Others

త్రివిక్రముడు వామనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛలయసి విక్రమణీ బలిమద్భుత వానమ
పదనఖ నీరజనతజన పావన
కేశవ ధృత వామన రూప జయ జగదీశ హరే ... అంటూ భక్తజయదేవుడు దశావతారాల్లోని వామనుణ్ణి కీర్తించారు.
దేవాసుర యుద్ధంలో ఇంద్రునిచే ఓడిపోయిన బలి, రాక్షస గురువగు శుక్రాచార్యుల వలన బతికి గురోపదేశంతో విశ్వజిత్ యాగం చేసి బంగారు రథము, మహాశక్తివంతమైన ధనుస్సు, అక్షయ తూణీరాలు, కవచము, శంఖములు పొంది రాక్షసులందరినీ సమీకరించి దేవేంద్రుని అమరావతిపై దండెత్తినపుడు దేవతలు భయకంపితులై పారిపోయారు.
దేవతల దుస్థితిని సురమాత అదితి చూసి తన భర్త ఐన కశ్యప ప్రజాపతిను వారిని రక్షించమని వేడుకొంది. ఆయన ఆమెను పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశించాడు. 12 రోజులపాటు ఈ వ్రతాన్ని ఆచరించింది అదితి. ఆ తరువాత భగవదంశతో భాద్రపద ద్వాదశినాడు వామనుడు అదితికశ్యపులకు జన్మించాడు.
వామనునికి కశ్యప ప్రజాపతి ఉపనయన సంస్కారాలు జరిపించాడు. ఆ సమయంలోనే మహావిష్ణువు భక్తుల్లో అగ్రగణ్యుడని బలి చక్రవర్తిలో అహంకారం పెచ్చుమీరింది. తన భక్తులలోఅహంకారం జనిస్తే దాన్ని పోగొట్టి వారిని సన్మార్గంలో ఉంచే బాధ్యత కూడా భగవానుడైన మహావిష్ణువే తీసుకొంటాడు కనుక వటుగా మారిన వామనుడు బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు.
నడుముకు గజ్జెలున్న మొలత్రాడును, మృగశరీరాన్ని తన వస్త్రాలంకారంగా చేసుకొని, యజ్ఞోపవీతాన్ని ధరించిన వామనుడు చిరునవ్వు తో అశ్వమేధయాగం చేసే బలి చక్రవర్తి దగ్గరకు వెళ్లాడు. అక్కడ బలి బ్రాహ్మణులకు భూరి విరాళాలిస్తున్నాడు. దానిని చూసి వామనుడు బలి చక్రవర్తి ఆశీర్వదిస్తూ అక్కడికి వెళ్లాడు. ఆయన్ను చూసీ చూడగానే బలిచక్రవర్తి కనుల నీరు నిండగా రెండు చేతులెత్తి మొక్కాడు. మహావిష్ణువుగా వామనుడిని గుర్తించిన శుక్రాచార్యుడు తన శిష్యుడిని జాగ్రత్త పరచాలని తలిచాడు. అంతలోనే వామనుడిని బలి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. కోరుకున్నదాన్ని కాదనకుండ కూడ ఇస్తానని ప్రమాణం చేశాడు.శుక్రాచార్యుడు బలి చక్రవర్తిని ఎదురుగుండా నిల్చుని వరాలను ఇస్తానని చెప్పించుకుంటున్న వారు మామూలు వటువు కాదు ఆయనస్వయంగా మహావిష్ణువు అని చెప్పాడు. ఆయనకు దానం ఇవ్వద్దు అని ఎన్నో విధాలుగా నచ్చచెప్పాడు. కానీ గురువుగారి మాట వినకుండా బలిచక్రవర్తి మహావిష్ణువు అవతారుడైన వామనుడికి మూడు అడుగుల నేల దానం ఇచ్చాడు. ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా పెరిగి పెరిగి చివరకు భూమ్యాకాశాలకు వామనుడు విస్తరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపివేశాడు. అతనిలోని అహంకారాన్ని అణచివేశాడు. బలిచక్రవర్తి వామనుడిని శరణుకోరగా వామనుడు ఎంతో సంతోషించి తానే బలిచక్రవర్తి పాతాల రాజ్యానికి కాపలాదారుగా ఉంటానని మాటిచ్చాడు. అందుకే భాద్రపద ద్వాదశినాడు వామనుడిని పూజించిన వారిని మహావిష్ణువే స్వయంగా అన్నివేళలా కాపాడుతాడని అంటారు. ఈ ద్వాదశిని వామన ద్వాదశిగా సంభావించి వామన జయంతిని విష్ణ్భుక్తులు జరుపుతారు. వామనుని పూజించిన వారికి అహంకారాదులు దరిచేరవని అంటారు.

-డేగల అనితాసూరి.. 9247500819