Others

భారత హృదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పెన కెరటమై
కాశ్మీర్ శిఖరాలని తాకింది
కుంకుమ పువ్వు పరాగాన్ని
రక్తనాళాల్లో నింపుకుంది
యాపిల్ ఫల తోటలని
గుత్తులు గుత్తులుగా
రసాంకురాలకి అందించింది
పతాకాలకి ధవళ హిమకాంతుల్ని ప్రసాదించింది

టొమాటోలని పిసికేసినట్లు
మామిడి రసాలని పీల్చేసినట్లు
దండయాత్రలతో చివికిపోయంది
సరిహద్దు శిశువుగా, స్తన్యమందని శిశువుగా
అజ్ఞాత ఆవేదనల రోదనలతో అల్లాడిపోయంది
తన పేరు మరచిపోయ
తన దేశంలో తానే పరాయగా
పచార్లు చేస్తూ గడిపింది
మనుష్యులకి, మొక్కజొన్నలకి
తేడా లేకుండా కాల్చుకుతినే
నిత్య రక్తకేళీ క్రీడలో మునిగితేలింది!
తన సింహాసనం మెట్లు
తానే ఎక్కలేని దీన వదనై చిన్నబోయంది
మూగబోయన సరస్వతియై, శారదయై
సంస్కార సంస్కృత సంస్కృతినీ
తాత్విక జ్ఞాన సంపదనీ, ధర్మనిధినీ,
దయానిధినీ కోల్పోయంది!

భారత హృదయం
నత్తగుల్లలా ముడుచుకుపోలేదు
సర్దార్ పటేల్ విగ్రహంలా
నభోమండలాన్ని నిటారుగా తాకుతుంది
జననీ జన్మభూమిశ్చ, స్వర్గాదపీ గరీయసీ అని
జగానికి సగర్వంగా చాటుతుంది!

- ఒబ్బిని, 9849558842