవారికి ఎవరికైనా సురేష్‌లో చాలా పెద్ద విషయముందన్న విషయం అర్థమవుతుంది.
లంచ్ బ్రేకు-
రెడ్డిగారు తారకరాముడ్ని పిలిపించారు.
పరుగులాంటి నడకతో వచ్చాడు.
‘ఈ పిలగాడితో మంచి ఇంటర్వ్యూ తీసుకోవయ్యా!’ అన్నారు రెడ్డి.
ఇంటర్వ్యూ అవగానే తారక పారిపోయాడు భయంతో. ప్రొడక్షనువాళ్లను పంపించి బలవంతంగా రప్పించాడు. రాముడి గెటప్‌లో భలే ముద్దొస్తున్నాడు. ముద్దుముద్దుగా మాట్లాడుతున్నాడు. అడిగిన ప్రతి ప్రశ్నకీ సమాధానం చెబుతున్నాడు. అప్పటికే నృత్యంలో అరంగేట్రం చేసిన తారక అభినయంలోనూ అందెవేసిన చెయ్యి అనిపించుకున్నాడు.
తారకలో మంచి ఫైర్ వుంది. అది ఒక రోజుండి పోయేదికాదు. తాతకు తగ్గ మనవడనిపించుకోవాలన్న దృఢమైన కాంక్ష వుంది. చూసే చూపులోనూ డైలాగులు పలికే తీరులోనూ యన్‌టిఆర్‌ని తలపింప చేయడం ఖాయం. అన్నిటికీ మించి ఇంప్రొవైజేషన్... ఒక డైలాగుని ఎలాచెబితే బావుంటుందో ఎలాచెబతే కనెక్ట్ అవుతుందో ఆ వయసులోనే తెలుసుకోగలిగాడు. చాలా చురుగ్గా వున్నాడు...
విశే్వశ్వరయ్య గెస్ట్‌హవుస్.
స్టూడెంట్ నెంబర్‌వన్ చిత్రం షూటింగు జరుగుతుంది. వెళ్లాను. ‘సార్ మూడ్‌లో వున్నారు’ అని ఎవరో చెప్పేరు. అరె- ఇంత చిన్న వయసులో మూడా? అనుకున్నాను. రూమ్‌లోకి పిలిపించారు. వెళ్లాను.
‘సీరియస్ సన్నివేశం షూట్ జరుగుతుంది. పెద్దవారు మిమ్మల్ని ఆట్టేసేపు వెయిట్ చేయించడం బావుండదని పిలిచాను. చెప్పండి! మీకేం కావాలో అడగండి!’ అంటూ ముందుకు జరిగాడు. నేను.. నాకూ వాళ్ల తాతయ్యగారితో వున్న అనుబంధం గురించి చెప్పేను. మరింత దగ్గరయ్యాడు- చిన్నపాటి చిట్‌చాట్.
మళ్లీ తారకలో అదే ఫైర్...అదే అర్చ్..
అదే తీక్షణత.. అప్పటికే తాతగారి పోలికలు పుణికిపుచ్చుకున్నట్లనిపించింది. ఆ కొద్దిపాటి సంభాషణంలోనూ... తొంభైతొమ్మిది శాతం తాతమాటే తారక మంత్రంలా జపించాడు. బాలమేధావి అనిపించింది. ఈ విషయం తర్వాత రాశాను కూడా. స్టూడెంట్ నెంబరు వన్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనుకున్నాం.
ఆమాటే నిజమయ్యింది.
తారకలో వయసుకి మించిన పరిపక్వత తారక నిజంగా బాలమేధావి!

-ఇమంది రామారావు 9010133844