Others

తిలకధారణం సకలైశ్వరప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూమతానుయాయులందరూ నుదుటి యందు విభూతి, చందనం, కుంకుమగాని ధరించటం సంప్రదాయం. వీటిల్లో ఏది ధరించినా వారు హిందువులే. విభూతిధారణ పరమేశ్వరుని స్ఫురింపజేస్తుంది. అలాగే గోపీచందనధారణ విష్ణుమూర్తిని స్ఫురింపజేస్తాయి.
‘విభూతిర్భూతిరైశళ్వర్యమ్’, విభూతి అంటేనే ఐశ్వర్యం. గోమయంతో అంటే ఆవుపేడతో విభూతి తయారుచేస్తాము. సకల దేవీ దేవతలు కూడా గోవు శారీరక భాగాల్లో నివసిస్తారని మనపురాణాలు చెబుతాయ. గోమలాన్నుంచి తయారుచేసే విభూతి సంపదకు చిహ్నం. లక్ష్మి ప్రధానంగా ఐదు ప్రదేశాల్లో నివశిస్తుంది. గోవు పృష్ఠ్భాగం, వివాహిత స్ర్తి యొక్క పాపిటయందు, ఏనుగు యొక్క కుంభస్థలం, పద్మము, బిల్వదళాలు. లక్ష్మినిలయాలైన పద్మము, బిల్వదళాలకు నిర్మాల్యదోషం వుండదు గనుక పదిరోజులవరకూ పూజార్హమైనవిగా పరిగణిస్తాం. గోవును పెంచి పోషించడం ద్వారా దేశ ప్రగతి శోభాయమానంగానే కాక ఋణభారం కూడా తగ్గుతుంది.
దారిద్య్ర నిర్మూలం కావాలన్నా, సర్వసౌభాగ్యాలు నెలకొనాలన్నా విభూతిధారణ అనుష్ఠాన సమయాల్లోనేగాక ఇతర సమయాల్లో కూడా విధిగా ధరించడం ఉత్తమోత్తం. విభూతియే సర్వసృష్టిలోని మర్మాన్ని తేటతెల్లం అవుతుంది. విభూతిని ధరిస్తే ఆత్మోన్నతి కలుగుతుంది.
నిత్య చైతన్య శక్తికి చిహ్నంగా మనం విభూతిధారణ చేస్తాం. అంతా శివమయమని, శివునిలోని అంతర్భాగలమే మనమని ఈ విభూతి ధరించడం లో అంతరార్థమని కొందరు అంటారు. శివుడు అంటే పరమాత్మలేని చోటు కాని వస్తువు కానీ లేదు కదా. ఒక వస్తువుని కాలిస్తే అది తెల్లటి బూడిదగా పరిణమిస్తుంది. ఏ వస్తువును కాల్చినా కూడా లభ్యమయ్యేది చివరకు బూడియే గదా. విజ్ఞానమనే అగ్నిగుండంలో మనం ప్రతి వస్తువును కాలిస్తే చివరకు మిగిలేది శివుడు లేక పరబ్రహ్మ మాత్రమే.
అలాగే రక్తవర్ణం కలిగిన కుంకుమ లక్ష్మీదేవిని స్ఫురింపచేస్తుంది. మహావిష్ణువు అలంకార ప్రియుడు కనుక ఆయనకు సుగంధాన్నిచ్చే గంధాన్ని కుంకుమలను సమర్పించడం ఆచారంగా వస్తోంది. శివునకు ఒక బిల్వదళమూ, కాసిని నీళ్లు సమర్పిస్తే బోళాశంకరుడు అనంతమైన సంపదల నిస్తాడు. అట్లాగే మహావిష్ణువుకు తులసి దళాలనిస్తే సంతృప్తి చెంది అష్టైశ్వర్యాలను అందిస్తాడు. కృష్ణ్భగవానుడికి ఓసారి కుబ్జ అను వనిత చందనాన్ని సమర్పించదట. అపుడు ఆ భగ వానుడు ఆమెలోని భక్తిని స్వీకరించి కురూపియైన ఆమెను అత్యంత సౌందర్యవనితగా మార్చేశాడు. ఈ ఘట్టం గుర్తుకు వచ్చి భగవానుడైన శ్రీకృష్ణుడు, గోపవనితలు కూడా మన హృదయ సీమలో సాక్షాత్కరిస్తారు.
అందుకే ఏ రూపంలోనైనా సరే తిలకం ధరించటం హిందూమతం యొక్క విశిష్ట ప్రత్యేకత. తిలకధారణను బౌద్ధులు, జైనులు కూడా ఆమోదిస్తారు. వారుకూడా ఫాలభాగానే్న కొన్ని చిహ్నాలు ధరిస్తారు. విభూతి మనల్ని సర్వదా కాపాడుతూ, కర్మ సిద్ధాంతాన్ని, పరమేశ్వరతత్వాన్ని మనకు స్ఫురింపజేస్తుంది. మనమందరం జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలు రెండింటినీ అనుభవింపవలసిందే. వాటి తీవ్రతను తగ్గించుకొనగలమే గాని వాటిని పూర్తిగా నిర్మూలించలేము. జపతపాలు, ఇతర కర్మకాండలు కొంత ఉపశమనానికే. మనం చేసిన కర్మ ఫలితాన్ని మనం అవశ్యం అనుభవింపవలసిందే. పాపాల నుంచి ఉపశమనం కలిగించేది, పాపాలకు దూరంగా ఉంచేది విభూతి ధారణ కనుక మనమందరం విభూతి ధారణ చేద్దాం. సకలైశ్వర్య వంతులం అవుదాం.
స్ర్తి పురుషులు ప్రాతఃకాలంలో లేచి స్నానాది కాలకృత్యాలు నెరవేర్చుకొని, విభూతి, తిలకధారణ ఇతర పూజాది కార్యక్రమాలు వారి వారి ఆచారాల ప్రకారం నిర్వర్తించి ఈశ్వర కృపకి, అమ్మవారి అభయహస్తాన్ని పొందగలరని, ఆ దిశగా దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకోగలరని, తద్వారా భారతీయ జీవన పద్ధతుల్ని అందులోని తాత్విక దృక్పథాన్ని ఆకళింపు చేసుకోవాలని ఆశిస్తూ .

-చివుకుల రామమోహన్