Others

చుక్కల్లో కలిసిపోయావా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బతుకంటే అష్టకష్టాలని
చిరునవ్వుతో దాటమంటూ ఎందరికో చెప్పి
నువ్వు మాత్రం
అదే కష్టానికి బలైయ్యావా అమ్మా

మొజాయిక్ ముంగిట ఎన్ని సాహితీ
సౌరభాలను పరిమళించి ప్రకాశింపజేసి నువ్వుమాత్రం
ఆకాశంలో తారవయ్యావు

అనువాదమైనా
స్వీయరచనయైన, వైయుక్తికమైన
సమాజకరమైన
అక్షరాన్ని ప్రాణంగా ప్రేమించి
మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోయావ్

గెలుపు కోసం పోరాటం చేయమంటూ
నువ్వు మాత్రం ఓటమి ముంగిట దోషిగా నిలబడి
తలదించుకుని వౌనం అయ్యావా

ఎందరికో అమ్మలా, అక్కలా, చెల్లిలా
అక్షర బంధాలతో పెనవేసుకొని చివరికి
కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోతావా..

చుక్కల లోకంలో అమ్మ లోటు తెలిసిందేమో
ఆకాశంలో చుక్కవై నింగికెగసేవు
మాపైగల నీ ప్రేమ గురించి
ఎన్ని కావ్యాలు రాసినా తరగదు

సాహితిలోకంలో పిల్లలం మేము
చేయి పట్టుకు నడిపించే అమ్మ కోసం గుక్క పట్టి
ఏడుస్తున్నాం
అమ్మా జగతి ఒక్కసారి అయినా
కనిపించిపో..

జగతిలో జగద్ధాత్రిగా మిగిలిపోయిన
ఒక అమ్మ కధగా చెప్పుకుంటాం!
( ప్రముఖ కవయిత్రి జగద్ధాత్రికి నివాళిగా)

-పుష్యమి సాగర్ 90103 50317