Others

యువతలో నవతరంగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువతరం మారిపోయిందోచ్
నిజమే మాట్లాడుతున్నాను. కొన్నాళ్లక్రితం చదువుకునేది ఉద్యోగం సంపాదించడానికే అన్నట్లు ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి అది అందగానే ఇంకేం కావాలి అని నిశ్చింతా రోజులు గడిపేసేవారు.
కానీ కాలం ఇపుడు అట్లా లేదు. ఈరోజు ఉన్న ఉద్యోగం రేపు ఉంటుదన్న గ్యారెంటీ లేదు.
అందుకే కాలానికి తగ్గట్టుగా యువతరం ఆలోచన్నూ మార్చుకుని ముందుకు పోతున్నారు. అవేస్టార్ట్‌ప్ కంపెనీలు.
చదువుకునే రోజుల్లోనే ఎవరి కిష్టమైన అంశాల్లో ఏదైనా వ్యాపారగుణముందా అని ఆలోచించే నైజం అలవడుతోంది.
దాదాపుగా అమ్మాయిలందరికీ పూలంటే చాలా ఇష్టం. అందమైన వస్తువులంటే మరింత ఇష్టం అనేవారే. ఇలాంటి పూలు కూడా వ్యాపారాత్మక కళను కలిగి ఉన్నాయి. అంటే కేవలం పూలను అమ్మడమా అనుకోకండి. పూలను అందమైన పూలగుత్తులుగా మార్చి బహూకరించడం, లేదా పూలతోనే రకరకాల థీమ్స్‌ను తయారు చేసి వాటిని అవసరమైన వారికి అందివ్వడమూ ఒక వ్యాపారమే. అంతేకాదు ఎండి పోయిన పూలు, వేర్లు, కాడలు, తీగలు, ఇలా ఏదైనా వాడిపారేసిన వాటిని ఉపయోగిస్తూ అందమైన వస్తువులుగా చేసి వాటిని బర్త్‌డే పార్టీలకు, మ్యారేజ్‌ఫంక్షన్స్‌కు బహుమానాలుగా అందచేసేవారున్నారు. ఈ పూలమొక్కలను పెంచడం వాటిల్లో ఒకటి రెండు పూల మొక్కలను అంటుగట్టి కొత్త రంగులతో కొత్త పూలను పూయించడం కూడా ఒక కళ. ఈ కళనే వ్యాపారంగా మార్చుకోవాలన్న మాట. మరికొందరు పండ్లను, కాయలతోటి అందమైన వస్తువులను తయారుచేసి అమ్మకానికి ఇస్తున్నారు.వాటిని మార్కటైజ్ చేసి లాభాలను పొందుతున్నారు. కొందరు చిరుధాన్యాలను పండించడం, వాటిని రకరకాల ఆహారవస్తువులుగా తయారు చేసి అమ్మడం లాంటివీ చేస్తున్నారు. అంతెందుకండీ కాఫీనురగతోను అందమైన బొమ్మలను చిత్రించి లాభాలను గడిస్తున్నారు గడుగ్గాయలు..
అందుకే అన్నారు
కాదేదీ అనర్హం వ్యాపారానికి
మనకిష్టమైన వస్తువులే వాటిని అందరికీ ఉపయోగపడేలా మనకు లాభం వచ్చేలా తయారు చేసే ఆలోచనలే నేటి వ్యాపారానికి పెట్టుబడి అవుతుందోన్నమాట.
మరికేమి మీ మదిలో నిద్రపోతున్న ఆలోచన్లను తట్టి లేపండి. వ్యాపారసూత్రాలను జోడించి మీరే పారిశ్రామిక వేత్తలవ్వండి...

-వాణిప్రభ