Others

శ్రీకృష్ణార్జున యుద్ధం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యన్టీఆర్, ఏయన్నార్ బావ బావమరదులుగా నటించిన మహాభారత నేపథ్య చిత్రం -శ్రీకృష్ణార్జున యుద్ధం. 1963 జనవరి 1న జయంతి పిక్చర్స్ బ్యానర్‌పై విడుదలైంది. కృష్ణుడిగా యన్టీఆర్, అర్జునుడిగా ఏఎన్నార్ నటనా వైదుష్యానికి పట్టంగట్టిన సినిమా. నిర్మాత, దర్శకుడు కెవి రెడ్డి అత్యంత శ్రద్ధతో నిర్మించిన చిత్రం. పింగళి నాగేంద్ర సంభాషణలు చేకూర్చగా పెండ్యాల సంగీతం, వెండితెర దృశ్యావిష్కరణకు ప్రముఖుడైన రవికాంత్ నగాయిచ్ కెమెరాతో సృష్టించబడిన దృశ్యకావ్యం. కృష్ణార్జునుల నడుము యుద్ధదృశ్యం ఆడియన్స్‌కి ఆనందాశ్చార్యాలు కలిగిస్తాయి. సుభద్రగా బి సరోజాదేవి, సత్యభామగా జి వరలక్ష్మి, నారదుడిగా కాంతారావు, రుక్మిణిగా జూ రంజని, బలరాముడిగా మిక్కిలినేని, రేవతిగా ఛాయాదేవి, గయుడిగా ధూళిపాళ, ధర్మరాజుగా గుమ్మడి, అక్రూరుడిగా చిత్తూరు నాగేశ్వరరావు, చిన్నమునిగా అల్లు రామలింగయ్య, అతని జోడి బాలసరస్వతి- శివుడిగా ప్రభాకరరెడ్డి బ్రహ్మదేవుడిగా ఎవి సుబ్బారావు, దుర్యోధనుడిగా ముక్కామల, కర్ణుడిగా సత్యనారాయణ పాత్రలు పోషించారు. పౌరాణిక చిత్రాల నిర్మాణంలో తెలుగువారికి సాధికారత ఉన్నదనటంలో అతిశయోక్తిలేదు. నటీనటుల హావభావాలు, మేలిమి బంగారు పాటలు, అమృత గుళికల్లాంటి సన్నివేశాలు.. వెండితెరపై పౌరాణిక చిత్రావిష్కరణ అజరామరం. బ్లాక్ అండ్ వైట్‌లో తీయబడిన సాంకేతిక అద్భుత రసకావ్యమిది.
మహాభారతంలోని అరణ్యపర్వంలో -వనవాసమందు అర్జునుడి ఆయుధ సంపత్తి సమకూర్చుకొనుటకై తీర్థయాత్రలు చేస్తాడు. ద్వారకలో ప్రేయసి సుభద్రను చూసి యతి వేషమునచేరి తన ప్రేమను బావ కృష్ణుని సహకారంతో గెలిపించుకుంటాడు. అండదండగావున్న కృష్ణపరమాత్మ, అర్జునుని మధ్య నడిచిన నాటకమే సినిమా సారాంశం. ‘గయోపాఖ్యానము’ నేపధ్యంలో జరుగుతుంది. సినిమా విడుదలై 54 ఏళ్లయినా -నిత్యనూతనంగా వెలుగు ప్రసరించే ముగ్ధమనోహర తెలుగు దృశ్యకావ్యం. ఈ సినిమా నాకు చాలా ఇష్టం.

-ఎల్ శ్రీనివాసరావు, అద్దంకి