Others

మహారాష్ట్ర మహాదేవుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రమథగణాలకు అధిపతి అయన గణపతి కేవలం ఒక్క భారతదేశంలోనే కాక ప్రపంచంలో చాలా చోట్ల ఆరాధించ బడుతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, బర్మా, మంగోలియా, థాయిలాండ్, కాంబోడియా, ఇండోనేషియా, చైనా, జపాన్ దేశాల్లోకూడా విశేషమైన పూజలందు కొంటాడు. అమెరికాలో ప్రఖ్యాతి వహించిన డిస్నీలాండ్ ప్రవేశద్వారం వద్ద కొలువుదీరిన వినాయకుడిని కోటికోర్కెలను తీరుస్తాడని అక్కడికి వెళ్లిన మనవారు అక్కడివారితో కలసి నమస్కారాలు చేస్తారు. ఇక భారతదేశంలోని గ్రామ గ్రామానే కాదు వాడవాడల ఓ బొజ్జగణపయ్య చీమంత కన్నులతో చిన్మయలీలలను ఆవిష్కరిస్తుం టాడు. శూర్పకర్ణుడివి కదా మా విన్నపాలు వినవలె అంటూ భక్తులంతా ప్రతి క్షణమూఈ గణపతిని స్మరిస్తూ రోజువారి పనులకు వెళ్లుతుంటారు. ఆ గణపతే మహారాష్టల్రో విన్నూత్న రీతిలో దర్శనం ఇస్తున్నాడు.
శ్రీ మోరేశ్వర (మయూరేశ్వర) ఆలయం:
పుణే జిల్లాలోని మోరేగావ్‌లో ఉంది. పుణేకు 64 కిమీ దూరంలో పుణె-సవారా మార్గంలో ఉంది. ఉత్తరాభిముఖంగా ఈ ఆలయం ఇస్లామిక్ పద్ధతిలో ఉంటుంది. పక్కగా కరహానది ప్రవహిస్తుంటుంది. నిలబడి వున్న ఈ వినాయక విగ్రహం శిరస్సుపై పాము పడగ ఉంటుంది. విగ్రహం మొత్తం కుంకుమ పువ్వు రంగులో వుండి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఎదురుగా శిలాకృతిలో ఎలుక, నెమలి ఉంటాయి.
తేవూరు శ్రీ చింతామణి ఆలయం:
పుణెకు 22 కిలోమీటర్లలో లోనీకి 4 కిలోమీటర్లలోగణపతి ఆలయం ఉంది. ఒక్క గణపతి మూర్తి స్వయంభువు. తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. ఈ వినాయకుడు తూర్పువైపుకు చూస్తుంటాడు. ఇక్కడ అతివిశాలమైన మండపాలు న్నాయ.
మహాగణపతి ఆలయం:
పుణెకు 50కిమీ ఉర్లికి 13 కిమీ దూరంలో వుంటుంది. ఇక్కడి గణపతిని భోగమూర్తి అంటారు. ఈగణేశ స్వరూపం ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం సిద్ధిబుద్ధి సమేతంగా ఉన్న అసలు విగ్రహాన్ని భూగర్భంలో నేలమాళిగలో నిక్షిప్తం చేసారట. భూగర్భంలో ఉన్న వినాయకుడికి పది తొండాలు, ఇరవై హస్తాలు ఉన్నాయని చెబుతారు.
సిద్ధి వినాయకాలయం:
సిద్ధాటేక్‌లో వెలసిన సిద్ధి వినాయక క్షేత్రం డౌండ్‌కు 19 కిలోమీటర్లలో శ్రీగొండకు 47 కిమీదూరంలో ఉంటుంది. ఇది స్వయంభూమూర్తి. శిలా వితర్దిపై ఉంటుంది. తొండం ఎడమవైపుకు మళ్లి ఉంటుంది. మూడు విశాలమైన మండపాలు దీపాల బార్లు ఉంటాయి. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దిలో పునరుద్ధరించారు.
శ్రీ గిరిజాత్మకఆలయం:
పర్వతంమీద వున్న లేన్యాద్రిపై వెలసిన గిరిజాత్మక వినాయకుడిని దర్శించేందుకు కూకడ్ నది దాటాలి. నదినుంచి ఆలయానికి 283 చక్కని మెట్లు ఉన్నాయి. విగ్రహం వైకల్యంగా ఉంటుంది. హనుమంతుడు, శివుడు రెండువైపులా ఉంటారు ముఖం కనపడకుండా విగ్రహాన్ని ప్రతిష్టించినందువల్ల వెనుకవైపునుంచి భక్తులు ప్రార్ధనలు చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు. అందమైన శిల్పాకృతులు అసంఖ్యాకంగా మరో చిన్న ఆలయం పక్కనే ఉంది. గతంలో ఇది బౌద్ధగుహ అని కొందరంటారు.
బళ్లకేశ్వర ఆలయం:
కోసోలి-షీల మార్గంలో వున్న పాళి గ్రామంలో ఈ ఆలయం ఉంది. వినాయకుడు స్వయంభువుగా దర్శనం ఇస్తాడు. మూడడుగుల ఎత్తు న తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ముఖం విశాలంగా గుండ్రని ఆకారంలో ఉంటుంది. ఆలయ ముఖద్వారం తూర్పుకేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయానికి వెనుక డూంఢి వినాయకుడి ఆలయం ఉంది.
శ్రీ విఘ్న హరాలయం:
నారాయణగావ్‌కు ఎనిమిది కిలోమీటర్లలో వున్న కుకుడ్‌నది తీరాన ఉన్న ఓఝార్‌లో ఈ ఆలయం ఉంది. ఈ వినాయకుడి తొండం కుడివైపుకు వుండి రెండుకాళ్లు పెనవేసుకుని ఉంటాయి. ఆలయ ముఖద్వారం తూర్పుకేసి వుంటుంది. అతి విశాలమైన గర్భగుడి. ఆలయ గోపురానికి స్వర్ణ శిఖరముంటుంది.
శ్రీ వరద వినాయకాలయం:
కోపోలికి సమీపంలో వున్న మధ్ (మహద్)లో ఈ ఆలయం ఉంది. శిలావేదికపై ఆసీనుడైన వినాయక మూర్తిగా దర్శనం ఇక్కడ ఇస్తాడు. ఈ మూర్తికి ఇరువైపులా రెండు ఏనుగుల శిల్పాలున్నాయి. ప్రవేశద్వారం వద్ద సిద్ధి బుద్ధులు శిల్పాకృతులుంటాయి.
హరిహరుల అభేదాన్ని సూచించే వినాయకుణ్ణి జాతి మత కుల వివక్షత లేకుండా భాద్రపద శుక్ల చతుర్థినాడు పూజించడ మనేది జాతి సమైక్యతా భావాన్ని చాటడమే.

- చోడిశెట్టి శ్రీనివాసరావు