Others

లెహంగాలు అదరహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్ళైనా, నిశ్చితార్థమైనా, సంప్రదాయానికి సంబంధించిన ఎటువంటి వేడుకైనా.. అమ్మాయిలు సాంప్రదాయ దుస్తులనే ఎంచుకుంటారు. నేటి అమ్మాయలు వేడుకలకి చీర, పరికిణీ ఓణీలను పక్కకు నెట్టి లెహంగాలకే ఓటేస్తున్నారు. లెహంగాలు దక్షిణ భారతదేశ సంప్రదాయం కానప్పటికీ ఉత్తర భారతదేశ సంప్రదాయ పోకడలను యువత ఎక్కువగా ఆచరించడం వల్ల పెళ్ళిళ్లలోని సంగీత్, మెహెందీ వేడుకల్లో లెహంగాలు అధరెహో.. అనిపిస్తున్నాయి. పెళ్ళికూతురుతో పాటు మిగిలిన అమ్మాయిలు కూడా పెళ్ళి వేడుకలైనా, కాస్త పెద్ద వేడుకలైనా వస్త్ధ్రారణకు లెహంగాలనే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు షాపింగ్‌మాల్స్‌లోనూ, బొటిక్స్‌లోనూ డిజైనర్ లెహంగాలు కొలువు తీరుతున్నాయి. కానీ వీటిని ఎంచుకునేందుకు కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే..
* షాపింగ్‌మాల్స్ ఆ వెలుగుల జిలుగుల్లో లెహంగాలు ఒక మాదిరిగా కనిపిస్తాయి. బయట సాధారణ వెలుగులో అవి మరోలా కనిపిస్తాయి. కాబట్టి లెహంగాను వేసుకుని ఫొటో తీసుకుంటే అది మీకు సరిగ్గా నప్పిందో లేదో తెలుస్తుంది.
* లెహెంగాలను ఎంచుకునేటప్పుడు ముదురు రంగు దుస్తులకే ప్రాధాన్యమివ్వాలి. ఇలాంటివి వేసుకోవడం వల్ల ఫొటోల్లో, వీడియోల్లో చాలా బాగా కనిపిస్తారు.
* వేడుకలను బటి ట లెహెంగాలను ఎంచుకోవాలి.
* బ్యాక్‌లెస్, నెట్టెడ్, డీప్‌నెక్, క్రాప్‌టాప్ ఎంచుకుంటే లో దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి వాటిని కూడా వేసుకుని చూస్తే మంచిది.
* హెవీ లెహెంగాలను వేసుకున్నప్పుడు చాలా తక్కువ నగలు వేసుకోవాలి. చెవులకు పెద్ద పెద్ద లోలాకులు పెట్టుకున్నా, మెళ్లో మాత్రం చాలా తక్కువ నగలు వేసుకోవాలి.
* బ్లవుజ్‌పై డిజైన్ చాలా తక్కువ వున్నట్లయతే లాంగ్ చెయన్ల వంటివి కాకుండా మెడ వరకు మాత్రమే వుండే చోకర్లను ధరించాలి.
* పెళ్లి వేడుకలకు లెహంగాలను ఎంచుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. పెళ్లిలో ఎక్కువగా కూర్చోవడం, నిల్చోవడం, అటూ ఇటూ తిరగడం చేయాల్సి వస్తుంది. అందుకే లెహంగాను కొనుగోలు చేసేటప్పుడు ఒకసారి వేసుకుని చూసుకోవాలి. దానితో సులభంగానే నడవగలుగుతున్నారా? కూర్చుని తేలిగ్గా లేవగలుగుతున్నారా? లేక ఏవైనా ఇబ్బందులున్నాయా.. అని పరిశీలించుకోవాలి.
* లెహంగా ఎత్తుకు సరిగ్గా సరిపోయేది కాకుండా కాస్త పొడవుగా ఉండేది ఎంచుకోవాలి. సరిగ్గా పాదాల వరకే వస్తే చూడటానికి అస్సలు బాగోదు. పైపెచ్చు ఎత్తు మడమలున్న చెప్పులు వేసుకుంటే లెహంగా పొట్టిగా కనిపిస్తుంది. కాబట్టి కాస్త పొడవుగా, నేలపై జీరాడేలా ఉన్న లెహంగాను ఎంచుకోవాలి.
* లెహంగా డోరీలు కట్టుకోడానికి అనువుగా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. లెహంగా బరువు ఎక్కువగా ఉంటే డోరీలు లెహంగా బరువును ఆపలేవు. అప్పుడు వాటికి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవలసి వస్తుంది. కాబట్టి లెహంగాను ఎంచుకునేటప్పుడే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
* వాతావరణాన్ని బట్టి లెహంగాలను ఎంచుకోవాలి. లెహంగాలకు వాడే వస్త్రం ఎలాంటిదో సరిచూసుకోవాలి. చలికాలం అయితే మక్‌మల్, సిల్క్ తరహావి, ఎండాకాలంలో కాటన్, ఇకత్ వంటివి ఎంచుకుంటే సౌకర్యంగానూ, ట్రెండీగానూ ఉంటాయి. లెహంగాల గురించిన విషయాలను తెలుసుకున్నారుగా.. ఇంకెందుకాలస్యం వేడుకకు అనువైన ట్రెండీ లెహంగాలను ఎంచుకుని అందంగా, ట్రెండీగా కనిపించండి మరి.