AADIVAVRAM - Others

జాకీచాన్ విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనీస్ మార్షల్ ఆర్ట్స్‌కు తగినంత ఆదరణ, ప్రచారం లభించేలా చేయడమే లక్ష్యంగా సినీరంగంలోకి అడుగుపెట్టిన జాకీచాన్ సాదాసీదా వ్యక్తి కాదు. బహుముఖ ప్రజ్ఞావంతుడు. హాలీవుడ్‌తోసహా వందకు పైగా సినిమాలు హిట్‌కొట్టిన చాన్ అత్యంత అధిక ఆదాయం పొందుతున్న సినీ సెలబ్రిటీల్లో రెండోస్థానంలో నిలిచాడని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. సినిమాల్లోని ఫైట్ సీన్స్‌లో డూప్‌లు లేకుండా నటించడంలో దిట్ట. తను సంపాదించింన కోట్లాది ఆస్తిలో పెద్దమొత్తం వాటాను ధార్మిక సంస్థకు కేటాయించిన దానకర్ణుడు. సినీ సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడేందుకు సాహసాలు చేయడమంటే ఇష్టం. హాస్యం, యాక్షన్ అంటే పిచ్చి. మంచి పాటగాడు. ఒకటో తరగతి ఫెయిల్ అయి, పొట్టకూటికోసం స్వదేశం వదిలి ఆస్ట్రేలియాలో భవన నిర్మాణరంగంలో పనిచేసి ‘జాకీ’ అన్న పేరును జోడించుని విశ్వజనుల మదిలో చోటు సంపాదించిన చాన్ త్వరలో లైఫ్ అచీవ్‌మెంట్ ఆస్కార్ అవార్డును అందుకోనున్నారు. ఆయన ప్రతిభకు దర్పణం పట్టే అనేక విశేషాలను ఓసారి తెలుసుకుందాం.
***
హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాన్ అసలు పేరు జాన్ కాంగ్ సాంగ్. చిన్నప్పటినుంచి అతి చురుకుగా ఉండటంతో తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు అతడిని ‘పావొ-పావొ’ అని ముద్దుగా పిలిచేవారు. చైనీస్‌లో దాని అర్థం ‘్ఫరంగి’ (కానన్‌బాల్). ఆ తరువాత కుటుంబం పొట్టచేతబట్టుకుని ఉపాథికోసం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాకు వలసవెళ్లారు. అక్కడ కూలీలు చాన్‌ను జాకీ ఆప్యాయంగా పిలిచేవారు. చివరకు అదే పేరు విశ్వవ్యాప్తమైంది. స్టేజ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ‘బికమ్ ది డ్రాగన్’ అని పిలిచేవారు.
***
జాకీచాన్ తండ్రి చైనీస్ నేషనలిస్ట్ ప్రభుత్వం తరపున గూడఛారిగా పనిచేసేవారు. తల్లి స్టేజ్ ఆర్టిస్ట్. అయితే పేదరికం వల్ల ఆమె గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడేది. జాకీచాన్ భార్య పేరు లిన్. ఈమె తైవాన్‌లో పేరుమోసిన నటి. వీరి కుమారుడు జైసీ చాన్. మరో నటి ఎంగ్ ఇలితో వివాహేతర సంబంధం వల్ల ఓ కుమార్తె ఉందని చెబుతారు.
***
ప్రఖ్యాత సినీనటుడు, మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్‌లీ నటించిన సినిమాల్లో జాకీచాన్ తొలిరోజుల్లో నటించాడు. అయితే అప్పటికి ఎక్స్‌ట్రా వేషాలే వేసేవాడు.
***
అరివీర భయంకర సన్నివేశాల్లో డూప్ లేకుండా సాహసకృత్యాలు చేసే జాకీచాన్‌ను రెండు అంశాలు భయపెడతాయట. సూదులన్నా, బహిరంగంగా మాట్లాడటమన్నా ఆయనకు చచ్చేంత భయమట.
***
సినిమాల్లో ప్రవేశానికి ముందు 20 ఆల్బమ్స్ రూపొందించాడు. పాటలు పాడటంలో దిట్ట. ఫుట్‌బాల్ అంటే చాలా ఇష్టం. హాంకాంగ్ నేషనల్ టీమ్‌కు మద్దతుదారుడు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బహిరంగంగా సమర్థిస్తాడు.
***
హాస్యం అంటే తెగ ఇష్టపడే జాకీచాన్ తన సినిమాల్లో హాస్య చతురతతో కూడిన సన్నివేశాలకు ప్రాధాన్యం ఇచ్చేలా చూస్తాడు. యుద్ధమైనా, మరణమైనా అందులో హాస్యం పోకడ కన్పించేలా చూస్తాడు. హాస్యనటుడు చార్లీ చాప్లిన్, బస్టర్ కీటన్, హెరాల్డ్ లాయిడ్ అంటే చాలా ఇష్టం.
***
ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన చాన్ సినిమాలు ‘రష్ అవర్’ సిరీస్ అంటే అతడికి మాత్రం నచ్చలేదు. హాలీవుడ్ సినీ ప్రపంచం అంటే అతడికి మక్కువ తక్కువే. అక్కడి సంస్కృతిని అతడు జీర్ణించుకోలేకపోయాడు.
***
బొటనవేలిని ఎత్తి విజయ సంకేతం చూపడమంటే అతడికి చాలా ఇష్టం.
***
జాకీచాన్‌కు పెళ్లయిందని తెలిసి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
రెండు గిన్నిస్ రికార్డులు
జాకీచాన్ పేరు రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. ‘చైనీస్ జుడాయిక్’ సినిమాకు ఎక్కువ విభాగాల్లో ఆయన పనిచేసిన రికార్డు దక్కింది. ఆ సినిమా నిర్మాణంలో రచయిత, దర్శకుడు, లీడ్ యాక్టర్, నిర్మాత, కార్యనిర్వాహక నిర్మాత, సినిమాటాగ్రాఫర్, ఆర్ట్ డైరక్టర్, యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్, స్టంట్ కో ఆర్డినేటర్, ప్రాప్‌మాన్, గాఫుల్, స్టంట్‌మాన్, కంపోజర్, ధీమ్‌సాంగ్ ఓకలిస్ట్, కేటరింగ్ కోఆర్డినేటర్‌గా ఆయన సమర్థంగా విధులు నిర్వహించి ఈ రికార్డును సాధించాడు. ఇక ఎక్కున యుద్ధ సన్నివేశాల్లో నటించి జీవించి ఉన్న నటుడిగా ఆయనకు గిన్నిస్ రికార్డు దక్కింది.
బహుభాషా కోవిదుడు
జాకీచాన్ బహుభాషా కోవిదుడు. ముఖ్యంగా ఏడు భాషల్లో నిష్ణాతుడు. కంటోనీస్, మాండరిన్, చైనీస్, జపనీస్, తైవానీస్, జర్మన్, ఇంగ్లీష్, కొరియన్, థాయ్, అమెరికన్ సైన్ లాంగ్వేజెస్ వచ్చు. చాలా సినిమాలకు పాటలు పాడాడు. ఆల్బమ్స్ రూపొందించాడు. చాన్ కార్టూన్ సినిమాలకు గాత్రం ఇచ్చాడు. కొన్ని కార్టూన్ సినిమాల్లో ఆయన బంధువుల పాత్రలకు వారిచేతే డబ్బింగ్ చెప్పించాడు.