Others

చెప్పుడు మాటలతో చేటు తప్పదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్త, కోడలు ఇంటింటా తప్పకుండా వుంటారు. నేటి టీవీ సీరియల్స్‌లో అత్తకోడలు మధ్య అనేక మనస్పర్థలు ఏర్పడినట్లు చూపిస్తారు. కొన్నింటిలో విలన్ అత్త, హీరోయిన్ కోడలు అని చిత్రిస్తారు. ఏది ఏమైనా అత్తాకోడలు అనుబంధం ఈనాటిది కాదు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం తెలుగింటి కోడలు కళకళలాడుతూ వుండాలి. అత్తగారు కూడా ఒక తల్లి మాదిరిగా సంస్కారవంతంగా ప్రవర్తిస్తే అసలు సమస్యే వుండదు. కీచులాటలు, తగవులు వారికి సరికావని గ్రహించాలి.
‘అత్తా ఒకింటి కోడలే’ అన్న విషయం మరువరాదు. నేటి సామాజిక పరిస్థితుల్లో అత్త కోడలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు కాబట్టి అత్తాకోడలు తమ తమ స్థితిగతులను బట్టి నడుచుకుంటేనే మంచిది. కోడలు ఉత్తమ ఇల్లాలుగా భర్తకు సేవలందించాలి. అత్త తన వంతు కర్తవ్యం తాను నెరవేర్చాలి. తాను ఒక తల్లిలాంటిదని ఆమె గ్రహించాలి. అత్తాకోడలు అనుబంధం పదికాలాలపాటు కళకళలాడుతూ వుండాలంటే అత్తాకోడలు పరస్పర సహకారంతో మసలుకోవాలి. అలాగాకుండా అత్త ఒక విలన్‌లా ప్రవర్తించరాదు. కోడల్ని తన కన్నకూతురిలా చూసుకున్ననాడు కోడలు కూడా ఆమెను ఒకతల్లిగా ఆదరిస్తుంది. అంతేగాని చీదరించుకునేలా ప్రవర్తించరాదు. అన్నీ పనులుకోడలికే చెప్పి తాను ఖాళీగా కూర్చోవటం బాగుండదు. తనకు చేతనైన పని తాను చేస్తూ మిగతా పనులు కోడలికి చెప్పాలి. ఒకరినొకరు చేదోడు వాదోడుగా వున్ననాడు అత్తాకోడలి మధ్య అసలు తగవులే వుండవు. వారిరువురిమధ్య చక్కని అవగాహన ఉంటే అనుబంధం వెల్లివిరుస్తుంది. వారిమధ్య అన్యోన్యత పెంపొందగలదు. ముఖ్యంగా అత్తాకోడలు చెప్పుడు మాటలు, అమ్మలక్కల మాటలు వినకూడదు. మంచిని స్వీకరించాలి. చెడు పలుకులకు దూరంగా వుండాలి. వాళ్లు అలాంటివారు, వీళ్లు అలాంటివారు అన్న కాక మ్మ కబుర్లకు దూరంగా వుంటే మంచిది.
కుటుంబ కలహాలకు చాలావరకూ దూరంగా వుండాలి. అత్తా ఒకింటి కోడలే అన్న పదం నిజం చేయాలి. ఒకరినొకరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలిగితే అసలు అత్తా కోడలు మధ్య విభేదాలే వుండవు. చాలా కుటుంబాలలో అత్తాకోడలు తగాదా అని వింటుంటాం. అవి ఎందుకొస్తాయి అన్నది ఆలోచిస్తే సమస్య వుండదు. తన కొడుకు కొత్త పెళ్లాం తెచ్చుకున్నాడు కదా అని మురిసిపోక ఆమెను అపురూపంగా చూసుకోవాలి. ఆప్యాయత, ఆదరణ, ఆడదానికి అవసరం అత్త ఒక తల్లిగా కోడల్ని ఆదరిస్తే చాలు, ఆ సంసారం నందనవనం కాగలదు. కోడలు సైతం అత్తగారిని తల్లిగా గౌరవించాలి. సంస్కారంగా వుండాలి. తెలుగింటి అనుబంధం చవిచూపగలగాలి. అందరికీ ఆదర్శంగా వుండాలి. పక్కింటి పుల్లమ్మ, ఎదురింటి నల్లమ్మలతో ప నేంటి? ఒకరినొకరు ప్రే మ పూర్వకంగా వుంటే అత్తాకోడలి అనుబంధం సంసార సౌభాగ్యానికి నవోదయం కాగలదు. వారిరువురూ నేటి తరానికి ఆదర్శంగా నిలవాలి. ఆనాడే ఆనందపు సంసారానికి శుభోదయం.

-చంద్ర