Others

విచక్షణ లేకపోతే వినాశనం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం వడ్డించిన విస్తరి కాదు లేచింది మొదలు నిద్రించేదాకా సగటు మనిషి అనేక సమస్యలతో సతమతమవుతుంటాడు. ఇంకా చెప్పాలంటే సమస్యలతోనే లేస్తూ ఆ సమస్యల తాలూకూ ఆలోచనతో నిద్రలేని రాత్రులను గడుపుతుంటాడు. తానేం తిన్నా తినకపోయినా గుట్టుగా కాలం వెళ్లదీస్తూంటాడు. భర్త గుట్టు భార్యకి, భార్య గుట్టు భర్తకి తెలియకుంటుందా? ఇంటిగుట్టు లంకకు చేటని, లోగుట్టు పెరుమాళ్ల కెరుకని లోక విదితమేకదా. గుట్టుగా కాపురం చేసేవారైనా, ఎన్ని సమస్యలున్నా తామెలా ఉంటుంది మరొకరికి తెలియనంత గోప్యత పాటిస్తున్నా మానవజాతిలో ఎక్కువమందికి తమ జీవితం ఎలా ఉందన్న దానికన్నా ఎదుటివారి జీవితంలోని గుట్టుతెలుసుకోవాలన్న ఉబలాటం, తెలుసుకొన్న దానికి మరికొంత ఉన్నది, లేనిది జోడించి పదిమందిలో ప్రచారం చేసి ఆనందించడం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది.
సంసారంలో గుట్టు మేలు చేస్తుంది. వెంటనే కాకపోయినా కొంత ఆలస్యంగా నైనా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. వ్యవహారం నలుగురితో కూడింది కాబట్టి గుట్టు సాధ్యం కాదు. రోగం విషయంలో ఐతే గుట్టు మంచిది కాదు. ఎంత త్వరగా రట్టు చేస్తే నలుగురికి తెలిసీ నలుగురు ఏదో ఒక సలహా ఇస్తారు. వాటిల్లో మంచిది ఏదో తెలుసుకొని దాన్ని పాటించి రోగాన్ని దూరం చేసుకొని ఆరోగ్యవంతులు కావచ్చు.
ఎంత వేగంగా రోగానికి సంబంధించి గుట్టు రట్టుచేస్తామో అంత వేగంగా ఆరోగ్యం మెరుగు అవుతుంది. ఎక్కడ ఏది అవసరమో ఏది అవసరం కాదో గుర్తించే విజ్ఞత మనిషికి అవసరం. అలాగని లోపాయికారి వ్యవహారాలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. తమ తెలివితేటలకు తామే మురిసిపోయేవారు కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకొనే చందం తప్ప మరొకటి కాదు. మూసిన గుప్పెట్లో ఏమున్నది లేనిది అది తెరిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. గుప్పెండ మనసులో ఎనె్నన్ని గుట్టుల గుట్టలుదాగి ఉన్నాయో ఎవరు పసిగట్టగలరు? తప్పుల తడకలకు చిరునామ అనదగిన వారిని తెలిసిన వారెవ్వరూ మంచికి మరోపేరని అంగీకరించలేరు. అలాగని ఎక్కడ పడితే అక్కడ వారిని తప్పుల తడకలని చెప్పవలసిన అవసరమూ లేదు.
మనిషికి ఉంటే తృప్తి. పశువుకి తింటే తృప్తి అని చెబుతుంటారు. తిండిలో పశువులను మించి పోయిన మనుషులకు తన కడుపు నిండితే దారిద్య్రం తీరిందని మురిసిపోవడం తప్ప మరొకటి తెలియదు. అందువలన ఎవరికే ప్రయోజనం ఉండదు. తాను తిన్నా తినకపోయినా ఉన్నది తన చుట్టూ ఉన్న వారిలో కొందరికైనా పెట్టాలన్న ఆలోచన గొప్పది. కుడిచేత్తో పెట్టింది ఎడమచేతికి తెలియనివ్వని తీరు మరీ గొప్పది. గోరంతలుచేసి కొండంతలు ప్రచారం చేసుకొనే వారి తీరెలా ఉన్నా గుప్తదానాలతో గుండెల్లో నిలిచిపోయేవారు తరాలు మారినా సమాజంలోని ఎనె్నన్నో కుటుంబాలకు ప్రాతః స్మరణీయులే. పగలు రేయి, వెలుగు చీకటి , మం చీ చెడు పక్కపక్కనే ఉండటం అనివార్యంగా వస్తున్నదే. చీకటిని చీల్చి చెండాడుతామనే వారు ఎన్ని దీపాలు వెలిగించినా అవి ఆరిన పక్కక్షణంలోనే చీకటి తప్పదు. పదవులు, పలుకుబడులకు పరుగు తీసేవారు ప్రజల కోసం కాక వారి స్వలాభాలకే అన్నది అపతి ఒక్కరికి తెలుసు. పైకెంత అట్టహాసంగా కనిపించినా, ప్రసార మాద్యమాల ద్వారా పడికట్టు పదాలతో ప్రజలను ఎంత మభ్యపెట్ట జూసినా చెడుని తొలగించేందుకు ప్రయత్నం చెయ్యరని, కాస్తో, కూస్తో మిగిలి ఉన్న మంచిని వంచింప చూసే వారేనని తెలియనిది ఎవరికి? ఎవరి గుట్టు వారికెంత ఇంపుగా అనిపించినా చేతికి, మూతికి అంటకుండా చెడామడా తినే జాతి ద్రోహులతో చేతులు కలిపి అంతకుమించి మింగే వారి నేర్పు ఎలా ఉన్నా ఈ దారిద్య్రాన్ని రూపుమాపేందుకు కొందరైనా ప్రయత్నించకపోతే మనకు భవిష్యత్తు ఎక్కడ? ఎక్కడ?

- డా. కొల్లు రంగారావు, 9866266740