Others

పోషకాహార లోపమే అసలైన అనారోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది అక్షరసత్యం. ఆరోగ్యవంతమైన ప్రజలు ఉన్నపుడే ఆరోగ్యవంతమైన సమాజం, రాష్ట్రం, దేశం ఉంటుంది. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. పోషకాహారం, ఆహారం ఈ రెండూ కవల పిల్లల వంటివి. శరీరం విధులు నిర్వహించేందుకు కావాల్సిన శక్తిని అందిస్తూ ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి, రోగాలతో పోరాడటానికి అవసరమైన శక్తిని అందించేదే నిజమైన పోషకాహారం. ఎదిగే వయసులో తగినంత పోషకాహారం లభించకపోతే ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది. పిల్లల్లో శరీర పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది కనుక వారి ఆహారం పట్ల ప్రదాన శ్రద్ధపెట్టాలి. పోషకాహార లోపంగల పిల్లలకు రెట్టింపు ఆహారం ఇవ్వాలి.
మన పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉన్నప్పుడే మన దేశం మంచి ఆరోగ్యకరమైన దేశంగా అభివృద్ధి చెందుతుంది. బడికి వెళ్ళే వయసుకంటే ముందున్న శైశవ దశలోనే పిల్లలు ఎక్కువగా పోషకాహార లోపం, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. వీరిలో పోషకాహార లేమి, అంటువ్యాధులను ఆకర్షిస్తాయి. పోషకాహార లోపం ఉన్నపుడు అంటురోగాల తీవ్రత ఎక్కువగా ఉంటాయి. పోషకాహర లోపం వల్ల పల్లెల్లో ఎక్కువగా డయేరియా, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. అంతేగాక పోషకాహార లోపంవల్ల రక్తహీనత, పొంగు, ఆటలమ్మ మొదలైన అంటువ్యాధుల బారిన పిల్లలు పడతారు. శరీరానికి కావాల్సిన పోషకాలు, పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు, విటమిన్లు, ఖనిజ లవణాలు- వీటితోపాటు శరీరానికి నీరు కూడా ఎంతో అవసరం. ఈ పోషకాలన్నింటిని సరైన పరిమాణంలో శరీరానికి అందించే ఆహారమే సమతుల ఆహారంలేక సంపూర్ణ ఆహారం. బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, నూనె మొదలగునవి శక్తినిచ్చే ఆహార పదార్థాలైతే, పప్పు్ధన్యాలు, సోయా చిక్కుడు, పాలు, మాంసం, గుడ్లు, మొదలగునవి పెరుగుదలకు తోడ్పడే ఆహార పదార్థాలు. ఆకుకూరలు, పండ్లు మొదలగునవి శరీర రక్షణకు తోడ్పడే ఆహార పదార్థాలు.
కానీ దేశంలో 80 శాతం మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణాలు అనేకం. ఈ సమస్య తీవ్రతను గుర్తించి భారత ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తోంది. ‘మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యానికి పునాది’- వాటిలో ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలన్నీ ఉండాలి. మనిషి మానసికంగా శారీరకంగా ఎదిగేందుకు ఎంతో ఉపకరిస్తాయి. ఈ రకమైన సమతుల ఆహారాన్ని తీసుకోలేని స్థితే పోషకాహార లోపానికి దారితీస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో పోషకాహార లోపం సమస్య ఉంది కానీ ఈ సమస్య తీవ్రత మన దేశంలో అధికంగా ఉంది. ఉండవలసిన బరువుకంటే తక్కువ బరువు వున్న పిల్లలు 40 శాతం ఇండియాలోనే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఏటా మన దేశంలో సగంవరకూ శిశు మరణాలు పౌష్టికాహార లోపంవల్లే సంభవిస్తున్నాయి. మహిళల్లో కూడా పౌష్టికాహార లోపం సమస్య తీవ్రంగా ఉండి, 56 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు సర్వేలు తలియజేశాయి. దీనికి కారణం పేదరికం, నిరక్షరాస్యత, ఎక్కువ వున్న కుటుంబాల పిల్లల్లో పౌష్టికాహారం లోపాలు ఎక్కువగా ఉన్నాయి. పౌష్టికాహార లోపాలను సరిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఐసిడిఎస్, గర్భిణీల, బాలల ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతున్నాయి. మన దేశంలో 1982 నుంచి పౌష్టికాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాము. ప్రజల్లో పౌష్టికాహారంపై అవగాహన తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రదర్శనలు ఏర్పాటుచేస్తారు. పోషకాహార లోపం కేవలం ఆరోగ్యపరమైన సమస్య మాత్రమే కాదు వ్యక్తి, కుటుంబం, సమాజంపైనా ఇది విస్తృత దుష్ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ లోపాలు అధికోత్పత్తిని దెబ్బతీసి పేదరికాన్ని పెంచుతుంది. ప్రతిరోజు సమతుల ఆహారం అందితేనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్లు. పోషకాహర లోపం లోపిస్తే ప్రజల జీవన ప్రమాణాలు క్షీణిస్తాయి. అందుకే ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్, ఆరోగ్య శాఖలు కీలకంగా కృషి చేస్తున్నారు. పోషకాహార లోపం ఉంటే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే వీలుంది. మాతా శిశు మరణాలు జరుగుతాయి. గర్భస్రావం జరిగే అవకాశం వుంది. నెలలు నిండకముందే ప్రసవించే అవకాశముంది. కడుపులో బిడ్డకు సరియైన పోషకాహారం అందకపోతే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వకపోవచ్చు. పుట్టిన పిల్లల్లో శారీరక, మానసిక వికాసం లోపించవచ్చు. తక్కువ బరువుతో జన్మించడం, ఎముకలు పలుచబడటం వంటివి ఉంటాయి. పిల్లల్లో వయసుకు తగ్గ ఎదుగుదల లోపం వస్తుంది. పుట్టినప్పటినుంచి 6 నెలల వరకు తల్లిపాలు సరిపోతాయి. ఆ తర్వాత తల్లిపాలతోపాటు అదనపు ఆహారం రోజుకు కొంచెం కొంచెం తినిపించాలి. పిల్లలకు ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, సెలినియం అవసరం. ఆకుకూరలు, కూరగాయలు, పొట్టుతో తృణధాన్యాలు, పండ్లు, బెల్లం, గుడ్లు, మాంసం, చేపల్లో ఉంటాయి. ఎదిగే సమయంలో సరైన ఆహారం అందకోతే బుద్ధిమాంధ్యం ఏర్పడుతుందని చిన్నపిల్లల వైద్యనిపుణులు సూచిస్తున్నారు. వయస్సుకు తగ్గ బరువు లేకుంటే భవిష్యత్తులో రక్తపోటు, మధుమేహం, హృద్రోగాల బారిన పడే ఆస్కారముం దని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు జంక్ ఫుడ్ నిరోధించి పౌష్ఠికాహారం అందించడం తల్లిదండ్రుల మొదటి బాధ్యత.
దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంలో సరైన పోషకాహారం కరువై రక్తహీనత వల్ల ఎన్నో అనర్థాలు దాపురించాయని ఇదివరకే కేంద్ర ఆరోగ్య పరిశోధన నివేదిక వెల్లడించింది. మొత్తం వ్యాధుల వ్యాప్తిలో అంటువ్యాధులు, ప్రసవసమయంలో అంటువ్యాధులు, రోజుల పసికందులకు వ్యాపించే వ్యాధులు మొదలైనవి 28 శాతం వరకు ఏయే కారణాలవల్ల వ్యాపిస్తున్నాయో వివరించింది. తెలుగు రాష్ట్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు అందించే ఆహారం లోపభూయిష్టంగా ఉందనీ, అంగన్‌వాడీ కేంద్రాలకు నాసికరకం గుడ్లు, బియ్యం సరఫర అవుతున్నాయని ఆపణలు ఉన్నాయి.
నేటి బాలలే రేపటి పౌరులు. అటువంటి పౌరులు ఉత్పాదక శక్తి కలిగి వుంటే వారిని మించిన పెట్టుబడి మరొకటి లేదు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవటమే గాక పర్యావరణ కాలుష్యం సరైన పారిశుద్ధ్యం లేకపోవడంవలన వచ్చే అంటువ్యాధులు కూడా ఒక కారణం అయి ఉండవచ్చు. భోజనానికి ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోకపవడం, శౌచాలయానికి వెళ్ళివచ్చిన ప్రతిసారీ చేతులు పరిశుభ్రంగా కడుక్కోకపోవడంతో అంటువ్యాధులు పెరిగిపోతున్నాయి.
మాతాశిశు మరణాలు తగ్గించడానికి అంగన్‌వాడి కేంద్రాలు జాతీయ పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా కృషిచేస్తున్నాయి. ప్రపంచంలో 40 లక్షలమంది శిశువుల్లో పుట్టిన 28 రోజుల్లో 30 లక్షలమంది వారం రోజుల్లో మృత్యువాత పడుతున్నారు. దేశంలో వెయ్యికి 39 మంది చనిపోతుండగా రాష్ట్రంలో 40 నవజాత శిశువులు మరణాలు జరుగుతున్నాయి. అందుకే అంగన్‌వాడీ కేంద్రాల్లో కంటిచూపు మందగించకుండా శిశువులకు విటమిన్ ఏ మాత్రలను ప్రతి ఆరు నెలలకొకసారి సరఫరా చేస్తున్నారు.
‘తిండి కలిగితే కండగలదోయ్, కండ కలవాడే మనిషోయ్’ అని ఒక కవి చెప్పినట్లు ఆరోగ్యానికి అవసరమైన సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. కేవలం రుచికోసం ఫాస్ట్ఫుడ్ సెంటర్ల వద్దకువెళ్లి రోగాలు కోరి తెచ్చుకోరాదు. అందుకే అంగన్‌వాడీలు 7 నెలల నుంచి 3 సం.ల చిన్నారులకు నెలకు 16 కోడిగ్రుడ్లు, రెండున్నర కిలోల బాలామృతాన్ని సరఫరా చేస్తున్నారు. 3 నుంచి 5 ఏళ్ళ పిల్లలకు అగన్‌వాడి కేంద్రాల్లో ప్రతిరోజూ కోడిగ్రుడ్డు, పోషకాహారం, 200 ఎంఎల్ పాలు ఇస్తున్నారు. అంగన్‌వాడీల్లో ఇస్తున్న పోషకాహారంతో పిల్లల్లో రక్తహీనత, ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయని భావిస్తున్నారు. ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం.

- కె.రామ్మోహన్‌రావు 9441435912