Others

పొగడ్త మంచిదే!..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశంస తిరుగులేని సాటిలేని హార్మోన్ వంటిది. దానివల్ల మనసు, శరీరం రెండూ ఉత్తేజితమవుతాయి. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. అందుకే ఎటువంటివారికైనా ప్రశంస ప్రధానం.
విమర్శనాత్మకమైన విశే్లషణలతో మనస్సు పాడుచేసుకోవద్దు. చాలామంది ఎదుటివారిలోని మంచిని గుర్తించినప్పటికీ ఆ ముక్కను వారితో చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. చెబితే తామెక్కడ తక్కువైపోతామేమోనన్నది వారి ఆలోచన. అయితే ఇంకొందరికి అహం అడ్డువస్తుంటుంది. ఎదుటివారిని ప్రశంసించవలసి వచ్చిన సందర్భాల్లో నోరు కట్టేసుకుంటారు. అప్పుడు ఇలాంటివారిని ఎవరుమాత్రం ప్రశంసిస్తారు. ప్రశంసలు కావాలని కోరుకోనివారుండరు. కాబట్టి మనమూ ప్రశంసించడం నేర్చుకోవాలి. ప్రశంసలు మన మనస్సును ఉల్లాసపరుస్తుంది. అభివృద్ధికి దోహదపడుతుంది.
ఏ వయసులో వున్నా, ఏ దశలో ఎంత ఉన్నతిలో వున్నా చిన్నపాటి ప్రశంసను కోరుకోనివారు బహుశా ఎవరూ ఉండరు. ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తించి, ప్రశంసించే గుణం అందరికీ ఉండదు. ఎవరైనా ప్రశంసిస్తే, మొహమాటానికి పొగడ్తలు వద్దులే అని ఓ మాట అనేస్తాం. కాని ఆ ప్రశంసతో మనసు ఎంత చిందులు వేస్తుందో, ఉత్సాహం ఎంతగా పరవళ్ళు తొక్కుతుందో అనుభవించినవారికి కాని తెలియదు.
నవ్వినప్పుడు మోములో ఒంపు వస్తుంది. కాని ఎన్నో విషయాల్ని సరిచేసే లక్షణం ఆ నవ్వుకు ఉంది. ఎదుటివారి అందాన్నో, పర్సనాలిటీనో, నచ్చిన గుణాన్నో, వారి వృత్తి, ఉద్యోగ మెళకువల్నో, తెలివితేటల్నో అభినందిస్తే ఆ ఆనందం నవ్వులో పరిమళిస్తుంది. ఎదుటివారిలోని గుణగణాల్ని ప్రశంసించగల వ్యక్తులు నిజంగా గొప్పవారే. చాలామందికి తోటివారిలోని మంచిని ప్రశంసించడానికి అహం అడ్డువస్తుంటుంది.
ముఖస్తుతి, పొగడ్తల్ని మర్చిపోదాం. మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి వ్యాఖ్యానం చాలు ఎదుటివారిని కదిలించడానికి. మనస్ఫూర్తిగా విష్ చేస్తే చాలు. పొగడ్త మిళితమైన పలకరింపు వారి కన్నులను తడిపేస్తుంది. ఇది ఎమోషనల్ ఆహారం. చాక్లెట్ల కంటే తీయనైనది. కిచిడికంటే పోషకాహారం. మరెన్నోవాటికంటే శక్తినిచ్చేది. అంటే రోజుకొక్కసారైనా అందే ప్రశంస రోజంతా ఎదుర్కొనే ఒత్తిళ్ళను దూరం చేయగల శక్తివంతం అయినదన్నమాట. సంతోషపూరితమైన బాంధవ్యంలో ఉండాల్సిన లక్షణాల జాబితాలో ప్రేమ తర్వాతి స్థానం పరస్పర ప్రశంసలదే.
మన ప్రశంసలకు పాత్రులయ్యేవారు వారిని వర్ణించే మన మాటలోని గొప్పతనం గ్రహిస్తారు. అంటే వారి జీవితాలు విజయపథంలో సాగడానికి మద్దతును, స్ఫూర్తిని, ప్రశంసల ద్వారా అందిస్తున్నట్లేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ప్రశంస అనే తిరుగులేని, సాటిలేని హార్మోన్ వంటిది. మనస్సు, శరీరం రెండూ సంతోషంతో నాట్యం చేయాలని వాంఛిస్తాయి.
శివుడు సమాధిలో కూర్చున్నపుడు విశ్వమంతా అతనిలో ఒదిగిపోయి వుండి, అతను ఆనందంలో నర్తిస్తున్నపుడు ఆ విశ్వం బద్ధలయిన మాదిరి, మనలోని శివశక్తి ప్రశంసలతో తడిచి ముద్దవుతుంది. ఆ స్ఫూర్తితో మన జీవితాలను పునర్నిర్మించుకోగలం. మన ధోరణిని పునఃసృష్టించుకుంటాం. విభిన్న భావోద్రేకాలకు విభిన్న నరాలు అనుసంధానం అయి ఉంటాయి. కాబట్టి నరాలు, అనుభూతులు ప్రశంసలకు వేర్వేరుగా గూడుకట్టుకుని వుంటాయి. భావోద్రేకాల న్యూరాన్ల నెట్‌వర్క్ రోగనిరోధక వ్యవస్థను, నాడీ వ్యవస్థను, జీర్ణవ్యవస్థను, హృదయ వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
మనుగడకు ప్రశంసల అవసరం ఎంతయితే వుందో ఎదుటివారికీ అంతే ఉంటుందని మనం గుర్తించాలి. ఇది విశ్వజనీన సూత్రం. ఎదుటివారికి ఏదైతే ఇస్తామో మనకూ అదే దక్కుతుంది. ‘‘మీకు కనుక ఎదుటివారి అటెన్షన్, ప్రశంస కావాలనుకుంటే ఆ రెంటినీ మీరూ ఇవ్వాల్సిందే’’. అందుకే ఎదుటి వ్యక్తుల గొప్పతనాన్ని గుర్తించండి. గుర్తించిన దానిని ఎంచక్కా వారికి చెప్పేయండి. ప్రశంసలవల్ల ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఆలోచనలకు శక్తికి రీచార్జి అవుతుంది. పరిధిని విస్తరించుకోవాలని, దయాగుణాలతో, ప్రతిదానినీ మరింతగా ప్రేమించాలని వాంఛిస్తారు. అందుకు ఎటువంటివారికైనా ప్రశంస ప్రధానం. కాబట్టి కురిపించండి ప్రశంసల జల్లు. దాంతో మీకు దక్కుతుంది మంచి ప్రశంసల పులకరింత.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660