Others

జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుడే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకు మేలుచేసిన వారిని మరియు చేస్తున్న వారిని మరల మరల తలుచుకుంటూ, వారి పట్ల కృతజ్ఞతను ప్రకటించుకుంటూ ఉండడం మానవ సంస్కృతిలోని ప్రాథమిక లక్షణం. ఇది ప్రత్యేకంగా మన భారతీయ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండవలసిన గుణం. ఇదే మన భారతీయతకు నిదర్శనం. గత కొనే్నళ్లుగా దేశవ్యాప్తంగా భారతదేశ మొదటి ఉప రాష్టప్రతి మరియు మాజీ రాష్ట్రపతి అయిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి జన్మదినమును ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా ముఖ్యమైన జాతీయ పండుగలలో ‘ఉపాధ్యాయ దినోత్సవాన్ని’ గురుశిష్యుల మైత్రికి ప్రతీకగా పేర్కొనవచ్చు. ఎంతోమంది విద్యార్థులు తమ గురువులను ఈ సందర్భంగా గౌరవభావంతో మరియు ప్రేమాభిమానాలతో సన్మానించుకుంటుంటారు. మరీ ముఖ్యంగా పాఠశాలల్లో, కళాశాలల్లో మరియు విశ్వవిద్యాలయాలలో ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా విద్యార్థులంతా జరుపుకుంటారు. ఎందుకంటే విద్యార్థులను మంచిగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైనవారు ఉపాధ్యాయులు మాత్రమే. అట్టి ఉపాధ్యాయులను మరియు మనకు మేలుచేసిన వారిని అనునిత్యమూ స్మరించుకోవడం మన ప్రధాన కర్తవ్యం. దానిలో భాగంగా ఉపాధ్యాయ దినోత్సవంనాడు శిష్యులు తమతమ గురువులను సన్మానిస్తుంటారు. అలాగే వారినుండి ఆశీర్వచనాలు కూడా పెద్దయెత్తున పొందుతుంటారు.
‘గు’ శబ్దంధకారేస్యాత్/ ‘రు’ శబ్దంతి నిరోధకః
అంధకార నిరోధితః/ గురురీత్య బిదియతే!
అనే ఆర్యుల మాటలను పరికించి చూస్తే ‘అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానమనే కాంతులను వెలిగించే వారే నిజమైన గురువులుగా భావించవచ్చు’. అయితే నేడు గురువులుగా చలామణి అవుతున్నవారు ఎంతవరకు విద్యార్థులను సంస్కారవంతులుగా తయారుచేస్తున్నారు? ఎంతమంది గురువులు విద్యార్థులను సమాజ నిర్దేశకులుగా తయారుచేయగలుగుతున్నారు? అని ఒకసారి ఉపాధ్యాయులు యావన్మందీ తమకుతాముగా ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఎన్ని చదువులు చదివినా, ఎంత జ్ఞానాన్ని పొందినా, సంస్కారహీనుడైన విద్యార్థి సమాజంలో మన్నన పొందలేడు. సమాజశ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించే వారినే నిజమైన విద్యార్థిగా చెప్పుకోవాలి. అంటే సంస్కారం లేని విద్య వ్యర్థమన్నమాట. అనగా అనునిత్యమూ నీతివంతమైన జీవనానికి అలవాటుపడ్డ విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దగలగాలి. అందుకు ప్రాథమిక దశనుండే విద్యార్థులకు నైతిక విలువలను పెంపొందించే విధంగా ఉపాధ్యాయుల బోధన సాగాలి. ఏ విషయాన్ని బోధించినా, చివరకు సామాజిక స్పృహను విద్యార్థులలో పెంపొందించేటట్లు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యం ఉండాలి. ముఖ్యంగా గురువు విద్యార్థికి ఆదర్శవంతంగా, మార్గదర్శిగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే స్ఫూర్తిప్రదాత కావాలి కూడా. ఏ ఉపాధ్యాయుడైతే స్ఫూర్తిప్రదాతగా శిష్యుల మనసులలో నిలిచి ఉంటారో! అటువంటి గురువులను జీవితాంతం ఆయా విద్యార్థులు మరవకుండా ఉంటారు. ముఖ్యంగా ఉపాధ్యాయుని వేషం, భాష మరియు మాటతీరు అన్ని ఆదర్శవంతంగా ఉండాలి. ఎందుకంటే విద్యార్థులు ఉపాధ్యాయులను అనుసరిస్తారు మరియు అనుకరిస్తారు కాబట్టి. అటువంటి ఆదర్శ ఉపాధ్యాయులు మన భారతదేశంలో ఎంతోమంది చరిత్రలో ఉన్నారు. ఇంకా ఉపాధ్యాయుడు తను చెప్పేది ఆచరణలో చూపగలగాలి. అలా చూపే ఉపాధ్యాయుడిపై విద్యార్థులకు ఎనలేని గౌరవం ఉంటుంది. ఉదాహరణకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు ఒకానొక దశలో మైసూరు వదిలివెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆరోజున శిష్యులు యావన్మంది గుర్రాలు లేని ఒక బండిని తీసుకువచ్చి, దానిని ప్రత్యేకంగా పూలతో అలంకరించి, ఆ బండిని ఒక రథంలాగా తయారుచేశారు. ఎంతో వినయ విధేయతలతో గురువుగారిని ఆ బండిలో కూర్చుండబెట్టి, విద్యార్థులే స్వయంగా ఆ రథాన్ని రైల్వేస్టేషన్ వరకు లాగుతూ తీసుకువెళ్లారు. రాధాకృష్ణన్‌గారు చాలా కళాశాలల్లో మరియు విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుడుగా మరియు వైస్ ఛాన్సలర్‌గా పనిచేయడం జరిగింది. తనదగ్గర చదివే విద్యార్థుల మనసులలో ఉత్తమ గురువుగా చెరగని ముద్రవేశారని ఈ అపురూప సంఘటనను పరికించి చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు స్ఫూర్తిప్రదాతగా కూడా నిలిచారని పేర్కొనవచ్చు. అలాంటి గురువులను నేటివరకూ మరియు రాబోయే కాలంవరకూ, నిత్యమూ మనమందరమూ తప్పకుండా స్మరించుకుంటుంటాం. వేదములు ‘మాతృదేవోభవ’, ‘పితృదేవోభవ’, ‘ఆచార్య దేవోభవ’ అని చెబుతాయి. అంటే వేదము ‘ఆచార్య దేవోభవ’అని గురువుకు మూడవ స్థానాన్ని కట్టబెట్టింది. కానీ ఒక్కొక్క సమయంలో గురువే ప్రథముడిగా విద్యార్థులకు కనబడుతుంటాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రుల పాత్రలను కూడా గురువే పోషిస్తుంటారు. భారతదేశం అనేక కులాల కలయిక. అనేక మతాలతో విలసిల్లే దేశం మనది. అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో తులతూగే దేశం మనది. ‘్భన్నత్వంలో ఏకత్వం’ ప్రధాన లక్షణంగాగల మన దేశంలో అనేక మంది గురువులు అంతరాలకు అతీతంగా తమ విద్యార్థుల మదిలో ప్రముఖ స్థానాల్ని ఏర్పరచుకున్నారు. ఉదాహరణకు శ్రీరాముడు- విశ్వామిత్రుడు, శ్రీకృష్ణుడు- సాందీపుడు, వివేకానంద-రామకృష్ణ పరమహంస, శివాజీ-సమర్థ రామదాసు, గాంధీజీ-గోఖలే, రాధాకృష్ణన్- ప్రొఫెసర్ హాగ్, ప్రకాశం పంతులు- ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు మొదలగువారిని చెప్పుకోవచ్చు. సమాజంలో పాతుకుపోయిన ఈ దుర్గుణాలను నిర్మూలించే దిశగా ఎవరు ప్రయత్నం చేయాలి? సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఈ అనైతిక పరిస్థితిని ఎవరు రూపుమాపాలి? అనే ప్రశ్నలు వేసుకుంటే ఈ పరిస్థితిని ప్రక్షాళన చేసేది కేవలం ఉపాధ్యాయుడే అని చెప్పక తప్పదు. ఎందుకంటే జాతి నిర్మాణంలో తల్లిదండ్రుల తర్వాత కీలక పాత్ర పోషించేది గురువే. అంటే ఈ ప్రయత్నానికి మూలస్తంభం ఖచ్చితంగా గురువే అవుతాడు. ఈనాడు తోటి మనుషులతో మానవీయ సంబంధాలు తగ్గిపోతున్న తరుణంలో ఉపాధ్యాయులే ఈ పరిస్థితులను చక్కదిద్ది మానవీయ కోణాలను పిల్లల్లో ఆవిష్కరించేలా తమవంతు ప్రయత్నాలు చేయాలి. ఈ విధంగా ఉపాధ్యాయుడు తన విధుల నిర్వహణలో సరైన కార్యాచరణ చేపట్టినప్పుడు తప్పకుండా భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు పరిఢవిల్లుతాయని చెప్పవచ్చు. దీనినిబట్టి ‘భారత జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్రే కీలకమని’ చెప్పడంలో ఏమాత్రమూ అనుమానము లేదు.

- పిల్లా తిరుపతిరావు, 7095184846