Others

సృస్థిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరీక్షణ ఏదీ కూడా నిస్తేజమైన నిర్వీర్యమైన
భావ ప్రకటన కాదు
అలసిపోయిన ప్రపంచం
తుఫానుల గర్భవాసానపుట్టినవాడికోసం
ఎదురుచూట్టమంటే
క్షణాలన్నీ
ఆత్మశిక్షణలో అభ్యం జనించటమే..
బాధలు
అశ్రువుల్ని బంధించవు
ఐతిహాసిక క్షేత్రాల్లో కర్తవ్యాన్ని ప్రవహింపజేస్తాయి
ఈ ఝురీ తరంగాలే నన్నిపుడు
ఝంఝామరుత్సంహితలోకి నెట్టేశాయి
మబ్బులు దాచుకున్న పిడుగులు
నా అడుగులు అక్షరాలు...
నీలిమలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ
చూచుకాగ్రంమీద
సూర్యగోళాన్ని నిలిపిన సారసాన్ని చూస్తుంటే
అసూయాంతరంగపు చీకటి లోయల
అవధిని దాటి
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404