Others

మూలాధార చక్రము- త్రైలోక్య మోహన చక్రము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము, మానవ శరీరం
ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
==============================================================
శ్లో॥ మూలాధారస్థ పద్మే శృతిదళలసితే పంచవక్త్రాం త్రినేత్రాం
దూమ్రాభామస్థి సంస్థాంసృణి మపి కమలం పుస్తకం జ్ఞాన ముద్రాం
భిభ్రాణాం బాహుదండై సులలిత వరదాం పూర్వ శక్త్యా వృతాంతాం
ముద్గాన్నాసక్త చిత్తాం మధీ ముదముదితాం సాకినీం భావయామః
శ్లో॥ మూలాధారాంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా
అంకుశాది ప్రహరణా వరదాది నిశేవితా
ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణి
(ల.స.స్తోత్రం శఓల:106,107)
మూలాధారం అనగానే ఇది చక్ర వ్యవస్థకంతటికి పునాది అని తెలుస్తోంది. ఇది పృధ్వీతత్వం గల చక్రం. బ్రహ్మదండమునకు అట్టడుగున, ఆసనానికి రెండంగుళములపైన, జననేంద్రియానికి క్రిందుగా మూలాధార చక్రము కలదు. ఈ చక్రంలో మూడు ప్రధాన నాడులు ఇడ, పింగళ, సుషుమ్న మరియు ఇతర నాడులు శక్తివంతములై ఊర్థ్వముఖంగా పయనిస్తాయి. ఇది సంకోచ వ్యాకోచాలు కలిగి ఉంటుంది. చిక్కటి ఎరుపు రంగు కలిగిన నాలుగు దళములు గల పద్మం వలె ఉంటుంది. ఈ మూలాధార పద్మం యొక్క కర్నికలో మరియొక పద్మం కలదు. దానిలో మూలాధార చక్ర అధిదేవతయైన సాకిని శక్తి స్ర్తి దేవతామూర్తిగా అధిష్ఠించి ఉన్నది. ఈ దేవత నాలుగు చేతులతో ఉన్నది. ఆ నాలుగు చేతులలో శూలము, ఖట్వాంగము, ఖడ్గము, చషకము ఉన్నాయి. ఇక్కడ త్రైలోక్య మోహన చక్రము మనల్ని మోహంలోకి నెట్టే సర్వమోహినిగా విజ్ఞులు చెప్పారు.
‘‘అజ్ఞానావృతం జ్ఞానం తేన ముహ్యంతిజంతవః’’ జ్ఞానము అజ్ఞానముచే కప్పబడగా జీవులు మోహమును పొందుదురు. శ్రీ మహాగణపతి ఈ చక్రానికి పురుష అధిదేవత. ఈ చక్రమందలి నాలుగు రేకుల పైన వరుసగా బంగారు రంగులో ‘‘వం, శం, షం, సం’’ అను బీజాక్షరాలు కలవు. బ్రహ్మకు స్థానమైన, ఈ మూలాధార చక్రం పై దృష్టినిలిపి ధ్యానించి సిద్ధి పొందితే సమస్త విద్యలలో ప్రావీణ్యంతో పాటు వాక్పటుత్వము కలగడంతో పాటు అట్టి సాధకునికి కోరికలు నశించి ఆత్మానందాన్ని పొందుదురు. గణపతిని , శివుని అష్టమూర్తులలో ‘‘శర్వుని’’గా చెప్పారు. అంటే పృథ్వీతత్వంగా మూలాధారంలో గణేశుడు ఉంటాడు.
- ఇంకా ఉంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9849560014