Others

రాష్ట్రాల బాధల్ని తీర్చేదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రాల ప్రగతిశీలక ప్రగతికి ఆవిర్భవించిన నీతి అయోగ్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి అయిదున్నరేళ్లకు పైగానే అయింది. సంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే నీతి అయోగ్ ప్రధాన లక్ష్యమని పదే పదే ప్రధాని మోదీ 2022-23 నాటికి 288 లక్షల కోట్ల రూపాయలు స్థూల దేశీయోత్పత్తికి అనువైన వ్యూహపత్రాన్ని గత ఏడాది డిసెంబర్‌లో నీతిఅయోగ్ వెలువరించింది. అయితే జీడీపీ వృద్ధిరేటు, ఆర్థిక లోటు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతున్న తరుణంలో రాష్ట్రాల దన్నుతో దేశ ఆర్థిక పరిస్థితిని వృద్ధిలోకి తేవాల్సిన కార్యాచరణకు కేంద్ర ప్రభుత్వం కర్తవ్యం. పేదరికం, నిరుద్యోగం, కరువుకాటకాలు ప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యం, పెచ్చుపెరిగిపోతున్న అవినీతి ఉగ్రవాదం, హింసోన్మాదాల్ని ఉమ్మడి పోరాటం సాగించి 2022 నాటికి ‘నయా ఇండియా’ ఆవిర్భావమే అందరి లక్ష్యం కావాలని మోదీ ఆకాంక్ష. నీతి అయోగ్ బేటీలోనే రెండంకెల వృద్ధి సాధనే అందరి ముందున్న సవాలని స్పష్టీకరించారు.
దేశంలో బాగా వెనుకబడిన 115 ఆశావహ జిల్లాలలో మానవాభివృద్ధి ప్రామాణికులను గణనీయంగా ప్రగతిపథంలోకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో స్వచ్ఛ్భారత్, డిజిటల్ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కించడానికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వేసిన ఉప సంఘాలు విధాన రూపకల్పనకు దోహదం చేసినా, అంతటితో రాష్ట్రాల భాగస్వామ్యానికి ఒరిగిందేమీ లేక శ్రేష్ట్భారత్ లక్ష్యాలను మునుముందుకు తీసుకువెళ్ళక పోవడంతో లక్ష్యసాధనకు తీవ్ర విఘాతం కలిగింది.
గత పంచవర్ష ప్రణాళికల పేరిట రాష్ట్రాలకు జరిగిన వంచన కళ్లెదుట కనబడిన వైనాన్ని మేలుబాటలో పయనింపజేయడానికి నీతి అయోగ్ ద్వారా ఆయా రాష్ట్రాల ఈతిబాధలు గట్టెక్కుతాయని కొండంత ఆశలు పెట్టుకొన్న ముఖ్యమంత్రుల ఆశలు అడియాశలయ్యాయని సి.యం.లు హతాశులవుతున్నారు. ప్రకృతిపరమైన వర్షాభావం కరువుకాటకాలు, తుఫాన్ విలయతాండవాలు, సునామీలు, భూకంపాలు ఇత్యాదివి సంభవించినప్పుడు రాష్ట్రాలకు యుద్ధప్రాతిపదికన కేంద్ర సహాయం కోసం చేతులుచాచి అభ్యర్థులమీద అభ్యర్థనలు చేసుకొంటున్నా ఆశించిన ఫలితం రాబట్టలేక జాప్యాన్ని సహించలేక బాధితుల్ని ఆదుకోవడంలో రాష్ట్రాలు విలవిలలాడుతున్న దుస్థితి ముఖ్యమంత్రులకు కత్తిమీద సాములా మారింది. ఈ చేదు గతానికి భిన్నంగా ప్రగతి వ్యూహాల నిర్మాణంలో కార్యాచరణ క్రతువులో పాలుపంచుకొంటుందన్న నీతి అయోగ్ వ్యవహారశైలి రాష్ట్ర ముఖ్యమంత్రులకు మింగుడుపడక మూతిముడుచుకొంటున్నారు. దీక్ష, దక్షత, వనరులపరంగా ఎంత మాత్రం లోటులేదంటున్న ప్రధానమంత్రి భరోసాని జీర్ణించుకోలేక పోతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రాల వాటా సగటు 40 శాతానికి చేరడంతో, పరిమితంగాఉన్న ఆర్థిక వనరులపై తడిసిమోపెడవుతోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, సంక్షేమ పథకాల అమలు రాష్ట్రాలదే అయినప్పుడు వనరుల పంపిణీలో ఆర్థిక సమాఖ్య భావనకు చోటుపెట్టకుంటే ఆశించిన ప్రయోజనాలు ఎలా సమకూరుతాయి?
గత జనవరిలో ఆశావహ జిల్లాల్లో బ్లాకుల వారీగా కేంద్రం రూపొందించిన పథకాల్ని కేంద్ర బృందాలే పర్యవేక్షిస్తాయని నీతి అయోగ్ చెబుతోంది. ఒకవైపు ఒడిశా పార్లమెంటులో ఇచ్చిన వాగ్దానాలపై, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తికోసం గళమెత్తిన రాష్ట్ర ముఖ్యమంత్రుల సమస్యల పరిష్కారానికి సమగ్ర పరిష్కారం ఎప్పుడు జరుగుతుందో, జరగనున్నదో సంశయాల్ని తీర్చగలిగే దిశాదశ సమకూరుతుందో ఆర్థిక సంఘ నివేదికే అసలైన కీలకం.