Others

చేతుల వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహం గాయపడ్డప్పుడల్లా
కట్టుకట్టిన స్నేహం..!
ఉడుకెత్తిన జ్వరమానికి
చల్లదనాన్నిచ్చిన చేయి-
వేకువ ఉదయానికి
మెలకువనిచ్చిన కదలిక
పేగు కదిలిన చప్పుడుకు
అల్లాడిన హృదయం..!
కళ్ళల్లో తొణకిన స్వప్నాల్ని
జారనీయని దోసిల్ల సోపతి;
రగిలిన బాధల్లో
కరిగిన కాలం కొవ్వొత్తి-
వాలిన మబ్బుల మధ్య
కోరిన దృశ్యాలు అస్పష్టం
కొత్తగా చిగురించాల్సిన
ఆశల మొలక
నిశ్శబ్దంలో స్తబ్దంగా
అయినా-
ఎక్కడో జ్ఞాపకాల్ని తవ్విన
గునపం చప్పుడు..!
తీరాన్ని తాకిన అలల చైతన్యం
వెలుతురు పిట్టల కౌగిలింతల్లో
చెదిరిన చీకటి తెరల చీలికలు..
తూరుపు ద్వారం ముందు
కలిసిన రెండు చేతుల వంతెన కింద
ఇక్కడో జీవనదిని పారించాల్సి ఉంది-!!

- మోతుకూరి అశోక్‌కుమార్ 9247880976