Others

అంతటా అంతర్యామియే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేణువులో వున్నావని వెతికితే సప్త్ధాతువుల వెదరు వెక్కిరించె
కాళీయ మడుగులో కాళీయుని ఫణిపై వెతికితే పరమాత్మ పాదగుర్తులు కనిపించె
వెన్నకుండలలో వెతికితె వనె్నచినె్నల గోపభామల భ్రాంతులు భాసించె
యోగనిద్రలో వెతికితె వెన్నుపాములోని వెయి వెలుగులు మిణుగులై మదిలో మిణుక్కుమనె

హింసారూపుడైన కంసుని వధతో అవనిలో అహింస ఆరంభమైనది
కన్నయ్య కరుణతో కన్నీరు పన్నీరు ప్రేమతో పలకరించింది
కృష్ణయ్య ప్రేమానురాగంతో ప్రేతరూపము పోయి వైకుంఠం ప్రాప్తించింది
విముక్తికి జీవన్ముక్తికి శక్తియుక్తుల జ్ఞాన యోగానురక్తి రసమయ కృష్ణ్భక్తి

పంచేంద్రియ పరిభ్రమణ పరమాత్ముని పగ్గములతో పట్టి నిక్షంత్రిచవచ్చు భక్తితో
వయ్యారి వయ్యారీ నడుమ మురారి నుంచి ముద్దు మురిపెము లూదినచో ముచ్చటైన ముక్తి
దేవకీగర్భమును దయించిన దేదీప్యమాన దివ్య ఏహం దేహధారుల తాప్రతినివారణం
గోదాదేవి పాశరముల పారాయణతా పారవశ్యం జన్మజన్మల పుణ్యపలితం

మురళీగాన రవళి శ్రవణం గోపికల హృదయాలతో రేపే ప్రేమావేశం
వేణునాద రాగసుధామయం సర్వసంకల్పరసితం పరమాత్మతో తాదాత్మ్యం
విషయాసక్తిలేని పరమ విరాగ విరహసక్తి విశ్వరూప ప్రదర్శన ప్రసాదం
జలక్రీడా సమాసక్త గోపీవస్త్రాపహరణ దేహాభిమాన సంహారి చోర వల

అద్భుత అధ్యాత్మిక క్రీడ శ్రీకృష్ణ రసరాగ రాసక్రీడ వికాస విలాస విన్యాస రాసలీల
వాసనాక్షయమైతేనె వాసుదేవుడి బడిలో గోపీగీతల విలాస విరహ వ్యధ గాధలు
మైమరిచి మేనులతో దివ్య పారవశ్యభక్తి రసాయన వరద ప్రవాహం గోపీగీతలు
గోప్యము లేని సృదయం ప్రేమలతో గోపికలు గోవిందుని గుండెలో గూడు కట్టుకొనిరి
మల్లెల నవ్లు వెనె్నల వనె్నలలో గోపికలు గోవిందుడి గుండెలో గూడు కట్టుకొనిరి
మురళీనాదం ముగ్ధ మనోహర మంజుల మోహన రాగం పరమ ప్రమోద ప్రణవం
దేహేంద్రియ మనవోబుద్ధుల కావల శ్రీకృష్ణ చైతన్యం లో స్రంకులిడిన తాపశ్రమనం
కృష్ణ పరమాత్ముని కృపాసాగర అద్భుత అలలపై ఆడుకుంటే అమితానంద తకధిమితోం

జనని కట్టిన రజ్జు పరంపర జగజ్లా ముగల బొజ్జను కట్టజాలక పోవడం దారాపుత్రులపై మోహం
ఱోలు కదిలి రెండు మద్దిచెట్ల మధ్యకు మాధవుడరుదెంచి త్రెంచె ఊలూకుల బంధనం
దోచుకోక దాచుకోక హుంకర్చింక అహంకరించక సమర్పించు సర్వస్వం
అంతటా అనంతుడే అంతయూ ఆయనేనని అనుక్షణం అనుకొంటేనే అతని అనుగ్రహం
శ్రీరంగమైన నా అంతరంగం నారాయణు రశ్మిమంతం దేవాసుర ననుసృతం రాధాకృష్ణామృతం

నవనీత చోరం చిత్తాపహరణం చిద్రూపప్రదర్శనం పరమానంద పారవశ్య కారణం
శ్రీవత్సవక్షాంతరం షోడశాక్షరీ మంత్రమాలా విశ్వరూప వ్యాపకానికి మూలాధారం
షోడశోత్తర సహస్ర గోపికా పరివృత రాధామాధవ రసరంజన చిద్విలాసం
సంసార కారాగాఱం నుండి శ్రీకృష్ణ ఆత్మగౌర ప్రవేశం పరబ్రహ్మ ప్రత్యక్షం

విరహంలో విలాసం వియోగంలో మాధుర్యం సంయోగంలో భోగం శృంగారంలో కైవల్యం
గోపికల భక్తి విరహ శృంగారం రాధాదేవి రక్తి రసమయ అవలోక కృష్ణలోకం
వెదికే భక్తి గోపికలది పొందిన ఫలం రసాయన రాధామాధవ కలయిక పారవశ్యం
గోవులు గోపికలు గోపాలురు గాయత్రీ మంత్రం తో గోపాలుడిని ధ్యానిస్తే గోలోక ప్రాప్తం
నాదానుసంధానం వేణుగానం దేవరాగం బ్రహ్మగాంధర్వం నారద తుంబురుల ప్రచారం

- ఆర్. లక్ష్మణమూర్తి 7207074899