Others

ఎవ్వరికీ చెప్పొద్దు.. హిట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -ఎవ్వరికీ చెప్పొద్దు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిల్‌రాజు మాట్లాడుతూ -మా జోష్ సినిమాలో రాకేష్ వర్క్ చేశాడు. తను యాక్ట్ చేస్తానని వచ్చినప్పుడు విదేశాల్లో చదువుకుని వచ్చావు. మంచి కెరీర్ ఉంది. ఇది నీకు అవసరమా? అన్నా. కొన్ని రోజుల తర్వాత నేను హీరోగా చేస్తున్నానన్నాడు. సినిమా అంతా పూర్తయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఎవరు ప్రొడ్యూసర్ అని అడిగితే నేనే ప్రొడ్యూసర్ అన్నాడు. సినిమాలో కొత్త టీమ్ పడిన కష్టం స్క్రీన్‌పై కనిపించింది. చాలామంచి కానె్సప్ట్ మూవీ. మంచి హ్యుమర్ ఉంది. అక్టోబర్ 8న విడుదలవుతున్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు. హీరో, నిర్మాత రాకేష్ వర్రె మాట్లాడుతూ -చాలా ఎమోషనల్ జర్నీ. ఇందులో ముందుగా వినాయక్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బద్రినాథ్ సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అలాగే బాబీ డైరెక్టర్ కాకముందునుంచీ తెలుసు. తనని చూసి ఇన్‌స్పైర్ అవుతుంటాను. తరుణ్ భాస్కర్‌కి థ్యాంక్స్. ఇక సినిమా విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ విజయ్‌కి, లిరిసిస్ట్ వాసు, డైరెక్టర్ శంకర్‌కి థ్యాంక్స్. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకముంది. అలాగే మా సినిమా రిలీజ్‌కు సపోర్ట్ చేస్తున్న దిల్‌రాజుకి థ్యాంక్స్. మా ప్రాజెక్ట్‌ని, డ్రీమ్‌ను ముందుకు తీసుకెళ్లడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. సినిమాను ఎంజాయ్ చేస్తారని గ్యారంటీగా చెబుతున్నా అన్నాడు. డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ -సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమా పెద్ద హిట్ అవుతుందనడానకి నిదర్శనం దర్శకుడు శంకర్. ఫస్ట్‌టైమ్ స్టేజిమీద ఒక దర్శకుడు కొత్తగా, నిజాయితీగా మాట్లాడాడు. సినిమా కూడా అలాగే ఉంటుంది. ‘్ఫదా’లో సాయిపల్లవి పెర్‌ఫార్మ్ ఎంత ఎనర్జిటిక్, హుషారుగా అనిపించిందో ట్రైలర్ చూశాక సినిమాలోని హీరోయిన్ అలా అనిపించింది. తను చెప్పాలనుకున్నది సూటిగా, సుత్తిలేకుండా తీసిన దర్శకుడిని అభినందిస్తున్నా అన్నారు. చిత్ర దర్శకుడు బసవ శంకర్ మాట్లాడుతూ -‘ట్రైలర్ చూడండి. నచ్చితే సినిమానూ చూడండి. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నా’ అన్నారు.