AADIVAVRAM - Others

కశ్మీర్ గాయానికి కాంగ్రెస్సే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఆగస్టు 15కు ముందు, ఆగస్టు 5వ తేదీ సోమవారం, రాజ్యసభలో, మన రాజ్యాంగంలో కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370, 35లు రద్దయ్యాయి. ఇదో పెద్ద చారిత్రిక విజయం.
మన రాజ్యాంగంలో ఆర్టికల్ 370 - 1952 నవంబర్ 17 నుంచి కొన్ని ప్రత్యేక షరతులతోనే, కాశ్మీర్‌లో అమలవుతుంది. ఇది మన రాజ్యాంగపు సంస్కరణ ద్వారా అమలులోకి వచ్చింది. పై తేదీ ఆ సవరణతోనే చెప్పబడింది.
అలా 1952 నుంచి ఉన్న విధానం 2019 ఆగస్టు 5వ తేదీతో, 67 సంవత్సరాల తరువాత రద్దయింది. రాజ్యాంగంలో వాడిన, టెంపరరీ అనే మాటకు అర్థం, ఈ విషయంలో 67 సంవత్సరాలు.
అయితే అదే చాలా ఘనకార్యం. ఈ చర్యను బలపరిచిన వారు - సాక్షాత్ కాంగ్రెస్ లీగల్ సెల్, ఆగస్టు 9 శుక్రవారం లీగల్ సెల్ (సుప్రీంకోర్టు యూనిట్) మిగిలిన దేశంతో, జమ్మూ కాశ్మీర్ విలీనాన్ని కేంద్రం తీసుకున్న చర్య సాకారం చేస్తుందని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరికి భిన్నంగా, ఈ నిర్ణయం తీసుకోబడింది. నాటి కాశ్మీర్ రాజు హరిసింగ్ కుమారుడు, కరణ్‌సింగ్ వ్యక్తీకరించిన అభిప్రాయాలను సమర్థిస్తున్నట్లు సెల్ ఛైర్మన్ అనూప్ జార్జి చౌధురి పేర్కొన్నారు. (10 ఆగస్టు పత్రిక వార్త)
ఆర్టికల్ రద్దు సరైనదే అని, కాంగ్రెస్ సీనియర్ నేత, హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ కూడా చెప్పారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నదని తెలిసినా, దేశభక్తి విషయంలో తగ్గే ప్రసక్తే లేదని కూడా చెప్పారు. (ఆగస్టు 19 ఇంకో పత్రిక వార్త)
ఆగస్టు 14న ఇంకో 2 వార్తలు ప్రక్కప్రక్కనే వచ్చాయి ఇంకో పత్రికలో.
ఇమాం మొహమ్మద్ తాహిదీ ఇస్లామిక్ పండితులు. ఆయన వ్యాఖ్య ఇది: ‘కాశ్మీర్ ఎప్పటికీ పాకిస్తాన్‌ది కాదు. ఆ మాటకొస్తే కాశ్మీర్, పాకిస్తాన్ రెండూ భారత్‌కు చెందినవే. ముస్లింలు అంతా కలిసి భారత్‌ను హిందుత్వం నుంచి, ఇస్లాంగా మార్చినప్పటికీ, భారత్ హిందూభూమి అన్న వాస్తవం మారిపోదు. ఇస్లాం కంటే, ఇండియాయే ప్రాచీనమైనది. ఈ విషయంలోనైనా, పాకిస్తాన్ నిజాయితీగా ఉండాలి.’
దీని ప్రక్కనే, మన వైకోగారి ప్రకటన వచ్చింది. వారు ఎం.డి.ఎం.కె. అధ్యక్షులు. అంటే మరుమలారిద్రవిడ మునే్నట్ర కజగం పార్టీ. వారి ఉద్ఘాటన ఇది ‘100వ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కాశ్మీర్ భారత్‌లో ఉండదు’ వాళ్లంతా కలిసి కాశ్మీర్‌ను బురదలో ముంచెత్తారు. ఈ విషయంలో, నా అభిప్రాయాన్ని ఇంతకు ముందే చెప్పాను. కాశ్మీర్ అంశంలో 30 శాతం తప్పుంటే, బిజెపిది 70 శాతం ఉంది..’ 100వ దినమంటే, 2047 ఆగస్టు 15 అన్నమాట. అంటే, ఇంకో 28 సంవత్సరాల తరువాతన్నమాట!... అంతకాలం తరువాత విషయం గురించి, నేనేమీ ఇప్పుడు ఊహించలేను, క్షమించండి.
ఇక పాకిస్తాన్ సంగతి.. ఈసారి వారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని, కాశ్మీర్ సంఘీభావ దినంగా జరిపారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. ‘్భరత నేతలు గుర్తుంచుకోవాలి, నే చెబుతున్నా. మీరు ఇటుకతో కొడితే, మేం రాయివేసి కొడతాం. మీరు విసిరే ప్రతి ఇటుకకూ గట్టిగా సమాధానమిస్తాం.’
తరువాత ఆర్.ఎస్.ఎస్. పై నిప్పులు చెరిగారు. ‘గతంలో నాజీల ఫిలాసఫీ లాంటిదే, ఆర్.ఎస్.ఎస్. సిద్ధాంతం. భారత్ నుంచి ముస్లిం జాతుల నిర్మూలన దాని ఉద్దేశం. ఆ ద్వేషం ఇప్పుడు పాకిస్తాన్‌కూ విస్తరించే ప్రమాదముంది. ఆర్.ఎస్.ఎస్.లో కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి మోదీ. ఆయన ఆ భావజాలానే్న పుణికిపుచ్చుకుని, అమలు చేస్తున్నారు’ అని ఇమ్రాన్ విరుచుకుపడ్డారు.
సెక్యులర్ భావనను తుడిచి పెడుతుందనీ, మీడియాను కట్టడి చేసిందనీ, జడ్జీలు భయపడుతున్నారనీ అన్నాడు. కాశ్మీరీల గొంతు నొక్కేస్తున్నారు. భారత్‌లో 30 కోట్ల ముస్లింల భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడింది అనీ అన్నారు. (15 ఆగస్టు పత్రికలు)
ఇక మనం.. ఆగస్టు 9న సిద్దిపేట సభలో, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిగారు, శివమ్స్ గార్డెన్‌లో జరిగిన ఎఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల్లో మాట్లాడుతూ - 370 ఆర్టికల్ రద్దుతో కాశ్మీరీల హక్కులు హరించారన్నారు.
ఆగస్టు 15ను బ్లాక్ డేగా పాటించాలి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌గారు, ఆర్టికల్ 370, 35ఎ ల రద్దు మోదీ కుట్రలో భాగమని, అవి పునరుద్ధరించే వరకు, మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం అన్నారు.
మనం ఏమందాం? ఏమనాలి?
చివరగా ఆగస్టు 14న ఒక పత్రికలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తాలూకు, డా.దొంతగాని వీరబాబుగారు ‘చరిత్రను సరిదిద్దిన బిజెపి’ అని ఒక పత్రికలో దీర్ఘవ్యాసం రాశారు.
కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నెహ్రూజీ మీద ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారనీ, అదెంత మాత్రం నిజం కాదనీ అన్నారు.
దానినీ పరిశీలిద్దాం...
బ్రిటీష్ వారు మనకు స్వాతంత్య్రం ప్రసాదిస్తూనే వేద కాలం నుంచీ అఖండంగా ఉన్న భారతాన్ని, రెండు ముక్కలు చేశారు. అది చాలక, ఈ ఇండియాలోని వందలకొద్దీ ఉన్న సంస్థానాలకు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగించారు.
దీనితో కొంతమంది సంస్థానాధీశులు తామూ సర్వ స్వతంత్రులమన్నారు. కానీ సర్దార్ పటేల్ చాకచక్యంతో, అవసరమైన చోట బలప్రయోగంతో నైజాం సంస్థానం - అవ్వన్నీ స్వతంత్ర భారత్‌లో లీనమయ్యాయి.
కానీ కాశ్మీర్‌ది ఒక ప్రత్యేక విశేషంగా తయారయింది. అప్పటి మహారాజు హరిసింగ్‌ను ఒప్పించేందుకు, ఆర్‌ఎస్‌ఎస్ రెండవ సర్ సంఘచాలక్ పూజ్య గురూజీగా పిలువబడే గోల్వాల్కర్ స్వయంగా వెళ్లి ప్రయత్నం చేయటం జరిగింది.
అప్పటికే, కాశ్మీర్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా వున్నాయి. 1930-31లో ముస్లిం కాన్ఫరెన్స్ స్థాపింపబడింది. అప్పుడే ఆలిఘర్ నుంచి ఎం.ఎస్‌సి పాసై వచ్చిన అబ్దుల్లా దానిలో చేరి, దాని అధ్యక్షుడయ్యాడు. అలా 1940 దాకా కొనసాగాడు. కానీ 1939లోనే, ఆ ముస్లిం కాన్ఫరెన్స్‌లో చీలికలేర్పడ్డాయి. అబ్దుల్లా 1946లోనే క్విట్ కాశ్మీర్ ఉద్యమం ప్రారంభించాడు.
కానీ 1947 అక్టోబర్‌లో, కాశ్మీర్‌లో పరిస్థితులు తారుమారయ్యాయి. పాకిస్తాన్ దాడితో విభ్రాంతుడైన మహారాజు, అక్టోబర్ 26న గవర్నర్ జనరల్ వౌంట్‌బాటన్ గారికో ఉత్తరం రాశాడు.
అప్పటికే, పండిట్ నెహ్రూజీతో, అబ్దుల్లా మంచి పరిచయం, స్నేహంతో ఉన్నారు.
హరిసింగ్, తన ఉత్తరంలో ‘నేను ఇప్పుడు ఇండియా సహాయాన్ని కోరుతున్నాను. కానీ ఇండియాలో చేరకుండా, మీరు సహాయాన్ని పంపకపోవచ్చు. అందుకని నేను ఇండియన్ యూనియన్‌లో చేరుతున్నాను. అంతేకాకుండా, షేక్ అబ్దుల్లాను, నా సంస్థాన వ్యవహారాలు చూచేందుకు, ఎమర్జెన్సీ ఆఫీసరుగా నియమిస్తున్నాను.7
ఇలా చట్టబద్ధంగా, కాశ్మీర్ భారత్‌లో లీనమైంది. మన సైన్యం, కాశ్మీర్ ఆక్రమణదారులను తిప్పికొట్టింది. ఇంకా- ప్రస్తుతం పాక్ అధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతానే్న, విముక్తం చేయాలా!
కానీ నెహ్రూజీ ధోరణిలో పెనుమార్పులు వచ్చాయి. ఎందుకో ఎవ్వరూ ఈనాటికీ వివరించలేదు, వివరించలేరు కూడా!
మన సైన్యానికి తిరుగు లేదు. ఈ భాగాన్ని విముక్తి చేసిన తరువాత ఈనాడు పిఓకే (పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్) అని పిలువబడే ప్రాంతాన్నీ మన సైన్యం విముక్తి చేసేదే!
కానీ అత్యాశ్చర్యకరంగా పండిట్‌జీ ఐక్యరాజ్య సమితికి వెళ్లారు.
అప్పటికి మనకో మంత్రి మండలి, వందల సంస్థానాలను విలీనం చేసిన సర్దార్ పటేల్ ఉన్నారు. మన సైన్యమూ ‘మాకింకా చేతకాదు, వారే చూడండీ’ అని అనలా.. మరెందుకు వెళ్లినట్లు?
ప్రపంచంలోని ఏ ఇతర దేశమూ, మీరు తప్పు చేస్తున్నారు అని భారత్‌ను అడగలా!.. నెహ్రూజీ, తన మంత్రిమండలిని గానీ, మన సైన్యాన్ని గానీ సంప్రదించినట్లు ఏ ఆధారాలూ లేవు!
ఫలితం.. ఐక్యరాజ్యసమితి తక్షణ చర్యలు ఆపేయాలని ఆదేశం, దానితో మన సైనిక చర్యలు ఆపక తప్పలా.. ఫలితం, కాశ్మీర్‌ను పూర్తిగా విపక్ష దాడుల నుంచి విముక్తి చేయలేకపోయాం.
దానితో, ఖండిత భారతం వలెనే, స్వతంత్ర భారతదేశంలో క్రమబద్ధంగా విలీనమైన కాశ్మీరం కూడా, ఖండితంగానే మిగిలింది.
దీనికి పూర్తి బాధ్యత పండిట్‌జీదే కాదా? ఫలితం కోట్లాది ధన వ్యయం, అనేక సైనికుల ఆహుతి, సాగుతున్న అనిశ్చిత స్థితి దీనికి కాంగ్రెస్, ఈనాటికీ ఏదైనా సమాధానం ఇవ్వగలుగుతుందా?
దీనికి నాటి నేటి కాంగ్రెస్ నాయకులెవరైనా సమాధానం చెప్పగలరా?.. దానికి తోడు ఆర్టికల్ 370.
మన అదృష్టవశాత్తూ అదీనాడు రద్దయింది. కాశ్మీర్ భారతంలో పూర్తిగా లీనమయింది. భారతదేశంలోని చట్టాలే, కాశ్మీర్‌లోనూ అమలవుతాయి.
1990లో కాశ్మీర్ పరిస్థితి ఏమిటి?
ఏప్రిల్ 1990లో, కాశ్మీర్ గవర్నర్ జగ్‌మోహన్, రాజీవ్‌గాంధీ గారికో ఉత్తరం రాశారు. అది 3 భాగాలుగా ఆగస్టు 17,18,19 తేదీలలో ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో ప్రచురించబడింది. దానిని చదివితే, ఇంకో 2 వ్యాసాలు వ్రాయాలనిపిస్తుంది. అనేకానేక ఉదాహరణలిస్తూ ఆయన ళ్యశూళఒఒ జూజఒఔ్ఘక ఆ్యఆ్ఘ ౄళశఆ్ఘ ఒఖశూళశజూళూ అన్నాఢు. అంటే, ‘కాంగ్రెస్ పూర్తిగా మానసికంగా లొంగిపోయింది’ అన్నాడు. ఒక గవర్నర్‌గారు ఈ విధంగా అంటే ఏం చెప్పాలి, ఏమనాలి?
మనకు కాశ్మీర్ అంటే, దాని విభజన అంటే, నెహ్రూగారి విధానాన్ని ముట్టుకోకూడదు అనే భావనే.. ఇప్పుడేమీ చేయలేం, కారణం అప్పుడు ఏదో కొండజాతులు వగైరాలు దాడి చేశాయి, ఖాళీ చేయించాం. కానీ పాక్ ఆక్రమిత భాగాన్ని, ఖాళీ చేయించకుండా, మన సైన్యం చేయించగలిగి ఉన్న దశలో మనం ఐక్యరాజ్యసమితికి పరుగెత్తాం.
నెహ్రూజీకి చెప్పగలిగిన వారెవ్వరూ లేరు, వారికి తిరుగులేదు. అదే మన గతి.
పైగా, మన ఉత్తమకుమార్ రెడ్డిగారు, మొన్న స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే దేశానికి స్వాతంత్య్రమొచ్చిందనీ, నెహ్రూగారిని కించపరుస్తూ మాట్లడుతున్నారని, బిజెపి చరిత్రను వక్రీకరించిందన్నారు. వాస్తవాలు పవిత్రమైనవి, మన వ్యాఖ్య మనిష్టం.
నేనిచ్చిన వాస్తవాలలో పండిట్‌జీ కాశ్మీర్ ధోరణిని మీరే నిర్ణయానికి రండి.

-చాణక్య