Others

భక్త్భివం.. అహంకారం దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దిగానో గొప్పగానో పుట్టినప్పటినుంచి ప్రతివారిలో అహంకారం ఉంటూ ఉంటుంది. మేధావులు, విజ్ఞులు దాన్ని గుర్తించి అది వినాశకారి అని తెలుసుకొని దూరంగా నెట్టివేస్తారు.
ఒక చోటుకు వెళ్లినా, ఒకరికి ఏదైనా దానం చేసినా ఒకరినుంచి ఏదైనా స్వీకరించినా, ఆర్జించినా, ఖర్చు చేసినా ఆఖరికి దేవుని దర్శనానికి వెళ్లినా అన్ని పనుల్లో, అన్ని వేళల్లో చాలామందిలో అహంకారం వెంటాడుతూనే వుంటుంది’’ అని సెలవిచ్చాడు గురునానక్.
నిజమే మనుష్యులకు సుఖం రాగానే అంతా నేనే చేశాను. కష్టానికి ఫలం దక్కింది అనుకొంటాడు. మరుక్షణం నుంచి అహం కారం మొదలవుతుంది. అంతకు ముందు ఎందరో ఆ పనిని చేసేఉంటారు. ఈ ప్రపంచంలో కనుక్కుంటున్నామని అనుకొనే దంతా కూడా అంతా ఆధునిక శాస్త్రాలు కూడా ఇంతకుముందు ఉన్నవి కాని అవి తెలియక మరుగున పడి ఉన్నవి. వాటిని ఇపుడు కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. కొత్తగా ఆవిష్కరించాలను కొనేవారు పాతదాన్ని కనీసం మాదిరిగా నైనా చూస్తారు. మరప్పుడు కొత్త ఏముంది? దేనినైనా లోకంలో ఉన్నదాన్ని మరొకదానితో కలుపో లేక విడగొట్టో కొత్తగా చేస్తున్నాం. కానీ నిజానికి అసలు కలపడానికో, విడగొట్టడానికో ఏదైనా ఒక పదార్థం అంటూ ఉండాలి కదా. ఆ పదార్థం ఉండబట్టి కదా చేస్తున్నాం.
ఉదాహరణ తీసుకుంటే ఏదైనా తినేపదార్థం నేను భలే రుచిగా అసలు ఎవరూ ఇప్పటివరకు అట్లా తయారు చేసి ఉండరు. నేను మాత్రమే చేయగలను అని విర్రవీగితే పదార్థం చేయడానికి అన్నీ వస్తువులు ఉన్నవే కదా. అట్లాగే మిగతావన్నీ కూడా. దీర్ఘంగా దూరంగా ఆలోచిస్తే అహంకారం దేనికీ పనికి రాదు అని తేలుతుంది. కాని అట్లా ఆలోచిం చరు. మిడిమిడి జ్ఞానవంతులు ఎక్కువ అహంకారాన్ని చూపిస్తుంటారు.
అసలైన జ్ఞానులు సర్వాన్ని ఒకటేలా చూస్తారు. వారిలో మచ్చుకు కూడా అహం కారం ఉండదు. వాళ్లు పేడనైనా, బంగారానైనా ఒకటేలా చూస్తారు. గొప్పధనవంతులతోను, అతి పేదరికంతో మగ్గిపోయేవారితోను ఒకే రకమైన మాటలు మాట్లాడుతారు. అంతా భగవంతుని ఇచ్ఛఅంటారే కానీ నా స్వప్రయో జనం అని అనరు.
‘‘అహంకారమనేది ఒకానొక దీర్ఘవ్యాధి, పరమాత్ముని దయవుంటే గురువు సహాయంతో ఈ రోగాన్ని నయం చేయవచ్చు’’ అని కూడా గురునానక్ చెప్తారు.
వాస్తవానికి చూస్తే ఇది మన సొత్తు అని చెప్పుకోగలిగినది ఈ లోకంలో మనకు ఏమీ లేదు. సర్వస్వమూ ఆ భగవంతుని ఆస్తి. మరణించిన తర్వాత ప్రాపంచిక వస్తువులేవీ మన వెంట రావు.
ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతు లున్నా, ఎంత శాస్తవ్రేత్తలైనా సరే ఒకనాటికి వారు వీరు అనే తేడాల్లేకుండా అందరూ కాలప్రవాహంలో కనుమరుగయ్యేవారే. కనుక అహంకారాన్ని గుర్తించి దూరం చేసుకోవ డానికి అహర్నిశలూ ప్రయత్నించాలి.
నిత్యమూ నారయణ స్మరణ చేసే నారదుడే అహంకారానికి బానిస అయ్యాడు. నేను కనుక అహర్నిశమూ నీనామాన్ని స్మరిస్తూన్నాను. నీవు సృష్టించి 14 భువనాల్లో ఎవరైనా నాలాంటి వారిని నాకున్నంత భక్తి ఉన్నవారిని నీవు చూశావా అని భగవంతుడినే ప్రశ్నించాడు.
భగవంతుడు చిన్నగా నవ్వుకుని అసలు విషయం చెప్దామనుకొన్నాడు. నిండుగా ఉన్న నూనె చెంబు చేతికిచ్చి ధీనిలోని నూనె ఒలి కించకుండా భూమండలాన్ని ఒకసారి చుట్టిరమ్ము. నీ అంత భక్తుడూ నీకున్నంత భక్తి భావన ఉన్నవారు ఎవరూ లేరని ఒప్పుకుం టాను అన్నాడు. పాపం నారదుడికేమి తెలుసు. మహతిని మెడలో వేసుకొని కళ్లు మూసుకుని హరే కృష్ణ హరే కృష్ణ నారాయణ నారాయణ అని తిరగడం తప్ప.
నూనె చెంబు పట్టుకోగానే నారాయణ స్మరణ మానివేసి నూనె ఎక్కడ ఒలుకుతుందో ఏమో అనుకొని కళ్లు అర్పించుకున్నాడు. శరీరంలోని అన్ని భాగాలను కేవలం నూనెపైన కేంద్రీకృతం చేశాడు. పాదాలు జాగ్రత్తగా మెల్లగా వేయాలి. లేకుంటే నూనె... చేతులు పదిలంగా పట్టుకోవాలి.. లేకుంటే... మనసు ఎక్కడో ఉంచి నడిస్తే అసలే నూనె అమ్మో... ఇలా అన్నీ నూనె. చివరకు నారాయణుని దగ్గరకు వచ్చాడు. అప్పటికే కొంత నూనె ఒలికనే ఒలికింది. నూనె గొడవతో నన్ను పూర్తిగా మరిచావే అన్నాడు నారాయణుడు. అంతే అసలు విషయం నారదునికి తెలిసింది.
కానీ మనుష్యులంత మంచివారా.. ఒక చిన్న కథ చెప్తే మారుతారా.. అందుకే రోజు రోజు మంచి మాటలు వింటూనే ఉండాలి. మంచివారి సాంగత్యం చేయాలి. వారి సన్నిధిలో మనలో అహంకారం పుట్టిందా అని ఆలోచించుకుని ఎప్పటికప్పుడు మనసును నిర్మలం చేసుకోవాలి. మంచి సంగతులు విని విని మంచి వారితో స్నేహం చేస్తూ కాలం గడిపితే కొద్దికాలానికి నారాయణుడు చెప్పిన అహంకార రాహిత్యాన్ని మనిషి పొందుతాడు.

- మాంగటి వెంకట రాధిక