Others

జాతిజనులకు స్ఫూర్తిదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్టు గాంధీజీ చిన్నతనం నుండే మన దేశ స్వాతంత్య్ర పరిరక్షణ కోసం ఎంతో కృషిచేశారు. నీతి, నిజాయితీ, సత్యం, అహింస, పరమధర్మం ఆయన ప్రధాన ఆశయాలు. సత్యం, ధర్మం, శాంతి మార్గంలో గాంధీజీ ఆదర్శ జీవితం గడిపి, అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. నిత్యం చిరునవ్వుతోనే జీవితమంతా గడిపారు. ఆయన పూర్తిపేరు మోహన్‌దాస్ కరంచంద్ గాంధీజీ అయినప్పటికీ ప్రపంచస్థాయిలో ప్రజాహృదయాలలో ‘గాంధీజీ’గానే నిలిచిపోయారు. మహాత్మాగాంధీ అంటే అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవం. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ భారతదేశం మరువలేని గాంధీజీ తన జీవితాంతం నిరాడంబరంగా జీవించారు. నూలు వస్త్రం ధరించారు. ఇతరుల మేలు కోరారు. ఎవ్వరినీ దూషించలేదు. ద్వేషించలేదు. బ్రిటిష్‌వారి కబంధ హస్తాలలో నలిగిపోతున్న బానిసత్వానికి తెరదించారు. 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్య్రం సాధించారు. అందుకు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. బ్రిటీష్ పాలకుల నుంచి దాస్య విముక్తి కోసం ఎన్నో దీక్షలు చేపట్టి విజయం సాధించారు. తీరిక వేళల్లో చేనేతల చరఖా రాట్నం ఉపయోగించారు. ఆయన కాలినడకనే ఎక్కడికైనా వెళ్ళేవారు. అతి నిరాడంబర వ్యక్తిత్వం ఆయన సొంతం.
మార్టిన్ లూథర్‌కింగ్, నెల్సన్ మండేలా లాంటి మహనీయులు నోబెల్ శాంతి పురస్కారం అందుకున్న సమయంలో తాము గాంధీజీ మార్గంలో నడిచామని ఆయన అహింసా సిద్ధాంత ఉద్యమమే తమకు స్ఫూర్తిని కలిగించిందన్నారు. 1948 జనవరి 30వ తేదీ మహాత్మాగాంధీజీ ప్రార్థనా సమయంలో ‘గాడ్సే’ చేతిలో తూటాకు బలైపోయారు. ‘హే రామ్’ అంటూ నేలకొరిగారు. ఆయన మరణం భారతావనికి తీరని లోటు. సత్యం అహింసా పరమధర్మం సిద్ధాంతాలను ప్రపంచం నలుమూలలా అందించిన గాంధీజీ ఎందరికో స్ఫూర్తి. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు అన్న ఆయన వాక్యాలు అందరూ గుర్తుంచుకోవాలి. అస్పృస్యతా నివారణ, శాంతిపథం, అహింసా సిద్ధాంతం ఆయన కీర్తికిరీటంలో కలికితురాయిలు.

-ఎల్.ప్రపుల్లచంద్ర 88865 74370