Others

కృతజ్ఞత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకృతి మనిషికి ఎప్పుడూ కృతజ్ఞత గురించి చెబుతూనే ఉంటుంది. ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరస్పర సహకారాన్ని అందించుకుంటూ ఉంటారు. చెట్టు మనిషి పుట్టిన నాటినుంచి చనిపోయిన తరువాత కూడా తాను ఉపయోగపడుతూనే ఉంటుంది. ఆఖరకు పూలతో, కాయలతో, పండ్లతోనే కాక చెట్టు ఎండిపోయినా ఆ చెట్టు కాండం, వేరు ఇవీ మనిషికి ఎంతో ఉపయోగపడుతాయి. ఇలా ఉన్నది వేరొకరికి ఇస్తే వచ్చే ఆనందం వెలకట్టలేనిది అని వృక్ష జాతి మనుష్యజాతికి చెప్పక చెబుతునే ఉన్నాయ. మనిషి ఒక విత్తును భూమిలో పాతి కాసిని నీళ్లు పోస్తే చాలు ఆ విత్తు మొలకెత్తి మనిషికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతూ తన కృతజ్ఞతను చాటుకుంటుంది.
ఇక జలాశయాలగురించి చెప్పనక్కర్లేదు. జలం లేకుంటే మనిషే ఉండడుకదా.
ప్రకృతిని చూసిన మనిషి కూడా తనలో కృతజ్ఞత అనేసుగుణాన్ని పొదువుకున్నాడు. త్రేతాయుగంలోని రాముని గురించి కలియుగంలోకూడా స్మరించుకుంటారు దీనికారణం రామునిలోని కృతజ్ఞతాభావమే. రామాదుల వనవాసంలో రాముడు సీతను దూరం చేసుకొన్నాడు. ఆ సీతమ్మ అనే్వషణచేస్తూ రామలక్ష్మణులు బయలుదేరారు. నా సీతను చూశారా అని చెట్టును, పుట్టను అడిగే రాముడిని చూసి జింకలు పరుగెత్తుకుని రామునికి ముందు వెళ్లి దక్షిణముఖంగా నిల్చున్నాయట. దాన్ని బట్టి సీతను దక్షిణం వైపుకు అపహరించుకుని వెళ్లారేమో అని రామలక్ష్మణులు అనుకొన్నారట. జింకలు ఇలా ఎందుకు చేశాయి అంటే రోజు సీతమ్మ జింకలకు లేత పచ్చగడ్డి పరకలు అందించేందట. అందుకని అవి కూడా సీతమ్మకు సాయం చేయాలనుకొన్నాయిని అంటారు.
అట్లానే జటాయువు తన స్నేహితుని కుమారులకు కష్టం వచ్చిందని బాధపడి సీతమ్మను అపహరించుకుని పోయే రావణునితో తన ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాడింది. పరాక్రమం అంతా చూపినా రావణుని చేతిలో రెక్కలు తెగగొట్టించుకుని ప్రాణాపాయాన్ని తెచ్చుకున్న జటాయువు తనప్రాణాలను ఉగ్గపట్టుకుని రామునికోసం వేచి చూసిందట.
చివరకు రాముడు కనిపించగానే తాను చూసిన దంతా చెప్పి, తాను పోరాడినా సీతమ్మను రక్షించలేకపోయాను అని వేదన చెంది చివరకు రాముని చేతిలో ప్రాణాలను వదిలివేసింది. ఈ పరిణామానికి రాముడు ఎంతో ఆవేదన చెందాడు. జటాయువు చేసిన మేలు మర్చిపోకుండా ముందు జటాయువుకు అంతిమ సంస్కారాలు తానేస్వయంగా చేశాడు. ఆ తరువాత జటాయువు చెప్పిన మార్గంలో సీతమ్మను వెతకడానికిముందుకు వెళ్లాడు.
రాముని కృతజ్ఞతకు ఇంకో ఉదంతమూ చెబుతారు. లంకపై దాడిచేయడానికి వానరులంతా సముద్రంపై వారధి కడుతున్నారు. వారిని ఓ ఉడుత చిరుప్రాణి చూసింది. తాను కూడా వారధి నిర్మించడంలో సాయం చేయాలనుకొంది. అల్పప్రాణినైన నేను ఎంత సాయం చేయగలను అని ఆలోచించకుండా వెంటనే సముద్రంలో మునిగి ఆ తడి శరీరాన్ని ఇసుకలో పొర్లించి వచ్చి వంతైనపై విదిలించేదట. తిరిగి మళ్లీ తడి చేసుకోవడానికి నీటిలోకి దుముకేదట. ఇలా చేస్తున్న ఉడుతను రాముడు చూశాడు. నాపై ఎంత ప్రేమతో ఇంత సాయం చేస్తుందో కదా ఈ ఉడుత అని తనని దగ్గరకు పిలుచుకుని తన బాధ ఉపశమించేలా ఉడుత మేనును నెమిరాడట. అందుకే ఇప్పటికీ ఉడుత వీపుగా మూడు గీరలు కనబడుతాయి. అవి ఆనాడు రాముడు ఉపశమనంగా నెమిరిన చేతి ఆనవాళ్లు. ఉడుత రాముని స్పర్శకు ఎంతో పొంగిపోయి రాముడికి సీతమ్మ లభ్యమవుతుంది అని ఆశీర్వదించిందట. ఇక ఆంజనేయుడు- వందయోజనాలున్న సముద్రాన్ని దాటి వెళ్లి లంకలో సీతమ్మను చూసి, రావణునిలో భయం కలిగించి రాముడు వస్తాడన్న ధైర్యాన్ని సీతమ్మలో నింపి వచ్చిన ఆంజనే యునికి ఏమిచ్చి ఋణం తీర్చుకోవాలో రామునికి తెలియలేదట. అందు కే నాకు, నీకు భేదాన్ని నేను పాటించను. నీవు నాకు ప్రాణసముడవు అని చెప్ప డానికి రెండు చేతులు చాపి ఆంజనేయుని కౌగిలించు కున్నాడట రాముడు. దాంతో ఆంజనేయుడు పరమానందభరితుడు అయ్యాడు.
కలియుగంలోనైనా సరే కలి పైత్యం పెట్రేగి పోతున్నా సరే ప్రతివారిలోను కొద్దోగానో గొప్పగానో సేవాభావం ఉండే ఉంటుంది. ఆ సేవాభావానే్న రాముడు, కృష్ణు డు, పాండవులు, కర్ణుడు, రంతిదేవుడు, శిబి చక్రవర్తి ఇలాంటి మహామహుల గురించి స్మరించుకుంటూ నిత్యం సేవాభావాన్ని, కృతజ్ఞతను ఎప్ప టికప్పుడు వృద్ధిచేసుకొంటూ ఉండాలి. ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. మరుజన్మలో మనం కూడబెట్టిన ఆస్తులు రావు కానీ ఈ జన్మలో చేసిన కర్మల తాలూకూ పుణ్యపాపాలు వస్తాయ కనుక వాటిని మర్చిపోకూడదు. పరులకు ఏదైనా హితం కలిగిస్తే అది పుణ్యాన్ని భగవంతుని దగ్గర జమ చేస్తుంది. కనుక సాయం చేయడం ఎంతో మంచిది.

- కె. వాణి ప్రభాకరి