AADIVAVRAM - Others

పత్యం పరవౌషధం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రయ్య తేనె వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూంటాడు. ఒకరోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో చెట్టు కింద కునుకు తీశాడు. నిద్రలో పొరపాటున తేనె గినె్నకు చేయి తగలడంతో అంతా వొలికి నేలపాలైంది. వెంటనే ఆ తేనెను ఆరగించడానికి అనేక ఈగలు వచ్చాయి. ఈగలు లొట్టలేసుకుంటూ తేనెను ఆరగిస్తున్నాయి. చంద్రయ్య ఆ దృశ్యాన్ని చూస్తూన్నాడు. ఎంత తేనె తిన్నా ఈగల ఆశ చావడం లేదు. ఇంకా తినాలనే తపనతో అవి తేనెలో మునుగుతున్నాయి. వాటి రెక్కలకు తేనె తగిలి ఎగరలేక పోతున్నాయి. మరికొన్ని ఈగలు తేనెలో కూరుకుపోయి ప్రాణాలు వదిలేశాయి.
ఇంతలో చంద్రయ్య మిత్రుడు శీనయ్య ఆ చెట్టు కిందకు వచ్చాడు.
‘ఏం శీనయ్యా! ఎక్కడి నుండి వస్తున్నావు?’ ప్రశ్నించాడు చంద్రయ్య.
‘పెళ్లి భోజనానికి వెళ్లి వస్తున్నా. అద్భుతమైన వంటకాలు పెట్టడంతో నాలుగు ముద్దలు ఎక్కువే తిన్నాను. పొట్ట ఉబ్బరంగా ఉంది. తల తిరుగుతోంది. గత నాలుగు రోజులుగా ఎక్కడో ఒకచోట భోజనాలకు వెళుతున్నాను. రుచికరమైన పదార్థాలు ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపిస్తూనే ఉన్నాయి’ గొప్పగా చెప్పాడు శీనయ్య.
‘ఇంతకూ నీకు చక్కెర వ్యాధి, రక్తపోటు ఉన్నాయనుకుంటాను. తీపి, ఉప్పు, కారాలు తగలకూడదు కదా? ఎలా తింటున్నావు?’ అడిగాడు చంద్రయ్య.
‘్భలేవాడివి చంద్రయ్య. మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఈ భాగ్యానికి కడుపు మాడ్చుకోవాలా? రోగాలకు భయపడాలా? ఏది తిన్నా చిన్న మాత్ర వేసుకుంటే చాలు అన్నీ సర్దుకుంటాయి’ అన్నాడు శీనయ్య.
‘అలా అని ప్రాణం మీదకు తెచ్చుకోలేం కదా శీనయ్యా? పత్యం పరవౌషధం అన్నారు మన పెద్దలు. మనం పత్యం చేస్తూ, రోజూ కొద్దిసేపు వ్యాయామం చేస్తే చక్కెర వ్యాధి, రక్తపోటును కొంత మేరకు అరికట్టి మన ఆయుః ప్రమాణాన్ని పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు చనిపోవలసిందే. అలా అని త్వరగా ప్రాణం మీదకు ఎందుకు తెచ్చుకోవాలి? నిన్ను నమ్ముకుని నీ భార్యాబిడ్డలు ఉన్నారు. నీ పిల్లల చదువు ఇంకా పూర్తి కాలేదు? వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయవలసిన పనులు, బాధ్యతలు నీపై ఉన్నాయి. అటువంటప్పుడు తెలిసి తెలిసి తాత్కాలిక రుచుల కోసం నీ ప్రాణం పైకి ఎందుకు తెచ్చుకోవాలి?’ ప్రశ్నించాడు చంద్రయ్య.
శీనయ్య ఆలోచనలో పడ్డాడు. ‘నిజమే చంద్రయ్యా! నా పిల్లలకు చేయూత నిచ్చేవరకైనా నేను జీవించవలసిన అవసరం ఉందని మరచాను. అది నా పొరపాటే’ ఆవేదనగా అన్నాడు శీనయ్య.
‘మృత్యువు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు శీనయ్యా. అయితే మన తప్పిదాల వల్ల మృత్యువుకు ఎదురెందుకెళ్లాలి? నా గినె్నలోని తేనె ఇక్కడ వొలికిపోయింది. చాలా ఈగలు తేనెను తినడానికి వచ్చాయి. ఎంత తేనె తిన్నా వాటి ఆశ చావలేదు. వాటి రెక్కలు తేనెలో మునిగిపోయాయి. ఎగరలేకపోయి తేనెలో మునిగి చనిపోయాయి. అత్యాశకు పోకుండా కొద్దిగ తేనెను తిని ఎగిరిపోతే ఇంకా కొంతకాలం జీవించేవి కదా?’ వివరించాడు చంద్రయ్య.
చంద్రయ్య మనస్సులోని ఆంతర్యం శీనయ్యకు అవగతమైంది. తాను చేస్తున్న తప్పును గ్రహించాడు. ఆ రోజు నుండి శీనయ్య పత్యం పరవౌషధం అనే సూత్రాన్ని పాటిస్తూ మితంగా తింటూ, పత్యం, వ్యాయామాలు చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఆహ్లాదంగా, ఆనందంగా జీవించాడు. తన బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని మనుమలతో కాలక్షేపం చేస్తూ కృష్ణా, రామా అంటూ సంపూర్ణ ఆయువుతో బతికి జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు.

-షేక్ అబ్దుల్ హకీం జానీ