Others

ఆదిత్య 369 (నాకు నచ్చిన సినిమా )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహాజనితమైన టైంమెషీన్ నేపథ్యంలో వర్తమానంనుండి భూత భవిష్యత్ కాలాలను స్పృశిస్తూ జనరంజకంగా మలచిన చిత్రరాజం ‘ఆదిత్య 369’. బ్యాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం మరియు హెచ్‌జి వెల్స్ నవల టైం మెషీన్ స్ఫూర్తితో రూపొందిన చిత్ర కథకు సైన్స్‌ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్ అంశాలను జోడించి ప్రేక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా చిత్రీకరించారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు అంతగా అలవాటులేని క్లిష్టతతో కూడుకొన్న కథను సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన సినిమా 1991 జూలై 18న విడుదలయింది.
మాస్‌మసాలా యాక్షన్ సినిమాలు వెల్లువగావస్తున్న ఆ కాలంలో ఆ ధోరణికి భిన్నంగా టైమ్‌మెషీన్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఓ ఆణిముత్యంగా నిలిచింది. కథాపరంగా వర్తమానంతో మొదలైన ఈ చిత్రంలో కృష్ణకుమార్‌గా నందమూరి బాలకృష్ణ నవ యువకునిగా అతనికి జోడీగా కథానాయిక హేమ పాత్రలో మోహిని నటించారు. ఆమె తండ్రిగా హిందీ నటుడు టినూ ఆనంద్ ప్రొఫెసర్ రాందాస్ పాత్రలో భూత, భవిష్యత్ కాలాలకు తీసుకువెళ్లే ఒక టైంమెషీన్‌ని కనిపెడతాడు. అది ప్రయోగ దశ ప్రయత్నాల్లో ఉండగా అతని కూతురుతో ప్రేమలో ఉన్న హీరో ఒకసారి వాళ్లింటికి వచ్చి హీరోయిన్‌తోపాటు వారిని వెంబడిస్తూ వచ్చి పోలీస్ కానిస్టేబుల్ పాత్రధారి సుత్తివేలుతో కలిసి టైంమెషీన్ ద్వారా గడచిపోయిన కాలంలోని శ్రీకృష్ణదేవరాయల రాజధాని హంపీ విజయనగరానికి చేరుకుంటారు. అలా నడిచే కథ -తరువాత భవిష్యత్ కాలానికి వెళ్లిపోవడం ఆ కాలంలో భూమండలం అంతా రేడియేషన్ మయంకావడం.. అక్కడినుండి మళ్లీ వర్తమానంలోకి రావడం విలన్‌గా రాజావర్మ పాత్రలో నటించిన హిందీ నటుడు అమ్రిష్‌పురితో హీరో తలపడడంతో సినిమా ముగుస్తుంది. బాలకృష్ణ ఆహార్యం, అభినయం.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభ, జంధ్యాల కథ, విఎస్‌ఆర్ స్వామి ఫొటోగ్రఫీ చిత్రానికి ఎంతో బలాన్నిచ్చాయి. ఇళయరాజా స్వర కల్పనలో జిక్కితో పాడించిన ‘జాణవులే’ అన్న ఒక్క పాట చాలు సినిమా గొప్పతనానికి. ఈ చిత్రం ఆబాలగోపాలాన్నీ ఎంతగానో అలరించింది. ఈ చిత్రానికి చేస్తున్న సీక్వెల్ ప్రయత్నాలు ఫలిస్తే నాలాంటి వాళ్లకు పండగే పండగ.

-ఆర్ రామకృష్ణ, విజయనగరం