Others

రామాయణ పఠన.. స్ఫూర్తిప్రదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆంధ్ర వాల్మీకి’’ హస్తంబునందు నిలిచి
రూప్యములు వేనవేలుగా ప్రోగుచేసి
దమ్మిడైనను దానిలో దాచికొనక
ధరణి జాపతి కర్పించి ధన్యవైతి
కలదె నీకంటె గొప్ప టెంకాయ చిప్ప.
అని ఆ చంద్రార్కరమూ యశోకీర్తిచంద్రికలు గొన్న టెంటాయ చిప్ప నాడు శ్రీవాసుదాస స్వామి వారు చేతబూని ఉండేవారు.వారు 1936లో పాంచభౌతిక శరీరమును విడిచి రామసన్నిధికి ఏగినా ఇహంలో వారి నామస్మరణ చేయని వారు కోదండ రామాలయాన్ని దర్శించని వారు అరుదనే చెప్పుకోవాలి. 1863లో కడప జిల్లా జమ్మలమడుగు లో శ్రీ వావిలికొలను రామచంద్రరావు, శ్రీమతి కనకమ్మలకు ద్వితీయ సంతానంగా జన్మించిన వీరు చిన్ననాటి నుంచే రామభక్తులుగా ఎదిగారు. వీరు 21 ఏళ్లప్రాయంలో ఉండగా చిట్వేలు మండలము నందలి కంపసముద్రము ఆగ్రహార వాస్తవ్యులైన శ్రీచేట్లూరి నరసింహాచార్యులు వారు రామదాసుగారికి దగ్గరకు వచ్చారు. చూసిన తోడనే వీరు ఈనాడు సుబ్బారావుగా నున్ననూ కాలాంతరంలో రామదాసుగా మారుతారు అని ఆలోచించారు. దానికి తగ్గట్టుగా ‘శ్రీరామ షడక్షరీ’ మంత్రాన్ని సుబ్బారావుకు ఉపదేశించి శ్రీరామానుగ్రహప్రాప్తిరస్తు అని ఆశీర్వదించి వెళ్లారు. కాలానుగుణంగా రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. ఈ కాలంలో వీరు శ్రీకుమారాభ్యుదయము అని మన్మథుని చరిత్రము రచించి ప్రచురించారు. ఆ తరువాత వారు తహసిల్ దారుగా పదవోన్నతిని పొందారు. కానీ క్షయ వ్యాధితో చాలారోజులు బాధపడి ఆ ఉద్యోగానికి రాజీనామ ఇచ్చారు. ఆ తరువాత తిరిగి ఉద్యోగం కోసంప్రయత్నం చేయసాగారు. అపుడే హైందవోన్నత పాఠశాలలో వీరికి తెలుగు పండితునిగా ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత వారు ప్రెసిడెన్సీకళాశాలో ఆంధ్రోపన్యాసకులైరి. ఆకాలంలోనే వారు గోపీనాథ రామాయణం, మొల్లరామాయణం, రంగనాథ రామాయణం, లాంటి వాటికి పద్యముల అనువాదంతో రామాయణమును రచించారు. 24000 శ్లోకములకు 24000 పద్యముల అనువాదాన్ని చేసి ఒంటిమిట్ట కోదండరామునికి అంకితం ఇచ్చారు. అపుడు అక్కడికి వచ్చినవారు ఆ అనువాదాన్ని అంతా చూసి పరిశీలించి భేష్ భేష్ అని మెచ్చుకుని సుబ్బారావుగారికి ‘ఆంధ్రావాల్మీకి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. అదే ఆంధ్రావాల్మీకి రామాయణముగా ప్రసిద్ధికెక్కినది.
తరువాతి కాలం అంతా రామసేవకొరకు అంకితం చేశారు. కోదండరామాలయానికి చేరి టెంకాయ చిప్పను చేత ధరించి అందరినీ రాముల వారికోసం భిక్ష అడిగి తాను స్వయంగా రచించిన కీర్తనలు ఆలపిస్తూ ఇంటింటికి తిరిగేవారు. అట్లా పోగుచేసిన డబ్బును కోదండ రామాలయ పునరుద్ధరణ చేశారు. అప్పటి రామదాసు వలె ఈ వాసుదాసుకూడా అంటే భగవంతుడైన వాసుదేవునకు దాసుడు అని సీతారామ లక్ష్మణులకు మంచి ఆభరణాలను చేయించారు. శేష, గరుడ, అశ్వం వంటి వాహనాదులను ఏర్పరిచారు. రథశాలను నిర్మింపచేసి రథాన్ని తయారు చేసారు.సీతారాములకు నిత్యోత్సవ, వార్షికోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ , త్రైమాసికోత్సవ, ఇలా ఎన్నో ఉత్సవాలను, అర్చనాదులను, వివఏష వేడుకలను జరిగేట్లుగా పద్ధతులను ఏర్పాటు చేశారు.
అందుకే ఇప్పటికీ వావిలికొలను సుబ్బారావుగారిని వాసుదాసు స్వామి అని గౌరవిస్తారు. రామదాసుగా ఆయన్ను కీర్తిస్తారు. రామునికి సేవచేసి తన జీవితాన్ని ధన్యత చేసుకొన్న మహనీయుడు వాసుదాసు స్వామి.

-చివుకుల రామ మోహన్