Others

అనంత వ్రతం అపారమైన పుణ్యాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని తామస కళారూపం ఒకటి ఉంది. అది సుమారుగా పురాణాల ఆధారంగా చూస్తే పాతాళానికి 30వేల యోజనాల క్రింద ఉందని అంటాఠు. ఆ రూపానే్న ‘అనంతుడు’ అంటారు. సంకర్షణుడు అనీ అంటారు. ఈ భూమండలాన్ని తన శీర్షంపై ఆవగింజలాగా ధరిస్తాడు. ఆయన ‘సహస్ర శీర్షుడు’ ప్రళయ సమయంలో లోక సంహారం నిమిత్తం ఆయన భ్రుకుటి నుండి ‘త్రిలోచనుడు, త్రిశూలధరుడు, ఏకాదశరుద్ర స్వరూపుడు’ ఆవిర్భవిస్తారు. నీలవర్ణ వస్త్రాలతో, ఏకకుండలంతో, భుజంపై నాగలితో, మెడలో వైజయంతీమాలతో ప్రకాశిస్తాడు భగవంతుడు అనంతుడు! అనంతగుణ సంపన్నుడైన ఆయనను నాగరాజ కన్యలు సేవిస్తారు. సురాసురులు, సిద్ధులు, మునులు, గంధర్వులు, విద్యాధరులు, ఉరగులు వారు వీరను తేడాల్లేకుండా అందరూ ధ్యానిస్తారు.
‘చిత్రకేతువుకు’ నారదుడు సంకర్షణ మంత్రాన్ని ఉపదేశించగా, ఆయన ఆ స్తోత్రాన్ని ఏడు రోజులపాటు ఏకాగ్ర చిత్తంతో జపించాడు. అట్లా జపించిన చిత్రకేతువుకు ఆ అనంతుని దర్శనం లభించింది. నీలవస్త్రంతో, కిరీట, కేయూర, కటి సూత్ర కంకణాలతో ప్రసన్న వదనుడై, ఎర్రని కనులతో, సనత్కుమారాది సిద్ధులు సేవిస్తూ ఉన్న ఆ మూర్తిని దర్శించగానే, చిత్రకేతువు పాపాలు నశించాయి. భక్తి అతిశయించి, శరీరం పులకాంకితమై, ఆనందాశ్రువులు ప్రవహించి, ఆ స్వామి యొక్క పాదపీఠాన్ని అభిషేకించాయి. అతడి భక్తికి మెచ్చిన అనంతుడు ప్రసన్నుడై ఆధ్యాత్మిక తత్త్వాన్ని బోధించాడు. దివ్య విమానాన్ని, విద్యాధరలోకాధిపత్యాన్ని అనుగ్రహించాడు.
ఈ అనంతుడినే అనంత పద్మనాభ స్వామిగా భావించి పూజిస్తారు. ఈ అనంతుని పేరిట జరిగే వ్రతమే ‘అనంత పద్మనాభస్వామి వ్రతం.’ దీనిని భాద్రపద శుద్ధ చతర్దశినాడు ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించినవారికి ఇహలోకంలో సంపదలతో పాటు విష్ణుసాయుజ్యం కూడా అంత్యంలో లభ్యమవుతుంది.
ఈ వ్రతాన్ని పూర్వం శ్రీకృష్ణుడు రాజ్యం కోల్పోయన పాండవాగ్రజుడైన ధర్మరాజు చేత ఆచరింపజేసినట్లు, ఆయన ఆ విధంగానే చేసి, తన రాజ్యాన్ని పూర్వ వైభవాన్ని తిరిగి పొందినట్లు, పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం కీర్తిని, శుభాలను, పుత్ర, పౌత్ర లాభాన్ని, సిరిసందలను ఇవ్వడమేకాక, ఆధ్యాత్మిక జ్ఞానాన్నిచ్చి, అంత్యాన మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణ వచనం.
వ్రతాచరణ:
పూజ చేసుకొనే ప్రదేశాన్నిమొదట శుభ్రం చేసి సిద్ధం చేసుకోవాలి. స్నానం చేసి పరిశుభ్రమైన వస్తమ్రులను ధరించి,పూజా స్థలాన్ని గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, అష్టదళ పద్మాన్ని వేసి, తామర పువ్వు వంటి మండలాన్ని నిర్మించాలి. తెల్లని బియ్యపు పిండితో, ముగ్గులతో అలంకరించాలి. దక్షిణ భాగంలో నీటితో నింపిన కలశాన్ని ఉంచి వేదిక మధ్యలో ‘అనంతపద్మనాభస్వామిని’ దర్భతో చేసి, ఆవాహనం చేసి, కల్పోక్త ప్రకారంగా షోడశోపచార పూజ గావించాలి. ‘కృత్వా దర్భమయం దేవం శే్వత ద్వీపే స్థితమ్ హరిమ్ సమన్వితం సప్త ఫణె పింగళాక్షం చతుర్భుజమ్’ అంటూ ప్రార్థించాలి. ప్రదక్షిణ నమస్కారములుగావించి, పధ్నాలుగు ముళ్లు గలిగిన, కుంకుమతో తడిసిన, కొత్త తోరమును స్వామి దగ్గర ఉంచి పూజించాలి. ఐదు పళ్ల గోధుమ పిండితో 28 అప్పాలను చేసి స్వామికి నివేదన చేసి తోరాన్ని కుడిచేతికి కట్టుకోవాలి. 14 అప్పాలను, బ్రాహ్మణునికి యిచ్చి, తరువాత బ్రాహ్మణ సమారాధనను చేసి దక్షిణ తాంబూలములతో సంతృప్తిపరచి, తాను భుజించాలి. పూజాద్రవ్యములు అన్నీ పధ్నాలుగేసి ఉంచాలి.
వ్రతమహాత్య్మం :
పూర్వం కౌండిన్య ముని భార్య ‘శీల’ ఈ వ్రతాన్ని ఆచరించగా, వారి ఆశ్రమం అష్టైశ్వర్యాలతో నిండిపోయిందట! ఆమె చేతికి ఉన్న తోరాన్నిచూసి ముని అడుగగా, అది పద్మనాభ స్వామిదని, ఆయన వ్రతాన్ని ఆచరించడంవల్లను, తోరాన్ని ధరించడంవల్లను, మనకీ సిరిసంపదలు లభించాయని చెప్పిందట! అతడు దానిని నమ్మకం అపచారం చేస్తాడు. దానితోదారిద్య్రావస్థకు లోను అవుతారు. అపుడు అసలు సంగతి తెలుసుకొని తాను తప్పు చేశానని పశ్చాత్తాపం చెందుతాడు కౌండిన్యుడు. ఆ తరువాత పద్మనాభస్వామిని దర్శించాలని తిరిగి తిరిగి అతడు మూర్చపోగా, స్వామి కనిపించి, 14 సంవత్సరాలు వ్రతాన్ని ఆచరించమని, నీకు నక్షత్రలోకంలో స్థానాన్ని ఇస్తానని చెప్పాడట! ఆ కౌండిన్యుడు తిరిగి ఆశ్రమానికి వచ్చి జరిగినది భార్యకు చెప్పి, 14 సంవత్సరాలు అనంత పద్మనాభుని వ్రతాన్ని ఆచరించాడట! ఇహలోకంలో సిరిసంపదలను, పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది, అంత్యకాలమునందు నక్షత్రలోకంలో స్థానాన్ని పొందాడు. ఇప్పటికీ నక్షత్ర మండలంలో కానవస్తున్నాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పినట్లుగా పురాణాలు చెబుతాయ.
ఈ వ్రతాన్ని ఆచరించినవారికే కాక, వ్రతాన్ని చూసినవారికి, ప్రసాదాన్ని స్వీకరించినవారికీ, అనంత పుణ్యఫలం లభిస్తుంది.

- ఆర్. పురందర్