Others

పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ హక్కుతో ఆనందంగా
స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నావో
ఏ హక్కుతో అవిరామంగా
స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నావో
ఏ హక్కుతోనైతే ఈ నేలపై
యధేచ్ఛగా తిరుగాడుతున్నావో
ఏ హక్కుతో
నోరు తెరిచి ప్రశ్నిస్తున్నావో
ఆదమరచి నిద్రిస్తున్నావో
ఏ హక్కుతో సమాజంలో
నీ కంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నావో
ఏ హక్కుతో నిర్భయంగా
భావ ప్రకటన చేయగలుగుతున్నావో
ఏ హక్కుతో అనునిత్యం
నీ అస్తిత్వాన్ని కాపాడుకోగలుగుతున్నావో
ఏ హక్కుతో కాలం తీరే వరకూ
సురక్షితంగా జీవించగలుగుతున్నావో
ఓ పౌరుడా
ఆ హక్కు పేరే పౌరసత్వమని గ్రహించు
ఆ హక్కుని నీకిచ్చిన దేశాన్ని గౌరవించు

- బి.బి.టి. సుందరతేజ, విజయనగరం