Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాలుతున్న ఆకును చూసి భూమి పడే తల్లి తపన
మళ్లీ తన గర్భంలోకి రమ్మని పిలిచే
ఇంద్రియాతీత స్వరమైన సమచక్రవాల చేతనే..
ఆరు మెట్లెక్కి దిగుతూ ఎక్కుతూ దిగుతూ
ముడి విప్పటమనే ముహూర్తాన్ని
జ్ఞాపకంగా తిప్పుతూ వుంటుంది
మటిటలోనుంచి కొమ్మలపైకి ప్రవహించే వర్ణ్భాధాగ్ని
లోయల ఉయ్యాలలో ఊగే పువ్వై
పరిసరాల్ని పరిమళాల్తో వెలిగించి
గాలుల కెరటాలతో పోరాడుతూనే వుంటుంది
నా లోపలి కాలాన్నినిద్రలేపే చెట్టు కదా
చిరంతన తాత్త్విక చింతనకు చివుళ్ళు తొడుగుతూనే వుంటుంది
ఆకులు రాలే ఋతు రహస్యపు సామ్రాజ్య పరిణామ పరిణాహంలోంచి
ఆమని తొంగి చూడటమనే అపూర్వ దృశ్యాన్ని
కోకిల పంచపాత్ర అనే తన గొంతులోకి వొంచుకుంటుంది
సృష్టి విలువల దృష్టిపథం నండి జారిపోలేదు
ఉదయం వచ్చి దీపాన్ని ఆర్పుతుంది
దీపమేమో సాయంత్రాన్ని వెలిగిస్తుంది
ఈమధ్యకాలమంతా వెలుతురు కోలాహలంతో
ఊపిరులు వెదజల్లుతుంది...
జీవన రథచక్రాలు దొర్లుతూ వున్నప్పుడు - నా
నలిగిన వక్షస్సీమ నుండి ఆత్మభాష వెలువడుతుంది

ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404