AADIVAVRAM - Others

ఆత్మజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితమే ఓ నాటకం
దానికితోడు వ్యాపకం
ఏదో చేయాలని
ఏమో కావాలని
అనుక్షణం తాపత్రయం
అందుకే వదల్లేరు ఈషణత్రయం
తామెవరో! తమ దారేమిటో
ఈ దారికి సూత్రధారి ఎవరో
సూత్రప్రాయంగానైనా ఆలోచించరు.
ఈషణ్మాత్రం ఊహించరు
న్యాయా న్యాయ విచక్షణా
చక్షువులు మూసుకున్నప్పుడు
పాపపుణ్యాల మాటను పక్కనపెట్టి
తమకోసం తమ వారి కోసం
తరతరాల వరకు తరగని సంపద కోసం
ఏ గడ్డి తినడానికైనా సిద్ధపడే
ఈ గుడ్డి
మానవులకు స్వార్థమే పరమార్థం
సత్యానే్వషణే అనర్థం
ఆత్మజ్ఞానమే వ్యర్థం
అడ్డాలనాడు బిడ్డలుగాని గడ్డాలనాడు బిడ్డలా
శాస్తజ్ఞ్రులు చెప్పినా
వేద పండితుల వంటి విజ్ఞులు చెప్పినా
తలకెక్కదు తలతిక్క దిగదు
పెడదారి వెంటే వెళ్తారు
ఆ జడధారి కూడా దారి చూపలేడు
అందుకే ‘బుద్ధిః కర్మానుసారిణీ’ అన్నారు.

-షణ్ముఖశ్రీ.. 8897853339