Others

వచ్చేసింది మలేరియా టీకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోని మొట్టమొదటిసారి మలేరియా వ్యాధి నిరోధక టీకాను కెన్యాలో శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఇది పిల్లలకు ఇచ్చే సాధారణ టీకాల ప్రణాళికలో భాగం కానుంది. వచ్చే మూడేళ్లలో కనీసం మూడు లక్షల మంది చిన్నారులకు ఈ వాక్సీన్ ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది మలేరియా బారినపడి మరణిస్తున్నారు. వీరిలో చిన్నారులే అధికం. మలేరియా వ్యాధికి ప్రధాన కారణం ప్లాస్మోడియా పారాసైట్లు. ఈ వ్యాధి దోమకాటు వల్లే ప్రధానంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు తీవ్రమైన జ్వరం, వణుకు కారణంగా నీరసించిపోతారు. పారాసైట్లు కాలేయం పైనా, రక్తంలోని ఎర్రరక్తకణాలపై దాడి చేయడం ద్వారా రక్తహీనతకు కారణమవుతోంది. అలాంటి వ్యాధిని తగ్గించే ఈ వాక్సీన్ తయారీ, పరిశోధన, పరీక్షలు అన్నింటికీ కలిపి మొత్తం ముప్ఫై సంవత్సరాలు పట్టింది. మానవుల్లోకి రోగనిరోధక వ్యవస్థకు తగిన శిక్షణనిచ్చి మలేరియా వ్యాధికారక సూక్ష్మజీవులపై పోరాడేందుకు ఈ టీకా దోహదం చేస్తుంది. మలేరియా వ్యాధికి ప్రధాన కారణం దోమకాటు. చిన్నారులకు ఈ వ్యాక్సిన్ రెండేళ్ళ వయసు వచ్చేలోపు నాలుగు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల కనీసం పదిమంది చిన్నారుల్లో నాలుగు మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. తీవ్రమైన మలేరియా వ్యాధి కేసులు కూడా 75 శాతం తగ్గినట్లు వెల్లడైంది. ఈ వాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేవని మలేరియాను అరికట్టేందుకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని క్లినికల్ ట్రయిల్స్‌లో ఇప్పటికే వెల్లడైంది. కెన్యాలోని కిసుము, కాకమెగా, మోంబాసా ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో మొదటిగా ఈ వ్యాక్సిన్ సరఫరా చేశారు. ప్రపంచంలో ఎంతోమంది మరణాలకు కారణమవుతున్న మలేరియా వ్యాధి నిర్మూలనలో ఈ వ్యాక్సీన్ కచ్చితంగా పెనుమార్పులు తీసుకురానుంది.