Others

ఏది మంచి చెడు ఏది మంచి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విషయాలపైన ఎవరికైనా మొదట ఆసక్తి ఉంటుంది. వాటి గురించి తెలుసుకొంటారు. ఆ తర్వాత వాటిపైన కోరిక పుడుతుంది. ఆ కోరిక ను ఎలాగైనా సాధించాలి అనుకొంటారు. సత్యమార్గంలో నీతి మార్గంలో అయతే వెంటనే తీరిపోతుంది. కానీ ఆ కోరిక రోజు రోజుకు పెరిగి పెద్ద మానుగా అయనా ఆకోరిక తీరనపుడు వెంటనే మనిషిలో కోపం వస్తుంది. ఆ కోపం ఇతరులకు చెడు చేయాలన్న తలంపును పుట్టిస్తుంది. కానీ కోపం వచ్చిన మనిషినే మొదట కోపం కాల్చివేస్తుంది. ఆ తరువాత ఇతరులకు నష్టం కలిగిస్తుంది. కాని మొట్టమొదట కోపం వచ్చిన మనిషి కాలిపోతాడు కదా. దీన్ని పట్టించుకోకుండా ఇతరులకు చెడు చేయాలనే ఆలోచన ఎక్కువైతే అదే పగగా మారుతుంది.
కోపం వల్ల బుద్ధి నశించి చివరకు అధోగతి పాలవుతాడు అని ఎందరో పెద్దలుచెప్పారు. ఇంకా చెబుతూనే ఉన్నారు. కాని వాటిని పెడచెవిన పెట్టితే జరగబోయే చెడు జరగక మానదు కదా. అసలు కోపం రావడానికి కారణమే కోరిక. తన కోపమె తన శత్రువు.... అని సుమతీ శతకంలో ఉంది. కోపము మనిషికి ప్రథమ శతృవు అని అందరికీ తెలుసు. ఇది తెలియని విషయమూ కాదు. కానీ తెలసుకోవాల్సిన విషయం మాత్రమే. తీవ్రమైన కోపం మనిషిని మూఢునిగా చేసి వానిలో రక్తప్రసరణ అధికం చేసి ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది.చెడు చేస్తుందని అసలు కోపం ఉండకపోవడం కూడా తప్పే. కోపం ఉండి తీరాలి. కాని ఎంత పాళ్లల్లో ఉండాలో అంతే పాళ్లల్లో ఉండాలి. ఒకవేళ అసలే కోపం ఉండకపోతే కూడా మనిషికి చెడు చేస్తుంది. అంటే ముప్పు తెప్పిస్తుంది. అది ఎలాగంటే పూర్వం ఒక వూరిలో విషసర్పం ఉండేది. దాని దగ్గరకు వచ్చనవారిపైన కాటు వేసేది. ఆ పాముతో వూరివాళ్లందరూ ఎంతో బాధపడుతూ పామును చూడగానే పరుగెత్తి పారిపోతూ ఉండేవాళ్లు
అలాంటి సమయంలో ఆ వూరికి ఒక సాధువు వచ్చాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలంతా ఆ పాముగురించి సాధువుతో మొరపెట్టుకున్నారు. ఆ సాధువు పాము వద్దకు వెళ్లి ప్రజలను కాటువేసి చంపుట మానుకొనమని చెప్పాడు. ఆ సాధువు మాటల్లో ఏమి మహిమ ఉందో కాని ఆ రోజునుండి పాము ఎవరి జోలికి పోలేదు. అయితే కొన్ని నెలల తర్వాత మళ్లీ ఆ సాధువు అదే గ్రామం వచ్చినపుడు తాను హితబోధ చేసిన ఆ పాము ఎలా ఉందో చూద్దామని అనుకొన్నాడు. పాము చాలా దయనీయమైన అవస్థలో క్రుశించిపోయి ఉంది. ఏమైంది అని అడిగిన ఆ సాధువుతో పాము నీవు చేసిన హితబోధ పాటించి నేను ప్రజల జోలికి పోలేదు, అయినా ప్రజలు నన్ను రాళ్ళకొట్టి హింసిస్తున్నారు అని చెప్పింది. అందుకు ఆ సాధువు నవ్వి ‘‘నిన్ను ప్రజలను చంపవద్దని చెప్పాను కాని నీ బుసలతో వారిని భయపెట్టవద్దని చెప్పలేదుకదా. నీవు బుసకొట్తే ప్రజలు నీ దరిదాపులకి రాకుండా ఉండేవారుకదా అన్నాడు. ఆత్మరక్షణ కోసం తగినంత కోపం చూపించటం అవసరం కదా ఇకపై అట్లా ఉండు అంటూ తన చేతిని ఆ పాముపై స్పర్శించాడు. ఆ సాధువు తపో మహిమవల్ల పాముకు స్వస్థత కలిగింది. అప్పట్నుంచి ఎవరైనా తనను హింసించాలని చూస్తే బుస కొట్టి వారిని దూరం చేసుకొనేది.
అట్లానే మనుషులు కూడా కోపాన్ని కలిగి ఉండాలి. కాని అది కేవలం అదుపు లో ఉండాలి. ధర్మాగ్రహమై ఉండాలి. అపుడు కోపం వచ్చిన మనిషని ఇతరులకు కూడా మేలు కలిగిస్తుంది. ఏ విషయాన్నైనా విజ్ఞతతో ఆలోచిస్తే చాలు అది మేలు మాత్రమే చేస్తుంది. విజ్ఞత నశించిన నాడు కీడు చేస్తుంది. మనిషికి కావాల్సింది ముందు విజ్ఞత.

- చివుకుల రామమోహన్