Others

కామితార్థములను తీర్చే కరివదనుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ. వె. అగ్రపూజలందియాయురారోగ్యాలు
భక్తజనులకొసగు శక్తిగణప
తయ్య! నిన్నుఁ గొలతుధరణీ ధరంబునుఁ
బోలు దైవ మీవు పూజనీయ!

తే.గీ. అణువణువునందు సారతులందువాడ!
శరణగోరెద నీ దివ్యచరణములను;
మహిత భక్తితోఁ గొలచిన మమ్ముగాంచి
బ్రోచువాడవు విఘ్నేశ! పూజనీయ!

తే.గీ. బొజ్జగణపతి! యుండ్రాళ్లు పుష్కలముగఁ
జక్కవండిన జిల్లేళ్లు సంతసాన
నీకు కొట్టెక్కబుట్టనేక మొసగి
వేడుకుందును మాఱేడువే గణేశ!

తే.గీ. సిద్ధి బుద్ధుల నొసగెడి శ్రీగణేశ!
విఘ్నములుగల్గకుండను వేగ వచ్చి
కావుదేవుడవీవె మాకండదండ
జగతి హారతులందుకో చవితినాడు!

కం. శ్రీకరుడవు శుభకరుడవు
శ్రీకంఠుని ముద్దుబిడ్డ! సిరిసంపదలన్
ఈకలియుగమున నొసగెద
వే! కరుణినుఁ జూపువాడవే!శివపుత్రా!

-కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం 9492457262