Others

బలే బావ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడొస్తున్న చిత్రాలు గొప్పకాదని చెబితే -ఈతరానికి నచ్చదు. అలాగే -ఈతరం సినిమాను ఆసక్తిగా చూడటం ఆ తరానికి నచ్చదు. అందుకే -ఆనాటి తరం సినిమాలను చూసే అవకాశం దక్కితే, ఆతరం వాళ్లు కళ్లప్పగించి మరీ చూస్తారు. అలాంటి వాళ్లలో నాలాంటివాళ్లు చాలామందే ఉండొచ్చు. కొంగర జగ్గయ్య హీరోగా 1957లో వచ్చిన ఓ గొప్ప చిత్రం -బలే బావ. శ్రీ ధనసాయి ఫిల్మ్ పతాకంపై దర్శకుడు రజనీకాంత్ తెరకెక్కించిన మంచి సినిమా. షావుకారు జానకి, రేలంగి, గుమ్మడి, గిరిజ ప్రధాన మిగతా పాత్రలుగా వచ్చింది. -హాస్య ప్రధాన చిత్రంగా దీన్ని తీర్చిదిద్దారు. సుసర్ల దక్షిణామూర్తి సంగీత సారథ్యంలో ఆణిముత్యాల్లాంటి నాలుగు గీతాలు ఇందులో మనం వినొచ్చు, చూడొచ్చు.
కథ విషయంలోకెళ్తే -ఆ వూళ్లో శేఖర్ అనే ఆసామీ ఉంటాడు. తన భార్య పల్లెటూరి మొద్దు అని ఆమెను వదిలేస్తాడు. దాంతో అమాయకురాలైన ఆమెకు కష్టాలు, కన్నీళ్లే మిగులుతాయి. సరైన కొలువు, చేతిలో డబ్బు లేకపోయినా, శేఖర్ మాత్రం పట్నంలో మేడలోవుంటూ గిరిజలాంటి చిన్నదానితో పాటలూ, డ్యాన్స్‌లు చేస్తూ కాలం గడుపుతుంటాడు. నీ భార్యను నీకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవాలిగానీ, వదిలేస్తారా? అన్న మిత్రుడి సలహా కూడా శేఖర్‌కు రుచించదు. దీంతో -డబ్బు ఖర్చుపెట్టి పల్లెటూరి మొద్దును పట్నవాసపు పిల్లగా మారుస్తారు. అలా బస్తీ దుస్తులు వేసుకోగానే శేఖర్ తన భార్యను స్వీకరిస్తాడు. చిన్ని కథను దర్శకుడు రజనీకాంత్ తెరపై అద్భుతంగా చూపించాడు. ముఖ్య విషయమేమంటే -సుసర్ల దక్షిణామూర్తి సమకూర్చిన సంగీతం. ‘ఆనందమంతా’ అంటూ సాగే గీతానికి సుసర్ల అద్భుత బాణీని సమకూరిస్తే, అది ఘంటసాల గాత్రంలో మరింత ఒలలాడింది. ‘నా అందాల రాణి’ అంటూ ఘంటసాల, సుశీలమ్మ గాత్రంలో సాగే పాట మనసును సేదతీర్చేంత కమ్మగా ఉంటుంది. ఇక గుమ్మడి, రేలంగి, జగ్గయ్యల అభినయం చెప్పకోతగిన రీతిలో ఉంటుంది. సి నాగేశ్వర్రావు సమకూర్చిన సినిమాటోగ్రఫీ -ఓ కావ్యంలా తోస్తుంది మనకు. చివరకు చెప్పుకునేదేమంటే -పెళ్లాన్ని వదిలేసి ఎంతమందికి టోకరాలిచ్చినా, చివరకు ఏలుకుంటాను అంటే అదే పదివేలు అనుకుంటారంతా -అన్నది ఈ సినిమా నుంచి ఆడియన్స్‌కు అందే నీతి. ఈ సినిమా నాకు చాలా ఇష్టం.

-యుగంధర్, వక్కలంక