Others

జగజ్జేత స్వర్ణ ‘సింధూ’రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింధు అందుకో శుభాకాంక్షలు
నీ విజయాలు మా ఆకాంక్షలు
నీ చేతిలో తెలుగు వెలుగుల రాకెట్
లక్ష్య చేధనలో గురితప్పని బుల్లెట్
సింధు ఇండియన్ మాగ్నైట్
తన బ్యాట్ విన్యాసానికి ప్రత్యర్థి ఔట్
ఆడితే సింధు పతకం మనదే నో డౌట్
ఎనే్నళ్లకు వీనుల విందు
ఎనె్ననే్నళ్లకు కనులకు పసందు
జగజ్జేత స్వర్ణ ‘సింధూ’రం
క్రీడా మైదానంలో సింహకిశోరం
పసిడి పతకాల వేటలో చిరుత
తెలుగు తేజమని గర్విస్తున్నది చరిత
నిలిచావు విజయపథాన
నిలిపావు దేశఖ్యాతిని అగ్రపీఠాన
నీ అనన్య సామాన్య ప్రతిభాపాటవాలు
గర్వంగా ఎగిరాయి జాతి విజయ బావుటాలు
భరతమాత మురుస్తున్నది
ముద్దుబిడ్డను అక్కున చేర్చుకుని
అక్షయ కీర్తి పతాకలను గెలుచుకుంటూ
అజేయంగా సాగాలని దీవిస్తున్నది
ఆసేతు హిమాచలాన నీ జయకేతనం
భారతీయుల కలల సాకారం
నీ ఘన విజయాలు త్రివర్ణపతాకాల కాంతులు
నీ పోరాట పటిమ అద్భుతం
యువక్రీడాకారులందరికీ స్ఫూర్తిదాయకం

ఇవటూరి మణికుమారి 9603234431