Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాటిదోనెలో కూర్చొని తామరాలు
తెంపుకుంటూ..
పృథివి మీద తొలి కిరణ తుషారం
తొలకరించినప్పుడు
నేనింతా మట్టిరేణువునే..
స్మృతుల స్పర్శాభిమంత్రణతో
చైతన్యం ఒనగూర్చుకున్న నాడీరక్తప్రవాహాన్నై
అవతరించాను..
మంచు తడిడిన చేమంతిపూవు
మంద్రపరీమళ తంత్రుల్ని
జీవనరాగం కోసం
శ్రుతిచేసినప్పటి బాధలోనుంచి
అభివ్యక్తమైన నాదాన్ని
యుగాల మానిషాదాన్ని..
ప్రాకృత జవన జీవనాశ్వంమీద
స్వరాల స్వారీ చేసే ముందు
కళ్ళుమూసుకున్న ధ్యాన శిశువౌనిని...
ప్రణయం నుండి ప్రణవం వరకు
స్వర్గంగా లహరుల్లో తడిసిన శబ్ద శూలిని
వౌనతమంగా పడివున్న
వీణ తీగల్ని మీటుతూ
కాంతి గీతాలాపన చేస్తూ
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404