Others

సృ స్థి ల (సృష్టి స్థితి లయ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మినువాక నెలవెల్లు మిళితమై పోయెనో
అరతడి రేయెండ నారబోసె
ఇచ్ఛ ప్రకృతిలో ఱెక్క విచ్చెననగ
ఆ గమనించెను పుడమికి హరువులల్లి
మధుర భావభరితమైన మంజులార్ద్ర
జీవకాంతుల హేమంత చిత్ర రచన...

ముదురు పాకపు చలి ముసురుగాలికి రాలు
ఆకులో తెలియని యంగలార్పు
తరు నగ్న శాఖపై తపియించు విహగంపు
ఱెక్కలో దాగొన్న రెల్లు పువ్వూ
చేనుకావని ప్రక్క చింత తోపులకాడ
బిగి కౌగిలింతలో బెట్టుకాక
విరహింపు గొంతెత్తి స్వరమూదు యూహకే
సిగ్గుగా మొలచిన ‘శీత’ పులక
ఈ అనంత ప్రయాణమునేగుచుంటి
ప్రతి మలుపునందు మార్పులు పలుకరించి
ఇది గదాయన్నటుల నిత్యపదము తోడ
తాండవింపించె నన్ను ఋత్వర్థసావి...

***
నా పెదవుల గడపదాటిన ఇవన్నీ ప్రతీకలు బింబాలు
ఋతువులై
ఒళ్ళు విరుచుకుంటున్న నగ్న సౌందర్య ప్రయాణాలు
పాట ఱెక్కల మీద ప్రయాణిస్తూ
రాత్రి వెనె్నల తీగెల్ని మీటితే
నా కలలన్నీ మీ నిద్ర నభినయిస్తాయి-
ఈ చరాచర సృష్టియావత్తుని
జీవన తంత్రులు నాద భరితం చేసినప్పుడే
పాట పల్లవించింది
కళ్ళు మూసుకున్న ధ్యానాన్ని
ఎదురుచూపులతో స్నానం చేయించి
ప్రతీక్షను విశ్రాంతి తీసుకోమన్నప్పుడు
బ్రతుకులో ఒక భాగం ఋతువై జన్మించింది...
గుక్కెడు నిశ్శబ్ధాన్ని త్రాగి
చీకటి దుప్పటిలో ముఖం దాచుకొన్న
ఎవరి నిస్పృహ
విశ్వ చైతన్యాన్ని ఆక్రమించిందో
అక్కడ చంద్రుడ్ని వెలిగించి
నక్షత్ర సుమాల్ని వెదజల్లి
గంధవాయువుల్ని గులకరించి పోశానుఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404