Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. ఎంతయున్నను లేదని యేడ్చువారు
కడుపు కట్టుకునార్జింపఁ గదలువారు
చదివినను విన్నఁ జెప్పిన సత్యమేదొ
తెలుసుకొన కుంటిరేమి సాధించువారు
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: ఈ రోజుల్లో ఎంతోమందిని చూస్తున్నాం. ఎంత సంపాదించినాలేదు లేదని ఏడ్చేవారే. అలాగే మరెంతోమంది కడుపుకట్టుకుని దానధర్మాలను ప్రక్కకునెట్టి అమితంగా ధనార్జన చేయాలన్నదే లక్ష్యంగా జీవిస్తున్నారు. అలాంటివాళ్లు ఎంత చదువుకున్నా ఎన్ని విన్నా సత్యాన్ని గ్రహించకుండా బ్రతుకులు ఈడ్చేస్తున్నారు. వాళ్లు సాధించేదేమి లేదని కర్మసాక్షివైన ఓసూర్యదేవ! నీవైనా తెలియజెప్పు లోకప్రభూ!
తే.గీ. తిన్నదేదియుఁగాదది తిండి కనగఁ
పంచియిచ్చినదే తిండి యెంచఁగాస్త
పేదకుంమెట్ట ఁ మ్రాణమ్ము వోదుకాద
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: ఆలోచిస్తే మనం తినేతిండి అసలు తిండేకాదు. ఇతరులకు పంచి ఇచ్చేదే అసలు సిసలైన పౌష్ఠికాహారం. మనం తిని అరిగించేసుకుంటే సరిపోతుందా? అన్నార్తులకు మనం కొంతపెడితే ప్రాణం పోదుకదా.్ధనానికి రక్షణ దానమే అన్న సూక్తిని మరిచిపోకుండా ఉన్నంతలో కాస్తంత దానం చేసి పుణ్యాన్ని మూటకట్టుకోమని కర్మసాక్షివైన ఓ సూర్యదేవ లోకానికి తెలియ జెప్పవయ్య లోకప్రభూ!

కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262