Others

విభిన్న భాషలకు వారధి.. హిందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు హిందీ దినోత్సవం)
ఏదైనా దేశ సంస్కృతికి వాహకము ఆ దేశ భాషయే. భాష లేకుండా సంస్కృతి వెలుగులోకి రావడం అసంభవం. ఆ విధంగా భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రాచీన భారతదేశం బహుభాషలకు నిలయం. ఇక్కడ విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో పాటు ఒక్కో ప్రాం తంలో ఒక్కో భాష మాట్లాడడం అనాదిగా చూస్తున్నాము. ఆయా ప్రాంతాల్లో మాట్లాడే భాషలను ప్రాంతీయ భాషలంటారు. వీటి ద్వారా కేవలం ఆ ప్రాంతంలోనే కార్యకలాపాలు జరపవచ్చు. ఆ ప్రాంతం దాటి ఇతర ప్రాంతాల్లో వ్యవహారాలు కొనసాగించాలంటే అందరికీ అర్థమయ్యే ఒక అనుసంధాన భాష అవసరం. నాటినుండి నేటి వరకు ఆ అవసరం తీర్చుతున్న భాష హిందీ మాత్రమే. స్వాతంత్య్రోద్యమ కాలం కంటే ముందునుండి విభిన్న భాషల మధ్య వారధిగా హిందీ భాష ఎంతో విశిష్టస్థానాన్ని కలిగి ఉంది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులందరినీ ఏకతాటిపైకి తెచ్చిన భాష హిందీ. కనుక 1947 స్వాతంత్య్రానంతరం హిందీ జాతీయ భాష అవుతుందని అందరూ స్వాభావికంగా భావించారు.
ఆ విధంగానే 14 సెప్టెంబర్ 1949న 324 మంది సభ్యులున్న భారత రాజ్యాంగ సభలో 312 మంది హిందీకే తమ మద్దతు తెలిపి భారతీయుల ఆశను చరితార్థం చేశారు. కానీ విభిన్న భాషా ప్రతినిధుల ద్వారా మద్దతు పొందినప్పటికీ ఇది అమలుకాలేదు. కారణం దేశ భాష పట్ల, సంస్కృతి పట్ల మక్కువ లేని మరియు విదేశీ భాష, సంస్కృతుల వ్యామోహంలోఉన్న వారి చేతుల్లో అది బందీ అయింది. ప్రపంచంలోనే హిందీ ఒక ప్రముఖ భాష. భారతదేశంలో అత్యధికం గా మాట్లాడే, అర్థం చేసుకునే భాష హిం దీ. దేశంలోని అన్ని రాష్ట్రాలను కలిపే సమర్థత ఉన్న భాష హిం దీ. చైనీస్ భాష త ర్వాత ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ. ప్రపంచ ఆర్థిక రంగంలో శక్తివంతమైన పది భాష ల్లో హిందీ ఒకటి. హిందీ, దాని ఉప భా షలను భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో మాట్లాడుతారు. భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల ప్రజలు మాతృభాష అనంతరం ఉపయోగించే మరో భాష హిందీ. అయినప్పటికీ హిందీ భారతదేశ అధికార భాషగా కాగితాలపైనే మిగిలిపోయింది. భారత రాజ్యాంగంలో ఇప్పటివరకు అధికారికంగా ఏ భాషకు జాతీయ భాష హోదా కల్పించలేదు.
మహాత్మాగాంధీ 1906లో ‘ఇండియన్ ఒపీనియన్’ అనే పత్రిక ద్వారా ‘దేశ సమైక్యత’, సౌభ్రాతృత్వం కోసం అత్యధికంగా మాట్లాడే హిం దీయే జాతీయ భాష గా ప్రోత్సహించ తగినదని’పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343(1) నుండి ఆర్టికల్ 352వరకు అనేక నిబంధనలతో కూడి దేవనాగరి లిపిలో హిం దీకి అధికార భాష హోదా కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రతి రంగంలో వ్యాపింప చేసేందుకు వార్థాలోని ‘రాష్ట్ర భాషా ప్రచార సమితి’ వారి కోరిక మేరకు 1953నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్‌ను హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1963లో అధికార భాషాచట్టం రూపుదిద్దుకుంది. రాజ్‌భాషా ఆయోగ్ మరియు పార్లమెంటరీ కమిటీ సంయుక్తంగా నిర్ధారిత 15 సంవత్సరాల తర్వాత 1965లో ఆంగ్లమును సహరాజ్ భాషగా తీర్మానించారు.
నేడు ఎన్నో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో, బ్యాంకుల్లో, పోస్ట్ఫాసుల్లో, న్యాయస్థానాల్లో, రైల్వే, టెలికాం, విమానయానం తదితర అన్ని ప్రభుత్వ శాఖల్లో అధికార భాషగా హిందీని ఉపయోగిస్తున్నారు. చట్టం, న్యాయం, ప్రభుత్వ, శాసన శబ్దావళి మరియు సాంకేతిక పరిజ్ఞానంలో హిందీ భాష అభివృద్ధి చెందింది. కానీ నేటికీ జాతీయ భాషగా అధికారికంగా గుర్తింపులేకపోవడం శోచనీయం.ఐక్యరాజ్యసమితి అధికార భాషల్లో హిందీకి స్థానం కల్పించేందుకు నేటికీ విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు విభిన్న భాషాప్రాతిపదిక రాష్ట్రాలమధ్య సాహితీ, సాంస్కృతిక భిన్నత్వం దూరం చేస్తూ, ఎన్నో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, పరస్పర సద్భావం పెంపొందిస్తున్న హిందీని అధికారికంగా జాతీయ భాషగా ప్రకటించి, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో హిందీ భాషాభివృద్ధికి చేయూతనందిస్తే భవిష్యత్తులో భారతదేశం మరింత శక్తివంతంగా మారగలదు. నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదా 2019లోనైనా హిందీని అన్ని రాష్ట్రాల్లో అమలుచేస్తే దేశ సమైక్యతకు, సౌభ్రాతృత్వానికి వారధిలా హిందీ పనిచేస్తుంది.

-డాక్టర్ కమలేకర్ నాగేశ్వర్‌రావు 98484 93223