Others

దుర్గ గుడి.. వివాదాల సుడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ...! ఆ మాట తలస్తేనే భక్తకోటి పారవశ్యానికి అవధులుండవు. కృష్ణాతీరాన కొలువైన ఆ తల్లి దర్శనానికి, అనుగ్రహానికి అర్రులు చాస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే తీర్థస్థలి... ఇంద్రకీలాద్రి ఇటీవల తరచూ వివాదాలకు ఆలవాలవౌతోంది. వరుసబెట్టి కుంభకోణాలు, అక్రమాలు వెలుగుచూడటం, కార్యనిర్వహణాధికారులు (ఈవోలు) మారిపోతుండటం ఆ కనకదుర్గగుడి ప్రతిష్టను మసకబారుస్తోంది. ఎటొచ్చి గత మూడేళ్లలో ముచ్చటగా ముగ్గురు ఈవోలు మారడం భక్తజనావళిలో అంతులేని చర్చను రేకెత్తించింది. గత ప్రభుత్వ హయాంలో పాలక మండలి ఏర్పాటైనా పట్టుమని సాఫీగా ఆలయ నిర్వహణ సాగకపోవడంతో ప్రతి ఒక్కరూ విమర్శలు గుప్పించటానికి ఆస్కారమేర్పడింది.
తాజాగా ఆలయ ఈవో మార్పిడి మరోమారు చర్చలకు వేదికైంది. రాష్ట్రంలో దివ్యక్షేత్రమైన తిరుపతి తర్వాత ప్రముఖ పుణ్యస్థలమైన కనకదుర్గ గుడి ఇటీవల కాలంలో అందరినోట నానుతోంది. నానాటికీ మారుతున్న కాలంలో భక్త్భివం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఇక్కడ ఏం జరుగుతోంది? భక్తులకు దివ్యదర్శనం మొదలుకుని సకల సౌకర్యాలు లభిస్తున్నాయా? ఇత్యాది ప్రశ్నలు.. దొరకని సమాధానాలు ఎదురవుతున్నాయి. తొలుత గత ప్రభుత్వం ఈ ఆలయ ప్రాముఖ్యతను గుర్తెరిగి, ఏరికోరి మహిళా అధికారిణి సూర్యకుమారిని నియమించింది. దాంతోపాటు ఆలస్యమైనా పాలక మండలిని ఏర్పాటుచేసింది. దరిమిలా ఆలయ నిర్వహణలో రోజూ రగడే చోటుచేసుకుంది. ఈవో, పాలక మండలి కుమ్ములాటలు, ఆధిపత్య ధోరణులు ఆలయ ప్రతిష్టను దిగజార్చిన సంగతి భక్తజనులకెరుకే. అగ్నికి ఆజ్యంపోసినట్లుగా ఆలయ ప్రాంగణంలో తాంత్రిక పూజలు జరిగినట్లు, అపచారం కలిగినట్లు వేనోళ్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆ మహిళా ఉన్నతాధికారిని ప్రభుత్వం సాగనంపింది. ఆ పిమ్మట మళ్లీ మరో మహిళ పద్మను ఈవోగా నియమించింది. అదీ ముందుకు సాగలేదు. ఆమె కూడా నిష్క్రమించాల్సిన దుస్థితి ఎదురైంది. ముఖ్యంగా మహిళలు అయితేనే ఆలయ బాగోగులు పట్టించుకుంటారని, భక్తజనం ఇక్కడ సౌకర్యాల పట్ల సంతృప్తి పొందుతారని భావించి మహిళలే ఈవోలుగా ఉంటే మంచిదని తలపోసి ప్రభుత్వం ఆ ప్రక్రియనే కొనసాగించింది. విచిత్రంగా ఆలయ నిర్వహణపై ప్రతికూల పరిణామాలు సంభవించాయి. కారణం ఎవరు? ఈవోలా? ఉద్యోగులా? ప్రభుత్వమా? ఇలా లెక్కలేనన్ని ప్రశ్నలు ఉద్భవించాయి. నిజం చెప్పుకోవాలంటే రాష్ట్రంలో పేరొందిన ఏ ఆలయంలోనూ ఇంతమంది అతి తక్కువ కాలంలో ఈవోలు మారి ఉండరేమోనని జనం అభిప్రాయపడుతున్నారు. ముగ్గురు మహిళా ఈవోలు... ముచ్చటగా మూడేళ్లలో మారిపోయారు. ఆలయ అభివృద్ధి, పురోగతి కన్నా ఈ అధికార మార్పిడితోనే పుణ్యకాలం గడిచిపోతోంది. వీటన్నిటికి మూలం ఏమిటి? ఎవరు బాధ్యులు? ఇదీ ఎడతెగని సందేహం. రాజకీయ వత్తిడులు, ప్రధానంగా పెత్తనాలు, బేషజాలు కారణభూతులని సాధారణ భక్తులే చర్చించుకోవడం గమనార్హం.
ఆలయంలో కార్యనిర్వహణ కత్తిమీద సాము అవుతోందని, రానురాను ఇక్కడ పనిచేయడానికి ఏ ఈవో కూడా సాహసించరేమోనని కూడా అధికార వర్గాల్లో బలంగా వినపడుతోంది. మరోపక్క ఈవోలుగా వస్తున్న/ వచ్చినవారి చర్యలే కారణమంటూ ప్రతి విమర్శలూ వస్తున్నాయి. దుర్గమ్మ సన్నిధిలో వ్యవహారాలను పరిశీలిస్తే.. కాస్త ఆటవిడుపు దొరగ్గానే ఏదోక అలజడి. మరి భక్తుల సంగతి ఆలోచించేదెప్పుడు! గత మూడేళ్లలో చీరల కుంభకోణం, క్షుద్ర పూజలు, నిర్మాణాలు.. ఇలా ఏదొక అపశ్రుతుల సమాహారమై నిలిచింది. అన్ని ఆలయాల్లో దైవానుగ్రహానికి అనుగుణంగా సేవలు, కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరి ఇంద్రకీలాద్రిలో సరికొత్త సేవలు, సౌకర్యాలపై దృష్టి మరలే పరిస్థితుల్లేవా? అనేది భక్తుల సంశయంగా మిగిలింది.
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి తర్వాత బెజవాడ దుర్గగుడి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఇక్కడ జన సందోహానికి కొదవలేదు. ప్రస్తుత పండుగల సీజన్లో చెప్పనక్కర్లేదు. మన ముంగిట్లోఉన్న దసరా పండుగకు జనం కిలోమీటర్లకొద్దీ వేచి ఉంటారు. అమ్మదర్శనానికి తహతహలాడతారు. ప్రతి దసరా... దివ్యంగా సాగాలని భక్తులు ఆశిస్తారు. ఎటొచ్చి ఇక్కడ... నాలుగు దసరాలు ఒకే ఈవో సారధ్యంలో జరిగిన దాఖలాలు ఇటీవల కనుమరుగయ్యాయి. ఆలయ నిర్వహణ అపశ్రుతులే భక్తుల మనోభావాలను కుంగదీస్తున్నాయి.
తాజాగా దుర్గగుడి ఈవోగా ఉన్న ఓ మహిళా అధికారిణి కోటేశ్వరమ్మ మార్పిడిపై సరికొత్త చర్చ నడుస్తోంది. 2018 ఆగస్టులో ఆలయ పాలనా పగ్గాలు చేపట్టిన ఈమె స్థానంలో సరిగ్గా ఏడాదికి మరో అధికారి సురేష్‌బాబును నియమించారు. ఈమె మార్పిడి పూర్వరంగంపైనే ఆసక్తికర అంశాలు తెరమీదకొచ్చాయి. జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న గుడిని అభివృద్ధిచేసి 50 కోట్ల రూపాయల డిపాజిట్లు బ్యాంకుల్లో వేసినట్లు కోటేశ్వరమ్మ పేర్కొంటున్నారు. అంతకుముందు 2017లో ఈవోగా ఉన్న సూర్యకుమారి రూ.16 కోట్లతో దసరా ఉత్సవాలను నిర్వహిస్తే, తాను (తాజా మాజీ అధికారిణి కోటేశ్వరమ్మ) కేవలం రూ.6.5 కోట్లతో గత ఏడాది (2018) దసరా సంబరాన్ని నిర్వహించినట్లు చెబుతున్నారు. ఖర్చులు గణనీయంగా తగ్గించి, గుడి ఆదాయాన్ని విపరీతంగా పెంచి డిపాజిట్లు చేయగలిగే స్థితికి తెచ్చారని కొందరు అంటున్నారు. అయితే స్థానిక రాజకీయ ఒత్తిడులు ఆమెపై పనిచేసి, ఆమెను బదిలీ చేయించారనే వాదనలున్నాయి. రాబోయే దసరా ఉత్సవాల్లో రాజకీయ వత్తిడుల ద్వారా కాంట్రాక్టులు వగైరా తమవారికి ఇప్పించుకునేందుకే ఈ బదిలీ జరిగిందంటూ వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. అవినీతి, అక్రమాలను అరికట్టేందుకు సాహసోపేతమైన నిర్ణయాలతో ఎటువంటి అధికార దర్పానికి లొంగకుండా పనిచేస్తున్న ఈవోను ఇప్పుడు బదిలీచేశారని పలు వార్తా కథనాలు వెలుగుచూశాయి. ఆలయ ఇంజనీరింగ్ విభాగంలో నెలకొన్న అవినీతిని కోటేశ్వరమ్మ ప్రక్షాళన చేశారని కూడా వినవస్తోంది.
దిద్దుబాటు చర్యల కోణాన్ని పరిశీలిస్తే... ఎన్నో అభ్యంతరకర అంశాలను క్రోడీకరించి ఆలయ సక్రమ నిర్వహణకు ప్రభుత్వం ఉపక్రమించాల్సి ఉందనేది ఎక్కువ శాతం భక్తులు అభిప్రాయపడుతున్నారు. గుడి గురించి క్షుణ్ణంగా అధ్యయనం జరపాల్సి ఉంది. ఈ నిర్వహణా రాద్ధాంతంపై ఇకనైనా శాశ్వత, పకడ్బందీ చర్యలు ఉండాలి. ఒక ప్రత్యేక కమిటీ లేదా సంస్థ లేదా బృందం ఆధ్వర్యంలో అధ్యయనం చేపడితే దిద్దుబాటుకు మార్గమేర్పడుతుంది. ఆలయ నిర్వహణలో భాగస్వామ్యమున్న వారందరికీ లక్ష్మణరేఖను ఉదహరించాల్సి ఉంది. ప్రతివారు చేయదగినవి/ చేయకూడనివీ కచ్చితంగా నిర్వహించాలి. పరిధులపై స్పష్టీకరించాలి. విద్యుక్త్ధర్మంలో సూచికలుండాలి.

- చెన్నుపాటి రామారావు 9959021483